Bigg Boss 9 Telugu: నడుము గిల్లారంటూ ఇమ్మూ రచ్చ.. కెప్టెన్సీ ఫైట్ హై టెన్షన్, శ్రీజ ఎలిమినేషన్ ఖాయమా?

Bigg Boss 9 Telugu
x

Bigg Boss 9 Telugu: నడుము గిల్లారంటూ ఇమ్మూ రచ్చ.. కెప్టెన్సీ ఫైట్ హై టెన్షన్, శ్రీజ ఎలిమినేషన్ ఖాయమా?

Highlights

Bigg Boss 9 Telugu: Bigg Boss Telugu 9 Captaincy Race Heats Up, Is Sreeja Dhummu Out?

Biggboss 9 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 25వ రోజు హౌస్‌లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లు ప్రేక్షకులకు విపరీతమైన వినోదాన్ని అందించాయి. పవర్ కార్డు టాస్క్‌తో ప్రారంభమైన రోజు, చివరికి హై-టెన్షన్ కెప్టెన్సీ ఫైట్‌గా మారింది. ముఖ్యంగా, టాస్క్ సమయంలో ఇమ్మాన్యుయేల్ తన పట్టుదలతో హైలైట్ కాగా, సరదాగా ఎవరో తన నడుము గిల్లారంటూ చేసిన రచ్చ ప్రేక్షకులను పగలబడి నవ్వించింది. మరోవైపు, ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో, దమ్ము శ్రీజ ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కడం కష్టమేనని పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

బిగ్ బాస్ హౌస్‌లో ఎల్లో, రెడ్, బ్లూ టీంలుగా విడిపోయిన కంటెస్టెంట్స్ పవర్ కార్డు టాస్క్ లో పాల్గొన్నారు. ఈ టాస్క్‌లో ఆరెంజ్ బాల్‌ను హిప్పోకు ఆహారంగా వేయాల్సి ఉంటుంది, అయితే ఇతర టీమ్స్ దాన్ని అడ్డుకోవాలి. ఈ క్రమంలో టాస్క్ చాలా ఫిజికల్‌గా మారిపోయింది. ఎంతమంది అడ్డుకున్నా, ఇమ్మాన్యుయేల్ తన పట్టుదలతో ముందుకు సాగి హైలైట్ అయ్యాడు. చివరికి సంచాలకుడు భరణి టాస్క్‌ను పాస్ చేయాల్సి వచ్చింది. అంతిమంగా ఇమ్మాన్యుయేల్ – కళ్యాణ్ ఉన్న రెడ్ టీం విజయం సాధించి, పవర్ కార్డును గెలుచుకున్నారు.

పవర్ కార్డు గెలిచిన ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ మరో మూడు జంటలను కెప్టెన్సీ టాస్క్‌కు ఎంపిక చేశారు.. సుమన్ – తనూజ, సంజన – రాము, రీతూ చౌదరి – ఫ్లోరా షైనీ. తనూజ – సుమన్ జంట టాస్క్ రూల్స్‌ని ఉల్లంఘించడంతో, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ వారిని డిస్‌క్వాలిఫై చేశారు. దీనిపై తనూజ తీవ్ర భావోద్వేగానికి లోనై, వాష్‌రూమ్‌కు వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది. రీతూ చౌదరి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది.

తర్వాతి రౌండ్లలో రాము, రీతూ చౌదరి విజయం సాధించారు. దీంతో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, రాము, రీతూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు. త్వరలోనే వీరిలో ఒకరు ఇంటి కెప్టెన్‌గా అవతరించనున్నారు. టాస్క్ ఎంత సీరియస్‌గా సాగినా, మధ్యలో ఇమ్మాన్యుయేల్ చేసిన కామెడీ అందరినీ నవ్వించింది. "గేమ్‌లో ఎవరో నా నడుము గిల్లారు... అది ఎవరో చెప్పాలి" అంటూ ఇమ్మూ రచ్చ చేశాడు. "నా నడుము అంత బావుంటే మాత్రం, ఇలా గేమ్ అడ్డుపెట్టుకొని గిల్ల‌డం నేను పర్సనల్ అబ్యూజ్‌లా ఫీల్ అవుతాను" అంటూ ఇమ్మూ అన‌డంతో సంచాలక్ భరణి సహా తనూజ, రీతూ చౌదరి, పక్కనే ఉన్న దివ్య పగలబడి నవ్వారు. "ఆ గిల్లింది ఎవ‌రో అనేదానిపై నాకు క్లారిటీ కూడా ఉంది" అని ఇమ్మూ అనడం మరింత కామెడీని పంచింది.

బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు శ్రష్టీ వర్మ, మర్యాద మనీష్, ప్రియశెట్టి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారంలో రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, సంజనా, హరిత హరీష్, శ్రీజా దమ్ము, దివ్య నిఖిత నామినేషన్స్‌లో ఉన్నారు. గత వారం కెప్టెన్ పవన్ పవర్ వల్ల నామినేషన్ నుంచి తప్పించుకున్న దమ్ము శ్రీజ, ఈ వారం ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కడం కష్టంగా కనిపిస్తోంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం, శ్రీజ, ఫ్లోరా షైనీ ఇద్దరూ బయటకు వెళ్లే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories