Geetu Royal Controversy: తిరుమలలో గీతూ రాయల్ రీల్ వివాదం


Geetu Royal Controversy: తిరుమలలో గీతూ రాయల్ రీల్ వివాదం
Geetu Royal Controversy: తిరుమల శ్రీవారి ఆలయం ముందు రీల్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ వివాదంలో చిక్కుకున్నారు. టీటీడీ నిబంధనల ఉల్లంఘనపై చర్చ జరుగుతోంది.
తిరుమలలో మరోసారి టీటీడీ నిబంధనల ఉల్లంఘన వివాదానికి దారి తీసింది. బిగ్‌బాస్ ఫేమ్ గీతూ రాయల్ తన స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో రీల్ చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశమైంది.
సమాచారం మేరకు, గీతూ రాయల్ బృందం ఘాట్ రోడ్డుతో పాటు శ్రీవారి ఆలయం ముందు ఖడ్గం సినిమాలోని “గోవిందా గోవిందా” పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రీల్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. విషయం వివాదాస్పదంగా మారడంతో ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.
టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, రీల్స్ చిత్రీకరణ, ఫోటోషూట్‌లు, వాణిజ్య వీడియోలు చేయడం నిషేధించబడింది. శ్రీవారి ఆలయం పరిసరాల్లో మైక్ ద్వారా కూడా భక్తులకు ఈ విషయమై తరచుగా హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ కొందరు నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవల తమిళనాడుకు చెందిన కొందరు యువకులు ఆలయం ముందు రాజకీయ ఫ్లెక్సీతో రీల్ చేసిన ఘటనపై టీటీడీ స్పందించి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. అలాగే కొత్తగా వివాహం అయిన జంట ఆలయం ముందు ఫోటోషూట్ చేయడంతో వారిపై విమర్శలు వచ్చాయి. వారు నిబంధనలు తెలియక చేసిన తప్పిదమని క్షమాపణలు కోరారు.
తాజాగా గీతూ రాయల్ ఘటనపై టీటీడీ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి. భక్తుల ఆధ్యాత్మిక భావాలను దృష్టిలో ఉంచుకుని నియమాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తిరుమలలో తరచూ జరుగుతున్న ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



