BB5 Highlights: నిప్పుల్లో కాలిన కుప్పిగంతులు.. తొండి గేమ్ లో ఆనీ "అవుట్"..!!

Bigg Boss Telugu 5 Saturday Weekend Episode Highlights Today 20th November 2021 | Bigg Boss 5 Updates
x

బిగ్ బాస్ 5 హైలైట్స్(ఫోటో: స్టార్ మా)

Highlights

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 వీకెండ్ ఎపిసోడ్(21/11/2021)హైలైట్స్

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శనివారం ఎపిసోడ్ లో భాగంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన "నిప్పులే శ్వాసగా..గుండెలో ఆశగా" టాస్క్ లో చివర్లో ఫైర్ అలారం మోగగానే మానస్, ఆర్జే కాజల్ ఇద్దరు ఫైర్ ఇంజన్ ట్రక్ ఎక్కారు. అయితే ఫైర్ హౌస్ లో ఉన్న ఆనీ మాస్టర్, సిరి హనుమంత్ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోకుండా తన ఫ్రెండ్ సన్నీకి ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ దక్కాలని మానస్ ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలని చెప్పినా కాజల్ మాత్రం ఒప్పుకోలేదు. బిగ్ బాస్ ఇచ్చిన సమయం ముగిసినా మానస్, కాజల్ ఒక ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆనీ మాస్టర్, సిరి హనుమంత్ ఇద్దరి ఫొటోలు కాలిపోయాయి.

దీంతో ఈ టాస్క్ లో మిగిలిపోయిన విజే సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడంతో సంతోషంతో వాతి కామింగ్ అంటూ పాట పాడుతూ ఆనందంలో మునిగిపోయాడు. మరోపక్క మీరంతా తొండి గేమ్ ఆడుతున్నారని అందుకే నేను టాస్క్ లో నుండి అవుట్ అయ్యానని ఆనీ మాస్టర్ ఇష్టం వచ్చినట్లుగా అటు కాజల్, ప్రియాంక సింగ్, మానస్ గురించి మాట్లాడటంతో పాటు ఆ నలుగురితో ఇక అస్సలు మాట్లాడనని శపథం చేస్తున్నానని చెప్పింది. కోపంలో ఉన్న ఆనీ మాస్టర్ తో రవి మాట్లాడిన మాటలు వారిపై మరింత కోపాన్ని తెప్పించేలా చేశాయి. ఇక మానస్, కాజల్ దగ్గరికి వచ్చిన శ్రీరామచంద్ర.. ఆనీ మాస్టర్ ని అంతలా ఏడిపించి ఉసురు పోసుకోవడం ఎందుకని అన్నాడు. దాంతో కాజల్ ఆటలో ఉసురు ఏంటని.. అలాంటి మాటలు మాట్లాడొద్దని ఇది బిగ్ బాస్ హౌస్ అని ఎవరి గేమ్ వాళ్ళది అంటూ శ్రీరామచంద్రతో కాజల్ మాట్లాడింది.

ఇక కింగ్ నాగార్జున ఎంట్రీ తరువాత ఈ వారం బెస్ట్‌ పెర్ఫర్మార్ కు బంగారం, వరస్ట్‌ పెర్ఫర్మార్ కు బొగ్గు ఇవ్వాలని మాజీ కెప్టెన్‌ రవికి నాగార్జున ఒక టాస్క్‌ ఇచ్చాడు. అందులో భాగంగా ప్రియాంక సింగ్‌, మానస్‌, ఆనీ, శ్రీరామచంద్రలకు బంగారం ఇచ్చాడు. సన్నీ, కాజల్‌, సిరి, శన్ముఖ్ జస్వంత్ తో బొగ్గు ఇచ్చాడు. స్విమ్మింగ్‌ టాస్క్‌లో సన్నీ మీద పగ తీర్చుకున్నావ్‌ కదా అని రవి మీద అనుమానం వ్యక్తం చేయగా అతడు అలాంటిదేం లేదని రవి అన్నాడు.

ఆ తరువాత సిరి హనుమంత్, శన్ముక్ జస్వంత్ లను వేరువేరుగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి అసలు వారిద్దరి మధ్య ఎందుకు గొడవ జరుగుతుందని, ఎందుకు అలా ఉంటున్నారని ప్రశ్నిస్తాడు. మొదట సిరి హనుమంత్ ని ఎందుకు అంతగా బాధపడుతున్నవని, బాత్ రూమ్ లోకి వెళ్లి తల బాదుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని అడగగా సిరి మాట్లాడుతూ "నేను ఎమోషనల్‌ పర్సన్‌. నేను ఎదుటి వాళ్లను ఇబ్బందిపెట్టె వ్యక్తిని కాను. ఎవరేమి అన్నా నన్ను నేనే బాధపెట్టుకుంటాను. రోజులు గడిచే కొద్ది నా కనెక్షన్‌ ఇంకా ఎమోషనల్‌ అయిపోతుంది. ఇది తప్పా? రైటా? తెలియట్లేదు. లైఫ్‌లో ఎప్పుడూ ఇలా అవలేదు. కానీ నేను నటించడం లేదు. నాకు ఈ ఫీలింగ్‌ తప్పని తెలిసినా సరే చేయాలనిపిస్తే చేసేస్తున్నా" అని చెప్తూ బాధపడింది.

ఆ తరువాత కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన శన్ముఖ్ జస్వంత్ ను నాగార్జున ఎందుకు డల్ అయిపోయావని అడగగా దీప్తిని చాలా మిస్ అవుతున్నానని, మెంటల్ గా చాలా వీక్ అయిపోయానని చెప్పాడు. దీంతో నాగార్జున దీప్తిని మిస్ అవుతున్న అనుకుంటే తక్షణమే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోమని చెప్పడంతో ఇకపై అలా చేయనని నార్మల్ గానే ఉంటానని నాగ్ కి మాట ఇచ్చాడు.

ఇక కెప్టెన్ మానస్ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ప్రియాంక సింగ్..మానస్ పై పెట్టుకున్న ఫీలింగ్స్ హద్దులు దాటిపోతున్నాయని, ఏదైనా చెప్తే ఆమె బాధపడుతుందని అనిపిస్తే పరిస్థితులు చేదాటిపోతాయే అవకాశం ఉందని నాగార్జున హెచ్చరించాడు. నామినేషన్ సమయం నుండి కాజల్ తో ప్రవర్తించిన పద్ధతి అస్సలు బాగాలేదని, అలాంటి ప్రవర్తన మానుకోవాలని ఆనీ మాస్టర్ కి క్లాస్ పీకాడు నాగార్జున. శనివారం ఎపిసోడ్ లో శ్రీరామచంద్ర, సన్నీ ఇద్దరు నామినేషన్ నుండి సేవ్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యులలో కాజల్, ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ లు డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories