logo
సినిమా

Bigg Boss 5 Telugu: నోరు జారిన ప్రియ.. ఫైర్ అయిన లహరి, సన్నీ, రవి

Bigg Boss 5 Telugu 20th September 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
X

Bigg Boss 5 Telugu Updates: నోరు జారిన ప్రియ.. ఫైర్ అయిన లహరి, సన్నీ, రవి

Highlights

Bigg Boss Season 5 Telugu: అనుకున్నట్లుగానే సోమవారం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది.

Bigg Boss 5 Telugu Updates: అనుకున్నట్లుగానే సోమవారం బిగ్ బాస్ నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. మరోసారి బిగ్ బాస్ హౌస్ బద్ధలయ్యేలా ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకున్నారు. సోమవారం నామినేషన్స్ లో ముఖ్యంగా ప్రియ. అంతకు ముందు ఆమెని నామినేట్ చేసిన లహరి షరీ, సన్నీ లను నామినేట్ చేసింది. ఇక వారిద్దరిర్లో ఎందుకు నామినేట్ చేసిందో చెప్పే కారణాలు బుల్లితెర ప్రేక్షకులకు సిల్లీగా కనిపించింది. లహరి తనతో మాట్లాడటం లేదని. హౌస్ లో ఉన్న మగవారితో మాత్రమే మాట్లాడుతుందని పదే పదే చెప్పడం.

అందులోను యాంకర్ రవి ని ఒక పరిస్థితిలో హాగ్ చేసుకోవడం చూసానంటూ చేసిన కామెంట్స్ హౌస్ మేట్స్ కి కోపం తెప్పించాయి. ఆ విషయంపై సీరియస్ అయిన లహరి మాట్లాడుతూ యాంకర్ రవి తనకు బ్రదర్ లాంటి వాడని... తన పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటి నుండి ఒక షర్ట్ గిఫ్ట్ గా పంపమని కోరానని అంతే తప్ప ఆ సందర్బాన్ని తప్పుగా చూసి.. అందరి ముందు తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని లహరి, రవి.. ప్రియకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇంత చెప్పిన ప్రియ మాత్రం తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తించడంతో హౌస్ మేట్స్ కి మరింత కోపం తెప్పించింది. గత వారం కూడా ఇదే విధంగా పలు సందర్భాల్లో నోరుజారి చివరికి హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఉమాదేవి తరహాలోనే ప్రియ కూడా మాటలు అదుపు తప్పి ప్రవర్తించడం ప్రేక్షకులు గమనిస్తునే ఉన్నారు. తన కోపమే తనకు శత్రువు.. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందనే సామెతలు ఇప్పుడు ప్రియ పరిస్థితికి సరిగ్గా అద్దం పడుతున్నాయి. సోమవారం జరిగిన ఒక ఎపిసోడ్ తో ఇప్పటికే నామినేషన్ లో ఉన్న ప్రియ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయిందనే చెప్పాలి.

ఇక సన్నీ విషయానికొస్తే ఎందుకు నామినేట్ చేసిందో కూడా సరైన కారణం చెప్పలేకపోగా మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ అన్న మాటలకూ సన్నీ తనదైన శైలిలో ప్రియకి కౌంటర్ ఇచ్చాడు. తనకు ఆడవాళ్లు అంటే గౌరవం ఉంది కాబట్టే నన్ను మీరు ఎన్ని తిట్టిన తిరిగి ఒక్క మాట కూడా అనలేదని, లహరి గురించి అలా మీరు మాట్లాడటం తప్పు అని.. మీరు కూడా ఆడవాళ్లేనని గుర్తు పెట్టుకొని మాట్లాడండి అంటూ ప్రియకి చురకలు అంటించాడు సన్నీ.

మరోపక్క హౌస్ లో అంతకు ముందు అబ్బాయిలు స్ట్రాంగ్.. అమ్మాయిలు వీక్ అని డిసైడ్ అయిపోయి మానస్, శ్రీ రామ్ చంద్రని నామినేట్ చేసిన ఆనీ మాస్టర్ మాటలను ప్రియ కూడా తన నామినేషన్ లో కొంత వరకు వాడుకుంది. అయితే జరిగిన ప్రతి టాస్క్ లో బిగ్ బాస్ 5 అమ్మాయిలను ఒక టీంగా.., అబ్బాయిలను ఒక టీంగా ఉంచి పోటీ అయితే ఎప్పుడు పెట్టలేదు. మరి టాస్క్ లో స్ట్రాంగ్ అని వీక్ అని ఆనీ మాస్టర్ చెప్పిన కారణాలు కాస్త సిల్లీగా అనిపించాయి.. మొత్తానికి సోమవారం అమ్మాయి, అబ్బాయి అని బేధాలు ఏర్పడి సేఫ్, అన్ సేఫ్ గేమ్ అంటూ మాటలతో మొదలై మంగళవారం మీరు కిడ్స్ అంటే ఎస్ ఐయామ్ కిడ్.. అంటూ మంగళవారం నామినేషన్ ప్రక్రియ ముగిసేలా కనిపిస్తుంది...

Web TitleBigg Boss 5 Telugu 20th September 2021 Episode Highlights | Bigg Boss 5 Updates
Next Story