Bigg Boss 5 Telugu: నిజాయితీగా ఆడాలని అన్నందుకే సన్నీని జైలుకి పంపారా..!?

Sandeep Reddy
Published on: 30 Oct 2021 12:12 PM IST
Bigg Boss Season 5 Telugu Friday Episode Highlights 29th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు శుక్రవారం ఎపిసోడ్ లోనూ కెప్టెన్సీ టాస్క్ వేడి ఇంకా తగ్గనట్టుగా కనిపించింది. శుక్రవారం ఎపిసోడ్ దాదాపుగా సన్నీ సరదా సంభాషణతో పాటు ఇంటి సభ్యులతో జరిగిన మాటలయుద్ధంతో సన్నీ ఎపిసోడ్ లా కనిపించింది. కెప్టెన్సీ టాస్క్ లో ఆనీ మాస్టర్ తో జరిగిన గొడవను సర్దిచెప్పడానికి సన్నీ ప్రయత్నించిన ఆనీ మాస్టర్ రవితో ఒకలాగా సన్నీతో ఒకలాగా మాట్లాడుతూ కనిపించింది.

ఇక తన మాటలతో బుల్లితెర ప్రేక్షకులను నవ్వించిన సన్నీ వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక సమయంలో తన కోపాన్ని జెస్సి, మానస్, సిరిలపై చూపించాడు. కెప్టెన్సీ టాస్క్ లో సంచాలక్ గా ఉన్న జెస్సీ తన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదని..శన్ముక్ జస్వంత్, సిరి హనుమంత్ లకు సపోర్ట్ చేస్తూ నిర్ణయాలను తీసుకొని తమని టాస్క్ నుండి రూల్స్ బ్రేక్ చేస్తూ అనవసరంగా బయటికి పంపాడని జెస్సీపై సన్నీ, మానస్ ఫైర్ అయ్యారు.

ఇక వరస్ట్ పెర్ఫర్మార్ టాస్క్ లో ఆనీ మాస్టర్.. ప్రియాంక సింగ్, సన్నీ.. జెస్సీని, లోబో.. ఆనీ మాస్టర్ ని, మానస్.. జెస్సీని, రవి, సిరి హనుమంత్, జెస్సీలు.. సన్నీని, విశ్వా, శ్రీరాం, శన్ముఖ్ జస్వంత్.. కాజల్ ని వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేశారు. ఇక కాజల్, సన్నీకి వరస్ట్ పెర్ఫర్మార్ గా సమాన ఓట్లు రావడంతో ఆనీ మాస్టర్ తాను సన్నీకి ఓటు వేయడంతో ఈవారం వరస్ట్ పెర్ఫర్మార్ గా జైలుకి వెళ్ళాడు. మొత్తానికి ఈవారం ఎపిసోడ్ మానస్, సన్నీ, కాజల్ వర్సెస్ ఇంటి సభ్యులుగా మారింది.మరి ఈరోజు జరగనున్న వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఎవరికీ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతాడో లేదా ముందులాగా ఇంటి సభ్యులకు నవ్వుతూనే కౌంటర్ ఇస్తాడో వేచి చూడాల్సిందే..!!

Sandeep Reddy

Sandeep Reddy

Next Story