Bigg Boss: ఫామ్‌ హౌజ్‌కి వస్తే రూ. 30 లక్షలు ఇస్తామన్నారు.. బిగ్‌బాస్‌ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..!

Bigg Boss Kirrak Seetha Sensational Comments About Casting Couch
x

Bigg Boss: ఫామ్‌ హౌజ్‌కి వస్తే రూ. 30 లక్షలు ఇస్తామన్నారు.. బిగ్‌బాస్‌ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు..!

Highlights

Kirrak Seetha: కాస్టింగ్ కౌచ్‌ ఇండస్ట్రీలో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Kirrak Seetha: కాస్టింగ్ కౌచ్‌ ఇండస్ట్రీలో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఆఫర్ల కోసం దర్శక, నిర్మాతలు హీరోయిన్లను కాంప్రమైజ్‌ అవ్వాలనే కల్చర్‌ హాలీవుడ్‌ మొదలు టాలీవుడ్‌ వరకు ఉంది అనేది బహిరంగ రహస్యం. అయితే ఎంతో మంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి బయటకు వచ్చి తెలిపారు. తాజాగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కిర్రాక్‌ సీత కూడా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలిపి అందరినీ షాక్‌కి గురి చేసింది.

కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఓ బ్యాడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుకుంది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచనల వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకు ఓ సినిమా ఆఫర్‌ వచ్చిందని తెలిపిన సీతా.. అందుకుగాను రూ. 30 లక్షల రెమ్యునరేషన్‌ ఇస్తామని తెలిపారన్నారు. అయితే సినిమాలో నటించాలంటే.. మూవీ మేకర్స్ ని కలవాలని, ఫామ్ హౌస్ కి వెళ్ళాలని, ఫారెన్ ట్రిపులకు వెళ్లాల్సి ఉంటుందనే కండిషన్‌ పెట్టారన్నారు. దీంతో సంబంధం లేకుండా మాట్లాడడంతో తనకు అనుమానం వచ్చిందని, కెరీర్ ప్రారంభంలోనే ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తామని ఆఫర్ చేయడంతో తనకు అనుమానం వచ్చిందన్నారు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యాయనని, వెంటనే ఆ సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేశారని అసలు విషయం బయట పెట్టింది.

ఇదిలా ఉంటే యూబ్యూట్‌ ద్వారా ప్రేక్షకులకు సీత పరిచయమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా 7 ఆర్ట్స్‌ చానెల్‌లో బోల్డ్‌ కంటెంట్‌తో కిర్రాక్‌ సీతా చేసిన హంగామా అందరికీ తెలిసిందే. సరయుతో కలిసి ఆమె చేసిన బోల్డ్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. సోషల్‌ మీడియా ద్వారా పేరు సంపాదించుకున్న సీత బేబీ సినిమాతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. దీంతో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌8లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories