Top
logo

BB5 Promo: రంగు టాస్క్ లో ఆనీ గెలిస్తే ఇంట్లో ప్రియాంక కూడా ఎందుకుంది..??

Bigg Boss Season 5 Telugu Wednesday Latest Promo Released 27th October 2021 | Bigg Boss 5 Updates
X

BB5 Promo: రంగు టాస్క్ లో ఆనీ గెలిస్తే ఇంట్లో ప్రియాంక కూడా ఎందుకుంది..??

Highlights

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు బుధవారం రెండో ప్రోమో విడుదల

Bigg Boss 5 Telugu Promo: బిగ్ బాస్ నుండి బుధవారం ఎపిసోడ్ కి సంబంధించిన మరొక ప్రోమో తాజాగా విడుదలైంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో కెప్టెన్ పోటీదారులుగా ఎంపికకాని ఇంటి సభ్యులు గార్డెన్ ఏరియాలోనే పడుకోవడం చూడొచ్చు. తాజాగా విడుదలైన ప్రోమోలో విజే సన్నీ సరదాగా ఈ చాపలేంటో.. ఈ లాక్ డౌన్ ఏంటో అని మాట్లాడటంతో పాటు కాజల్ తో నాలుగో రౌండ్ లో ఒక గేమ్ కూడా ఆడటం చూడొచ్చు.

ఇక తను మాట్లాడింది తప్పా అని ఒక సందర్భంలో సిరి హనుమంత్ ని అడగగా అతను అవును తప్పే అని చెప్పడం.. అందుకు సిరి హనుమంత్ అలగడం.. శన్ముఖ్ జస్వంత్ ఓదార్చడం ఈరోజు ఎపిసోడ్ లో చూడనున్నాము. ప్రోమోలో ఇప్పటివరకు పోటీదారులుగా నిలిచిన శ్రీరామచంద్ర, శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ తో పాటు డైనింగ్ టేబుల్ వద్ద ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ ని కూడా చూడొచ్చు.

అయితే ఈ ఇద్దరిలో ఒకరికి సన్నీ- కాజల్ ఆడిన టాస్క్ లో విజేత సపోర్ట్ చేశారా..?? లేదా గార్డెన్ ఏరియాలో ప్రియాంక సింగ్ తో పాటు మిగిలిన ఇంటి సభ్యులు ఆడిన టాస్క్ లో గెలుపొంది ఇంట్లోకి వెళ్ళిందా అనేధీ ఈరోజు జరగనున్న ఎపిసోడ్ లో తెలియనుంది.


Web TitleBigg Boss Season 5 Telugu Wednesday Latest Second Promo Released 27th October 2021 | Bigg Boss 5 Updates
Next Story