Bigg Boss 5 Highlights: కాజల్ నీపై ఉన్న నమ్మకాన్ని కోల్పోయావంటున్న సన్నీ

* బిగ్ బాస్ సీజన్ 5 మంగళవారం (09/10/2021) ఎపిసోడ్ హైలైట్స్

Sandeep Reddy
Published on: 10 Nov 2021 11:57 AM IST
Bigg Boss Season 5 Telugu Tuesday Episode Highlights 09th November 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మంగళవారం ఎపిసోడ్ లో భాగంగా ప్రోమోలో చూపిన విధంగానే జెస్సీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి అతడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు బిగ్ బాస్. అతడికి ట్రీట్ మెంట్ అవసరమని అందుకు బిగ్ బాస్ హౌస్ వదిలి బయటికి రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఇంతవరకు వచ్చినందుకు సంతోషంగా ఉందని బిగ్ బాస్ నా లైఫ్ అనుకున్న అంటూ బాధతోనే బయటికి వచ్చి ఇంటి సభ్యులతో వెళ్ళిపోతున్న అని చెప్పడంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ కి అయ్యారు. ఇక జెస్సీ వెళ్ళిపోతున్నాడనే విషయం తెలియగానే శన్ముఖ్ జస్వంత్ తో పాటు సిరి హనుమంత్ కన్నీళ్ళు పెట్టుకున్నారు.

తన ఆరోగ్యం సరిగా లేనపుడు విజే సన్నీ, కాజల్, మానస్, ప్రియాంక సింగ్ లు బాగా చూసుకున్నారని చెప్పాడు. శన్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ ఉన్నన్ని రోజులు బిగ్ బాస్ చూస్తానని చెప్తూ ఇంటి నుండి బయలుదేరాడు జెస్సీ. ఇక ఇంటి నుండి బయటికి వెళ్ళిన జెస్సీని అనుకున్నట్లుగానే ఒక సీక్రెట్ రూమ్ కి పంపాడు బిగ్ బాస్. నామినేషన్ ప్రక్రియలో జరిగిన కొన్ని విషయాలతో ప్రియాంక సింగ్ పై కోపంగా ఉన్న మానస్ తో మాట్లాడటానికి ప్రయత్నించడం..మానస్ ఆమె నుండి మాట్లడకుండా తప్పించుకోవడంతో బాధలో ఉన్న ప్రియాంక సింగ్ కి గేమ్ ఆడటానికి వచ్చావా లేదా మానస్ కోసం వచ్చావా అంటూ ప్రియాంకపై సీరియస్ అవుతుంది ఆర్జే కాజల్.

ఆ తరువాత మానస్, విజే సన్నీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుండగా కాజల్ వారితో మాట్లాడటానికి ప్రయత్నించగా నామినేషన్ ప్రక్రియలో మా ఇద్దరిలో ఒక్కరిని కూడా బయటికి తీసుకురాలేక మా నమ్మకాన్ని కోల్పోయావు అని సన్నీ అనడంతో పాటు నామినేషన్ లో ఉన్న కాజల్, మానస్ లు ఈ వారం మన ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్ళిపోతామని అనడంతో మానస్.. నువ్వు అలా అనొద్దు అంటూ ప్రియాంక సింగ్ అనగానే కోపంతో సన్నీ నువ్వు అసలు మాట్లాడే అధికారమే కోల్పోయావని ఫైర్ అయ్యాడు.

ఆ తరువాత శన్ముఖ్ జస్వంత్ తనపై జోకులు వేస్తే కోపం వస్తుందని అలాంటింది రవి నాపై జోక్ వేయడం నచ్చలేదని సిరి హనుమంత్ తో చెప్పాడు. ప్రియాంక సింగ్ అనవసరంగా తనని గెలికిందని, నేనేంటో తనకు చూపిస్తానని శన్ముఖ్ జస్వంత్ అన్నాడు. ఇక చివరగా కోపంగా ఉన్న మానస్ వద్దకి వెళ్ళిన ప్రియాంక ముద్దు కావలా ముద్దా కావాలా అంటూ మాట్లాడి మానస్ ని కూల్ చేసింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story