Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ.. రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ ఐదో సీజన్ ట్రోఫీ దక్కించుకున్న సన్నీ...

Shireesha
Updated on: 20 Dec 2021 7:49 AM IST
Bigg Boss 5 Telugu Winner VI Sunny and Runner up Shanmukh Jaswanth | Telugu Online News Today
X

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ.. రన్నరప్‌గా నిలిచిన షణ్ముఖ్

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 5 లో మొత్తం 19 మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా.. టాప్ 5 లో సన్నీతో పాటు షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, సిరి ఉన్నారు. వీరందరినీ వెనక్కి నెట్టి బిగ్ బాస్ ఐదో సీజన్ ట్రోఫీ దక్కించుకున్నాడు సన్నీ.

రన్నరప్‌గా షణ్ముఖ్ నిలిచారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్, శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయ్యారు. చివరకు సన్నీ, షణ్ముఖ్ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన వీజే సన్నీ విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు.

Shireesha

Shireesha

Next Story