Bigg Boss 8 Telugu: కట్టి పడేసిన గౌతమ్‌ జర్నీ వీడియో.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌..!

Bigg Boss 8 Telugu Bigg Boss Shares Emotional Journey of Gautam
x

Bigg Boss 8 Telugu: కట్టి పడేసిన గౌతమ్‌ జర్నీ వీడియో.. సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌..!

Highlights

Bigg Boss 8 Telugu Day 102: బిగ్‌బాస్‌ సీజన్‌ 8వ సీజన్‌ తెలుగు చివరి దశకు చేరుకుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్ధమవుతున్నారు.

Bigg Boss 8 Telugu Day 102: బిగ్‌బాస్‌ సీజన్‌ 8వ సీజన్‌ తెలుగు చివరి దశకు చేరుకుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలేకు అంతా సిద్ధమవుతున్నారు. గ్రాండ్ ఫినాలెకు అల్లు అర్జున్‌(Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో ఈసారి టైటిల్‌ను గెలుచుకునేది ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. నిఖిల్‌, గౌతమ్‌లలో ఎవరో ఒకరు టైటిల్‌ విన్‌ కానున్నారని ఇప్పటికే స్పష్టమవుతోంది. ఓటింగ్ విషయంలో కూడా ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. దీంతో బిగ్‌బాస్‌(Bigg Boss) చివరిగా ఎవరిని విజేతగా ప్రకటిస్తారన్న అంశం ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే గురువారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ గౌతమ్‌కు మంచి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. గౌతమ్‌ జర్నీకి సంబంధించిన వీడియోను బిగ్‌బాస్‌ ప్లే చేశారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో గౌతమ్‌ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, స్నేహం, ప్రేమ, హౌజ్‌మేట్స్‌తో గొడవలు వీటన్నింటినీ ఎదుర్కొంటూ టైటిల్‌ విన్నింగ్‌ కోసం తాను ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అయ్యాడన్న విషయాలను సవివరంగా ప్రస్తావించాడు బిగ్‌బాస్‌.

ఇక బిగ్‌బాస్‌ గౌతమ్‌(Gautam)పై ప్రశంసలు కురిపించాడు. ‘బలవంతుడితో గెలవచ్చు.. కానీ మొండివాడితో గెలవలేము. మనం నమ్మిన దాని గురించి బలంగా నిలబడి.. ఏమైనా ఫర్లేదు అని పోరాడే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మీరు ఒకరు. లక్ష్యాన్ని ఛేదించేందుకు మీకున్న ఏకాగ్రతను చూసి ఇంట్లో బలమైన కంటెస్టెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారు. ఇక స్త్రీల పట్ల మీకున్న గౌరవం.. ఆటలో మీ మాటలో స్పష్టంగా కనిపించింది. ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కేవలం శారీరకంగా బలమైన కంటెస్టెంట్. కానీ ఇక్కడ కండబలం ఒక్కటే సరిపోదని త్వరగానే మీరు తెలుసుకున్నారు. ఎలిమినేషన్ వరకు వెళ్లినప్పుడు మీ మనసు చలించింది' అంటూ చెప్పుకొచ్చాడు.

బిగ్‌బాస్‌ హౌజ్‌లో గౌతమ్‌కు సంబంధించిన అంశాలన్నింటినీ వీడియోలో కవర్‌ చేశాడు. వీడియో చూసిన గౌతమ్‌ ఎమోషన్‌కు గురయ్యాడు. ‘బిగ్‏బాస్ 8 త జీవితంలోనే ఒక మైల్ రాయి అని చెప్పుకొచ్చిన గౌతమ్‌.. జీవితంలో ఎవరూ నీ కోసం ఏదీ చేయరని, ఒక్కడివే నిలబడు, ఒక్కడివే పోరాడని తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. ఆ మాటతోనే ఇక్కడిదాకా వచ్చానన్న గౌతమ్‌.. హౌజ్‌లో తాను నమ్మిన కొంతమంది మోసం చేశారన్నాడు. చిన్నప్పటి నుంచి తనకు గౌరవం లభించలేదని, దానికోసమే ఈ సీజన్ కు వచ్చానని తెలిపింది. జీవితంలో తల్లి, తండ్రి, గురువు అంటూ నాష్టాంగ నమస్కారం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories