బిగ్ బాస్ 'గ్రాండ్' ఫినాలే 'మెగా' ఫినాలేగా మారిపోయింది..ఎంత ఖర్చో తెలుసా?

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మెగా ఫినాలేగా మారిపోయింది..ఎంత ఖర్చో తెలుసా?
x
Highlights

బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ గా ముగిసింది. ఈ ఈవెంట్ ను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. ఎంతో భారీగా గ్రాండ్ ఫినాలే నిర్వహించింది బిగ్ బాస్ బృందం.

బిగ్ బాస్ 4 తెలుగు గ్రాండ్ గా ముగిసింది. ఈ ఈవెంట్ ను ప్రత్యేకంగా తీర్చి దిద్దారు. ఎంతో భారీగా గ్రాండ్ ఫినాలే నిర్వహించింది బిగ్ బాస్ బృందం. గ్రాండ్ ఈవెంట్ గా ఈ ఫినాలేను ప్లాన్ చేయడమే కాకుండా ఆద్యంతం ప్రేక్షకులను కదలకుండా కూర్చునేలా ఆదివారం సూపర్ సండే లా చేయడంలో బిగ్ బాస్ టీం సక్సెస్ అయిందనే చెప్పాలి.

కరోనా నేపధ్యంలో అసలు ఈ సంవత్సరం బిగ్ బాస్ ఉంటుందా ఉండదా అనే పరిస్థితి నుంచి అద్భుతమైన గ్రాండ్ ఫినాలే తో బిగ్ బాస్ ముగించడం వరకూ నిర్వాహకులు చక్కని ప్లానింగ్ తో ముందుకు వెళ్ళారని చెప్పొచ్చు. వినోద రంగం కుదేలైపోయిన వేళ.. బిగ్ బాస్ వంటి పెద్ద రియాల్టీ షోను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమే. హోస్ లోకి వెళ్ళే కాంటెస్ట్ ల దగ్గర నుంచి బిగ్ బాస్ కార్యక్రమం వెనుక శ్రమించిన వారందరినీ క్షేమంగా చూసుకున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. కరోనా నేపధ్యంలో ఇదే చాలా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు.

పెద్ద వయసున్న గంగవ్వను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటూ వచ్చింది బిగ్ బాస్ టీం.

ఇక బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ కోసం కోటి రూపాయాలకు పైగా ఖర్చు చేసినట్టు చెప్పుకున్నారు. ఆ ఈవెంట్ కూడా చాలా బాగా చేశారు. నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ గ్రాండ్ గా చూపించారు. మరి ఓపెనింగ్ కోసమే అంత ఖర్చు పెడితే గ్రాండ్ ఫినాలే కోసం ఇంకెంత ఖర్చు చేసి ఉంటారో అని అనిపించడం సహజం. ఓపెనింగ్ ఈవెంట్ కి మించి అంటే రెట్టింపు ఖర్చు చేశారట ఈ ఫైనల్ ఈవెంట్ కోసం. అంటే రెండు నుంచి రెండున్నార కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసి ఉంటారని తెలుస్తోంది.

ఫైనల్స్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు మేహరీన్, లక్ష్మీరాయ్, ప్రణీత వంటి వారు వచ్చారు. అదేవిధంగా చాలా మంది పాత బిగ్ బాస్ కంటెస్టెంట్ లు కూడా వచ్చారు. అదీ కాకుండా తమన్ మ్యూజిక్ షో కూడా ఏర్పాటు చేశారు. ఇంత మంది తో నిర్వహించిన ఈ ఈవెంట్ కు అంత ఖర్చు కచ్చితంగా అవుతుందని చెబుతున్నారు.

ఇక లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ మొత్తానికి హైలైట్ గా నిలిచారు. ఆయన రాకతో ఈవెంట్ మొత్తానికి గ్రాండ్ లుక్ రావడంతో పాటు చిరంజీవి ఉన్న కొద్ది సేపట్లోనే ఈవెంట్ దూసుకుపోయింది. ప్రేక్షకులు చిరంజీవి వచ్చిన దగ్గర నుంచీ మరింత ఉత్సాహంగా ఈవెంట్ ను ఎంజాయ్ చేశారు.

మొత్తమ్మీద గత సీజన్ లో లానే.. చిరంజీవి తన మెగా ఎంట్రీ తో ఈవెంట్ మొత్తాన్ని తన చుట్టూ తిప్పెసుకున్నారు. దీంతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చివరికి మెగా ఫినాలేగా మారిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories