logo
సినిమా

BB5 Promo: దేవరకొండ ఆటలతో సుమ మాటలతో కల్పన పాటలతో దీపావళి సంబరాలు

Bigg Boss Season 5 Telugu Sunday Episode Promo 31th October 2021 | Bigg Boss 5 Updates
X

BB5 Promo: దేవరకొండ ఆటలతో సుమ మాటలతో కల్పన పాటలతో దీపావళి సంబరాలు

Highlights

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు దీపావళి ఎపిసోడ్ ప్రోమో విడుదల

Bigg Boss Season 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం ఎపిసోడ్ లో భాగంగా బిగ్ బాస్ ఇంట్లో నాలుగు రోజుల ముందే దీపావళి పండుగతో ఇంటి సభ్యులు సందడి చేశారు. దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం 6 గంటలకే ప్రారంభంకానున్న ఎపిసోడ్ తో బిగ్ బాస్ ఇంటి సభ్యులతో పాటు బుల్లితెర ప్రేక్షకులు పండుగ చేసుకోవడానికి ఎన్నో సర్ ప్రైజ్ లతో మన ముందుకు వచ్చేశాడు.

తాజాగా విడుదలైన ప్రోమోలో యాంకర్ సుమ ఈ ఏడాది కూడా బిగ్ బాస్ హౌస్ కి గెస్ట్ గా వచ్చి తన మాటలతో మరోసారి ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులను మంత్రముగ్ధులను చేయనుంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు అతడి సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన "పుష్పకవిమానం" సినిమా ప్రమోషన్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజిపై నాగార్జునతో పాటు ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడి సందడి చేశారు. నటి శ్రియా సరన్ తో పాటు సింగర్ కల్పన తమ మాటలతో పాటలతో ఇంటి సభ్యులను ఎంటర్టైన్ చేశారు.

మరోపక్క బిగ్ బాస్ స్టేజిపై పలువురి హీరోయిన్స్ ల డాన్స్ పెర్ఫార్మెన్స్ నేటి ఎపిసోడ్ లో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇక బిగ్ బాస్ 4 ఎపిసోడ్ కంటెస్టంట్లు సోహెల్, ముక్కు అవినాష్, డాన్స్ మాస్టర్ బాబా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యుల్లో ఫుల్ జోష్ నింపినట్లుగా ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. మొత్తానికి టాస్క్ లలో ఒకరిపై ఒకరు అరుచుకొనే ఇంటి సభ్యులు కాసేపు అవన్నీ మరిచిపోయేలా బిగ్ బాస్ దీపావళి కానుకగా అభిమాన అతిధులతో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టుగా తాజాగా విడుదలైన ప్రోమోలు చూస్తే తెలుస్తుంది.


Web TitleBigg Boss Season 5 Telugu Sunday Episode Promo 31st October 2021 | Bigg Boss 5 Updates
Next Story