Biggboss 9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. హౌసును వీడిన ఇద్దరు కంటెస్టెంట్లు

Biggboss 9:  ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. హౌసును వీడిన ఇద్దరు కంటెస్టెంట్లు
x

Biggboss 9: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. హౌసును వీడిన ఇద్దరు కంటెస్టెంట్లు

Highlights

బిగ్‌బాస్ సీజన్ 9 రోజురోజుకీ ఉత్కంఠగా మారుతోంది. ఈ వారం హౌస్‌లో ఊహించని పరిణామాలు జరిగాయి.

Biggboss 9: బిగ్‌బాస్ సీజన్ 9 రోజురోజుకీ ఉత్కంఠగా మారుతోంది. ఈ వారం హౌస్‌లో ఊహించని పరిణామాలు జరిగాయి. శనివారం ఎపిసోడ్‌లో నిఖిల్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండటం వలన ఆదివారం మరొక కంటెస్టెంట్ హౌస్‌కు గుడ్‌బై చెప్పారు. మరోవైపు, సండే ఫన్‌డే కావడంతో కింగ్ నాగార్జునతో పాటు హీరో నాగచైతన్య కూడా అతిథిగా వచ్చారు. ఒకే వేదికపై తండ్రీకొడుకులను చూసిన హౌస్‌మేట్స్ ఉత్సాహం రెట్టింపైంది.

టైటిల్ రేసులో ముందున్న కంటెస్టెంట్‌లలో ఒకరైన తనుజ గౌడ ఇటీవల తన మాటల కారణంగా నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున హౌస్‌మేట్స్ అందరినీ హౌస్‌లో మీకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉండే ఒకరి పేరు చెప్పండి అని అడిగారు.

దానికి తనుజ స్పందిస్తూ.. నాకు అలాంటి వాళ్లు ఎవరూ లేరు అని బదులిచ్చింది. ఆమె మాటలు విన్న నాగార్జున సహా హౌస్‌మేట్స్ అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే భరణి, ఇమ్మాన్యుయేల్, రీతూ, సంజన, నిఖిల్, కల్యాణ్ వంటి చాలా మంది ఆమెకు వివిధ సందర్భాల్లో సహాయం చేసిన వారే.

ఈ కామెంట్‌పై తనుజ వివరణ ఇస్తూ.. వాళ్లకి నచ్చి వాళ్లు సపోర్ట్ చేస్తే హ్యాపీగా తీసుకుంటా. నేను వెళ్లి అడగటం వేరు, వాళ్లకి వాళ్లే వచ్చి సపోర్ట్ చేయడం వేరు అని చెప్పింది. అయితే ఈ మాటలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో టాస్కులలో సపోర్ట్ కోసం పరిగెత్తిన తనుజ, ఇప్పుడు తనకు సపోర్ట్ లేదని చెప్పడం వింతగా ఉందంటూ కామెంట్స్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు.

ఆదివారం ఎపిసోడ్ సండే ఫన్‌డే కావడంతో స్టేజ్‌పై నాగార్జున, నాగచైతన్య సందడి చేశారు. చైతన్య తన తండేల్ సినిమాలోని హైలెస్సా పాటకు ఎంట్రీ ఇచ్చాడు. నాగచైతన్య.. తాను ఇండియన్ రేసింగ్ లీగ్ ఫెస్టివల్‌ను ప్రారంభించానని, హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్‌కు ఓనర్‌నని చెప్పగానే, ఇది నాకెందుకు చెప్పలేదు అంటూ నాగార్జున సరదాగా అడిగారు.

నాగచైతన్యను చూడగానే రీతూ చౌదరి ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించింది. మీరంటే నాకు పిచ్చి అని చెప్పగా, నాగార్జున నవ్వుతూ మొన్నటి దాకా నేను, ఇప్పుడు చైతూనా? అని అడగ్గా.. రీతూ సార్ మీరు మీరే సార్ అంటూ సరదాగా తప్పించుకుంది.

నాగచైతన్యలో నచ్చిన విషయం చెప్పమని నాగ్ అడగగా, రీతూ.. చైతూ గారి కాళ్లు ఉంటాయి సార్.. ఎంత తెల్లగా ఉంటాయో.. శిల్పం చెక్కినట్లుగా ఉంటాయి అని చెప్పింది. వెంటనే నాగార్జున జోక్యం చేసుకుని, హాలో రీతూ, ఆ శిల్పం చెక్కింది నేను, కూర్చో! అంటూ కౌంటర్ ఇచ్చారు. దీనికి హౌస్‌మేట్స్ అంతా నవ్వుకున్నారు.

శనివారం నిఖిల్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో హౌసు నుంచి ఆదివారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం గౌరవ్, దివ్య డేంజర్ జోన్‌లో నిలబడ్డారు. దీంతో వారిద్దరికి ఇచ్చిన టాస్క్ లో గౌరవ్ ఓడిపోయారు. దీంతో ఈ ఆదివారం ఎపిసోడ్‌లో హౌస్ నుంచి గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఫైర్ స్ట్రోమ్స్ గా ఎంట్రీ ఇచ్చిన ఆరుగురు కంటెస్టెంట్లు హౌసు నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories