logo
సినిమా

BB5 Highlights: వరస్ట్ పెర్ఫర్మార్ గా శ్వేతవర్మ.. ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో..!?

Bigg Boss Season 5 Telugu Thursday Episode Highlights 15th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Highlights

*బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్

Bigg Boss 5 Telugu Highlights: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శుక్రవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన లక్సరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు పాల్గొనగా అందులో ఆర్జే కాజల్, విశ్వా, రవి, లోబో, శ్వేతవర్మలు లక్సరీ బడ్జెట్ టాస్క్ లో గెలుపొందుతారు. ఆ తరువాత బెస్ట్ పెర్ఫర్మార్ ఎవరు.. వరస్ట్ పెర్ఫర్మార్ ఎవరనే టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకొని వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేశారు. ఇంటి సభ్యులు ఎవరు ఎవరిని వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేశారంటే..

విశ్వా -> రవి

ప్రియాంక సింగ్ -> శ్వేత వర్మ

ప్రియ -> శ్వేత వర్మ

కాజల్ -> రవి

విజే సన్నీ -> సిరి హనుమంత్

మానస్ -> సిరి హనుమంత్

శ్రీరామ్ చంద్ర -> ఆనీ మాస్టర్

ఆనీ మాస్టర్ -> లోబో

సిరి -> లోబో

జెస్సీ -> లోబో

ఆనీ మాస్టర్ -> సిరి హనుమంత్

శన్ముఖ్ జస్వంత్ -> శ్వేత వర్మ

రవి -> జెస్సీ

లోబో -> శ్వేత వర్మ

వరస్ట్ పెర్ఫర్మార్ గా అందరికంటే ఎక్కువ ఓట్లు శ్వేత వర్మకి రావడంతో బిగ్ బాస్ ఆమెని బిగ్ బాస్ జైలుకి పంపుతాడు. ఆ తరువాత ఆనీ మాస్టర్.. శ్వేత వర్మ జైలుకి వెళ్లిందని బాధపడటంతో ఆ విషయాన్ని సన్నీ కూడా శ్వేతవర్మకి చెప్పడంతో జైలు నుండి బైటికి వచ్చిన తరువాత మా మధ్య ఉన్న గొడవను క్లారిఫై చేసుకుంటానని చెప్తుంది. ఆ తరువాత శన్ముక్ జస్వంత్ వచ్చి ఆనీ మాస్టర్ కెప్టెన్సీ టాస్క్ సమయంలో శ్వేత వర్మ అసలు తన కూతురు లాంటిదే కాదు.. నాకు బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి రిలేషన్స్ వద్దు అంటూ చెప్పిన మాటలు శ్వేతవర్మకి చెప్పడంతో శన్ముఖ్ చెప్పడంతో శ్వేత కన్నీరు పెట్టుకుంది. ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న ఇంటి సభ్యుల్లో ఎవరు హౌస్ లో ఉండనున్నారో.. ఎవరు ఎలిమినేట్ కానున్నారో వీకెండ్ ఎపిసోడ్ లో తేలనుంది.

Web TitleBigg Boss Season 5 Telugu Thursday Episode Highlights 15th October 2021 | Bigg Boss 5 Updates
Next Story