Bigg Boss 9 Telugu: రీతూ చౌదరి డబుల్ గేమ్.. కడిగి పారేసిన నాగార్జున.. ఈ వారం సామాన్యుడు అవుట్

Bigg Boss 9 Telugu
x

Bigg Boss 9 Telugu: రీతూ చౌదరి డబుల్ గేమ్.. కడిగి పారేసిన నాగార్జున.. ఈ వారం సామాన్యుడు అవుట్

Highlights

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇంట్లో జరుగుతున్న డ్రామా, మోసాలు, గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇంట్లో జరుగుతున్న డ్రామా, మోసాలు, గొడవలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ వారం రీతూ చౌదరి ఇంట్లో జరిగిన మోసాలకు కేంద్ర బిందువుగా మారింది. ఆమె ఆట తీరుపై హోస్ట్ నాగార్జున శనివారం నాటి ఎపిసోడ్‌లో తీవ్రంగా స్పందించారు. రీతూ చేసిన మోసాలు, కెప్టెన్సీ టాస్క్‌లో ఆమె ప్రభావితం చేసిన తీరు, ఈ వారం జరిగిన ఇతర ముఖ్యాంశాల గురించి వివరంగా తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెండవ వారం అనేక సంచలనాలకు వేదికైంది. ముఖ్యంగా రీతూ చౌదరి ఆటతీరు, ఆమె వ్యవహరించిన తీరుపై హోస్ట్ నాగార్జున శనివారం ఎపిసోడ్‌లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రీతూ మోసాలను వీడియోలతో సహా బయటపెట్టి, ఆమెకు గట్టి క్లాస్ పీకారు. రెండో వారం కెప్టెన్సీ టాస్క్‌లో రీతూ చౌదరి చేసిన తప్పులను నాగార్జున స్పష్టంగా చూపించారు. డేమన్ పవన్‌కు కెప్టెన్సీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రీతూ అనేక మందిని ప్రభావితం చేసినట్లు వీడియోల ద్వారా వెల్లడైంది. ఇది ఆటపై తీవ్ర ప్రభావం చూపిందని నాగార్జున అభిప్రాయపడ్డారు.

నిజాయితీగా ఆడిన భరణి గురించి, రీతూ, ప్రియా ఇమ్మాన్యుయెల్‌ను విస్మరించిన తీరును కూడా నాగ్ విమర్శించారు. నాగార్జున ఆధారాలు చూపినప్పటికీ, వారు ఇద్దరూ గట్టిగా వాదించినా, నాగ్ వాటిని తిప్పికొట్టారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు కెప్టెన్సీ రద్దు చేస్తామని, ఆదివారం ఎపిసోడ్‌లో కొత్త కెప్టెన్‌ను ప్రకటిస్తామని నాగార్జున స్పష్టం చేశారు. రీతూ, డీమాన్ పవర్ మధ్య మొదలైన సాన్నిహిత్యం ఇప్పుడు కల్యాణ్‌ వరకు వెళ్లిందని ఇంట్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారు. పులిహోర కలపడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు, ఇద్దరితోనూ సన్నిహితంగా ఉండటం రీతూ డబుల్ గేమ్ ఆడుతోందన్న ఆరోపణలకు దారితీస్తోంది.

ఈ వారం ఇంట్లో మరో ముఖ్యమైన మలుపు హరీష్ విషయంలో వచ్చింది. హరీష్ భార్య హారిక అడిగిన మూడు ప్రశ్నలకు 'నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు?', 'ఇప్పుడు ఎలా ఉన్నావు?', 'ఇంకా ఏం చేయాలి?' - శ్రద్ధ పెట్టమని నాగార్జున హరీష్‌కు సలహా ఇచ్చారు. వివిధ వ్యాఖ్యలపై స్పష్టత కోరుతూ, ఆటపై దృష్టి పెట్టమని సూచించారు.

ఈ వారం ఇంట్లో తప్పులు చేసిన రీతూ చౌదరి, మనీష్, ప్రియా, మరియు స్రీజలకు నాగార్జున రెడ్ మార్కులు ఇచ్చారు. వారి ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు. చివర్లో, ఇంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఓనర్‌లను టెనెంట్‌లుగా, టెనెంట్‌లను ఓనర్‌లుగా మార్చడం ద్వారా ఆటలో కొత్త మలుపు తీసుకువచ్చారు. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే, మర్యాద మనీష్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. చాలామంది మనీష్ ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదు. మొదటి వారంలో సెలబ్రిటీల గ్రూప్ నుండి ఒకరు (శ్రేష్ఠి వర్మ) ఎలిమినేట్ కాగా, ఇప్పుడు కామనర్స్‌ నుండి ఒకరు (మర్యాద మనీష్) ఎలిమినేట్ అయ్యారు. ఇది బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం సెలబ్రిటీలు మరియు కామనర్స్‌ మధ్య బ్యాలెన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మర్యాద మనీష్ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణం తక్కువ ఓట్లు రావడం అని తెలిసింది. అలాగే, మొదటి వారంలో మోడరేటర్‌గా టాస్క్‌లో ఫెయిల్ అవ్వడం కూడా ఒక కారణం. మొత్తంగా, రీతూ చౌదరి చేసిన మోసాలు, కెప్టెన్సీ రద్దు, ఇంట్లో కొత్త భావోద్వేగ, నాటకీయ మలుపులతో ఈ వారం బిగ్ బాస్ ఇల్లు మరింత ఆసక్తికరంగా మారింది. ఆదివారం ఎపిసోడ్‌లో కొత్త కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories