Bigg Boss Season 9: ఒక్క ‘నో’తో 20 లక్షలు కోల్పోయిన తనూజ

Bigg Boss Season 9: ఒక్క ‘నో’తో 20 లక్షలు కోల్పోయిన తనూజ
x

Bigg Boss Season 9: ఒక్క ‘నో’తో 20 లక్షలు కోల్పోయిన తనూజ

Highlights

బిగ్ బాస్ సీజన్ 9 ఫైనల్‌లో తనూజ గోల్డెన్ సూట్‌కేస్ ఆఫర్‌కు నో చెప్పడంతో 20 లక్షల ప్రైజ్ మనీ కోల్పోయిందా? రన్నరప్‌గా నిలిచిన తనూజ నిర్ణయం, విజేత కళ్యాణ్ అందుకున్న రివార్డుల పూర్తి వివరాలు.

బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ రన్నరప్‌గా నిలిచినా, సీజన్ మొదటి నుంచే ఆమెను ప్రేక్షకులు విన్నర్ మెటీరియల్‌గా భావించారు. హౌస్‌లో అడుగుపెట్టిన రెండు మూడు వారాలకే తనూజ ఆటకు విపరీతమైన ఆదరణ లభించింది. టైటిల్ రేస్‌లో ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ మధ్య స్థానాలు మారుతూ వచ్చినా… తనూజ మాత్రం ఎప్పటికీ హాట్ ఫేవరేట్‌గానే కొనసాగింది.

అసలు తనూజ మొదట కేవలం రెండు మూడు వారాలు మాత్రమే హౌస్‌లో ఉంటానని అనుకుని బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టింది. కానీ ప్రేక్షకుల నుంచి వచ్చిన భారీ సపోర్ట్‌తో ఆమె ఫైనల్స్ వరకు చేరింది. చివరికి టైటిల్ మిస్ అయినా, బయటకు వచ్చేసరికి తన పాపులారిటీ మాత్రం డబుల్ అయ్యింది.

గోల్డెన్ సూట్‌కేస్ ఆఫర్… కీలక మలుపు

సీజన్ 9 ఫైనల్ దశలో టాప్ 2గా కళ్యాణ్, తనూజ నిలిచిన సమయంలో హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి వెళ్లి ఇద్దరికీ గోల్డెన్ సూట్‌కేస్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే డీమాన్ పవన్ 15 లక్షలు తీసుకుని బయటకు వెళ్లడంతో, మిగిలిన 35 లక్షల ప్రైజ్ మనీలో నుంచి 20 లక్షలు తీసుకుని టైటిల్ రేస్ నుంచి తప్పుకోవచ్చని నాగార్జున స్పష్టం చేశారు.

అయితే టైటిల్ విన్నర్ అవుతామన్న పూర్తి నమ్మకంతో తనూజ, కళ్యాణ్ ఇద్దరూ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఫైనల్‌గా నాగార్జున కళ్యాణ్‌ను విజేతగా ప్రకటించడంతో తనూజ రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

‘నో’ చెప్పడంతో 20 లక్షలు చేజారాయా?

గోల్డెన్ సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చినా తనూజ రన్నరప్‌గానే ఉండేది. కానీ ఒక్క ‘నో’ అనే నిర్ణయంతో 20 లక్షల ప్రైజ్ మనీని కోల్పోయింది. అయినా డబ్బుకన్నా ప్రేక్షకుల ఓట్లు, ప్రేమే తనకు ముఖ్యమని తనూజ భావించినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు టాప్ 3లో నిలిచిన డీమాన్ పవన్ మాత్రం డబ్బు అవసరం ఉందని భావించి 15 లక్షల సూట్‌కేస్‌తో హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇక విజేతగా నిలిచిన కామనర్ కళ్యాణ్ పడాల మాత్రం 35 లక్షల ప్రైజ్ మనీతో పాటు రెమ్యునరేషన్, లగ్జరీ కారు, మరో 5 లక్షల ప్రత్యేక బహుమతి కలిపి దాదాపు 50 లక్షల విలువైన రివార్డ్స్ అందుకున్నాడు.

సెలబ్రిటీ వర్సెస్ కామనర్‌గా డిజైన్ చేసిన ఈ సీజన్‌లో ఒక కామనర్ టైటిల్ గెలవడం ప్రేక్షకులకు నిజంగానే సర్‌ప్రైజ్‌గా మారింది. అయినా… తనూజ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories