Pallavi Prashanth Prize Money: బిగ్‌బాస్‌ 7 విజేతగా రైతుబిడ్డ.. ప్రైజ్ మనీలో భారీగా కోత.. ఫైనల్‌గా చేతికి దక్కింది ఎంతంటే?

Bigg Boss 7 Telugu winner Pallavi Prashanth Check Prize Money and Remuneration After Tax
x

Pallavi Prashanth Prize Money: బిగ్‌బాస్‌ 7 విజేతగా రైతుబిడ్డ.. ప్రైజ్ మనీలో భారీగా కోత.. ఫైనల్‌గా చేతికి దక్కింది ఎంతంటే?

Highlights

Pallavi Prashanth Prize Money: ఎట్టకేలకు ఎన్నో ఊహాగానాలకు తెరపడింది. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు.

Pallavi Prashanth Prize Money: ఎట్టకేలకు ఎన్నో ఊహాగానాలకు తెరపడింది. బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. దీంతో తన అభిమానుల్లో ఎక్కడా లేని సంతోషం కనిపిస్తోంది. ఈ మేరకు విజేతగా ట్రోఫీ అందుకుని, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్‌ను అభిమానులు సాదరంగా ఆహ్వానించారు. ఊరేగింపుగా తీసుకెళ్లారు. అయితే, 7వ సీజన్ విజేతగా నిలవడం ద్వారా పల్లవి ప్రశాంత్ ఎంత దక్కించుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

తగ్గిన ప్రైజ్‌మనీ..

బిగ్‌బాస్‌ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అని ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 4వ స్థానంలో నిలిచిన ప్రిన్స్‌ యావర్‌ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకుని, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు రూ.35 లక్షలు మాత్రమే దక్కాయి. ఈ ప్రైజ్ మనీలోనూ టాక్స్‌, జీఎస్టీ ఇలా కోతలు పడగా.. రైతు బిడ్డకు దాదాపు రూ.17 లక్షలు మాత్రమే దక్కనున్నాయి.

ప్రైజ్ మనీలో సగానికిపైగా కోతలా?

విజేతకు అందిన ప్రైజ్ మనీలో దాదాపు సగానికి పైగా కోతలు ఉంటాయంట. ఈ విషయాన్ని బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌ విజేత వీజే సన్నీ ఇదివరకే తెలిపాడు. ఆ సీజన్ విజేతగా నిలిచిన సన్నీకి రూ.50 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. కాగా, కోతలు పోగా దాదాపు రూ.27 లక్షలు మాత్రమే చేతికి అందాయంట.

డబ్బులు తక్కువే అయినా..

కాగా, ఈ సీజన్ విజేగా నిలిచిన ప్రశాంత్‌కు దక్కిన ప్రైజ్ మనీ చాలా తక్కువగా ఉంది. పల్లవి ప్రశాంత్‌కు రోజుకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చారంట. ఇలా మొత్తం 15 వారాలకు రూ.15 లక్షలు అందించారం. ప్రైజ్ మనీతో కలిపితే మొత్తంగా రైతుబిడ్డకు రూ.32 లక్షలు పైగా అందుకున్నాడంట.

ప్రైజ్ మనీతో పాటు కార్, బంగారం..

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు ప్రైజ్ మనీతోపాటు మారుతీ బ్రెజా కార్ అందించారు. అలాగే, జోయాలుక్కాస్ నుంచి రూ.15 లక్షల విలువ చేసే బంగారు అభరణాలు అందించారు. అయితే, ఇందులోనూ పన్నుల కోత పోగా దాదాపు రూ.25 లక్షలు అందుకున్నాడని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories