ఇంటి సభ్యులకు గట్టిగా క్లాస్ పీకిన హోస్ట్ నాగార్జున

ఇంటి సభ్యులకు గట్టిగా క్లాస్ పీకిన హోస్ట్ నాగార్జున
x
Highlights

* హట్‌ హట్‌గా సాగిన బిగ్‌బాస్ ఎపిసోడ్‌ * అఖిల్‌, అభిజీత్ మధ్య మళ్లీ గొడవ * కెప్టెన్‌గా విఫ‌ల‌మైన హారిక‌! * మోనాల్ విషయంలో నేను హర్ట్ అయ్యా: అభి * మోనాల్‌తో లింక్ చేయ‌కండి: అభి

Bigg Boss Telugu 4 : బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 12వ వారాంతంలో ఎపిసోడ్‌లో రకరకాల ఎమోషన్స్ కనిపించాయి. ఇంటిలో వినోదంలో పాటు గొడవలు కనిపించాయి. ఇక ఇంటి సభ్యులను పలకరించిన నాగార్జున హరీకకు క్లాస్ పీకాడు. ఆమె చేసిన తప్పులను వీడియోగా చూపించి ఇలా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించాడు. అభిజిత్ కి ఫేవరేట్ గా ఆట ఆడిన నువ్వు బెస్ట్ కెప్టెన్ ఎలా అవుతావు అని అడగడంతో హారికకి మాటరాకుండా పోయింది.

బిగ్ బాస్ ఈ సీజన్ మొదలైన దగ్గర నుండే అభిజీత్, అఖిల్ మధ్య విభేదాలు మొదలైయ్యాయి. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య చాలా సార్లు మాటా మాటా పెరిగి గొడవలు జరిగాయి. అలాగే ఈ ఎపిసోడ్‌లో కూడా వీళ్లిద్దరి మధ్య వంట గది దగ్గర మరోసారి వాదన జరిగింది.

వేదిక మీదకు వచ్చిన హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను పలకరించాడు. ఆ తర్వాత హారిక దేత్తడిని ఇంటిలోని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఉత్తమ కెప్టెన్‌ అయినందుకు అభినందించారు. అయితే నా దృష్టిలో బెస్ట్ కెప్టెన్ కాదంటూ ఆమె చేసిన తప్పులను వీడియోగా చూపించి ఇలా చేయడం ఎంత వరకు సబబు అంటూ కామెంట్ చేశారు.

ప్రోమోలో వీర లెవెల్‌లో చూపిస్తారు. తీరా ఎపిసోడ్‌లోకి వస్తే మ్యాటర్ తుస్సుమనిపిస్తారు. అయితే బిగ్ బాస్ షోలో నాగార్జున హోస్ట్‌గా ఇంత వరకు నిజంగా సీరియస్ అయిన ఘటనలు చాలా తక్కువ. ఈ ఎపిసోడ్‌లో అభిజిత్‌పై నాగ్‌ బాగానే ఎక్కేశాడు. చివరకు బయటకు వెళ్లిపో అనేంతగా సీరియస్ అయ్యాడు. గేట్లు ఓపెన్ చేయండంటూ బిల్డప్ ఇచ్చాడు. చివరికి 12 వారం తర్వాత గేమ్‌ ఎలా మారిపోతుందో చెప్పలేమని హెచ్చరించాడు.

లివింగ్ రూమ్‌లో ఉన్న అందరితో నాగార్జున మాట్లాడారు. ఈవారం ఎవరెవరు ఏయే తప్పులు చేశారో చెప్పాలని అడిగారు.

ఆఖరిలో అభిజీత్‌ని నాగార్జున ఓ ఆట ఆడుకున్నాడు. టాస్క్‌లు చేయకపోవడంపై ప్రశ్నించారు. ఇక్కడ అభిజీత్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. టాస్క్‌లో భాగంగా ఇంటి చెట్టు ఆకులను ఎందుకు లెక్కపెట్టలేదు. అలాగే మోనాల్‌తో డేటింగ్‌కు ఎందుకు వెళ్లేలేదు. బిగ్‌బాస్ రూల్స్‌ను ఎందుకు పాటించలేదు అంటూ నాగార్జున క్లాస్ పీకాడు.

ఇక ఇక్కడి నుంచి గేమ్‌ రకరకాలుగా మారిపోతుందని నాగ్‌ హెచ్చరించాడు. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. 12 వారం తర్వాత గేమ్‌ ఎలా మారిపోతుందో చెప్పలేమన్నాడు.

ఈ సారి కూడా మోనాల్‌ను మరో సారి అదృష్టం పలకరించింది. మోనాల్ గజ్జర్ మరో వారం కూడా సేవ్ అయిపోయింది. 12వ వారం నామినేషన్స్‌లోకి చాలా విచిత్రంగా వచ్చిన మోనాల్. అందరికంటే ముందు సేవ్ అయిపోయింది.

నామినేషన్‌లో ఉన్న అఖిల్, అవినాష్, అరియానా, మోనాల్ గజ్జర్‌లలో సేవ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టాడు.

తమ పేరు, బొమ్మ ఉన్న ప్యాడ్‌ను ఇచ్చి అందులో ఉన్న ఓ కార్డు బయటకు లాగాలని, అందులో ఎవరు సేఫ్ అని రాసి ఉంటే వారు సేఫ్ అని చెప్పాడు. ముందుగా అరియానా, అవినాష్ లాగితే అన్ సేఫ్ వచ్చింది.

ఇక ఆ తర్వాత మోనాల్ గజ్జర్ లాగితే సేఫ్ వచ్చింది. దాంతో ఆమె ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత అఖిల్ లాగితే అన్ సేప్ వచ్చింది. దాంతో ఎపిసోడ్ ముగిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories