Top
logo

BB5 Latest Promo: సంచాలకులను ఆటాడేసుకున్న సన్నీ.., ఓదార్పు యాత్రలో శన్ముఖ్

Bigg Boss Season 5 Telugu Episode Latest Promo Released on 13 10 2021 | Bigg Boss 5 Promo
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Highlights

* బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బుధవారం ఎపిసోడ్ ప్రోమో విడుదల

Bigg Boss 5 Latest Promo: బిగ్ బాస్ సీజన్ 5 బుధవారం ఎపిసోడ్ కి సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. కెప్టెన్సీ పొటీదారుల కోసం బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ లో భాగంగా ఇంటిసభ్యుల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో సిరి హనుమంత్ - ఆర్జే కాజల్ సంచాలక్ గా తమకి ఇష్టమున్న టీమ్స్ కి సపోర్ట్ చేస్తూ సరైన రూల్స్ పాటించకపోవడంతో ఇంటి సభ్యులు వారిపై ఫైర్ అవుతారు.

రూల్స్ ఎవరు కూడా బ్రేక్ చేయకుండా చూడాలని కోపంతో సంచలాక్ పై అరిచిన సన్నీని సిరి హనుమంత్ క్షమాపణ చెప్పాలని అడగడం అందుకే విజే సన్నీ ససేమిరా ఒప్పుకోకపోవడం జరగనుంది. మరోపక్క కెప్టెన్ ప్రియ కూడా సంచలాక్ గా సిరి - కాజల్ వరస్ట్ అన్న విధంగా మాట్లాడటం దానికి సన్నీ తన స్టైల్ లో విజిల్ వేస్తూ సపోర్ట్ చేయడం చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ లో సన్నీ తన చేతలతోనే కాకుండా మాటలతోను బుల్లితెర ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఒక్కసారి కెప్టెన్ అయ్యే అవకాశం ఇవ్వండి బిగ్ బాస్.. ఒకసారి నా కెప్టెన్ డ్రెస్ వేసుకొని.., వారం మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటూ బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేయడం ప్రోమోలో చూడవచ్చు. మొత్తానికి ఈ ఆటకి సంచాలక్ గా సిరి హనుమంత్ - కాజల్ ని సన్నీ ఒక ఆట ఆడేసుకున్నట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

మంగళవారం ఎపిసోడ్ లో రవి టీంకి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ప్రోమోలో బాధలో ఉన్న సిరిని ఓదారుస్తూ నా బొమ్మలు పోయాయని బాధపడాలో.., బాధలో ఉన్న నిన్ను ఓదార్చాలో అర్ధం కావట్లేదు అంటూ శన్ముఖ్ జస్వంత్ చేసిన కామెంట్స్ ని బట్టి చూస్తే ఆ పవర్ ఉపయోగించి రవి.. శన్ముఖ్ టీం బొమ్మలను తమ సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ సన్నీ ఫన్ తో సిరి అలకతో శన్ముఖ్ ఓదార్పుతో సాగనున్నట్లు అర్ధమవుతుంది.

Web TitleBigg Boss Season 5 Telugu Episode Latest Promo Released on 13 10 2021 | Bigg Boss 5 Promo
Next Story