logo
సినిమా

BB 5: టాస్క్ మాత్రమే అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైందంటున్నా సన్నీ, మానస్

Bigg Boss Season 5 Telugu Thursday Episode Highlights 28th October 2021 | Bigg Boss 5 Updates
X

Bigg Boss Season 5 Telugu (Photo: Star Maa)

Highlights

Bigg Boss Season 5: అసలు ఆట ఇప్పుడే మొదలైందంటున్నా సన్నీ, మానస్

Bigg Boss Season 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గురువారం కెప్టెన్సీ టాస్క్ ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది.. టాస్క్ లో భాగంగా ఆరుగురు కెప్టెన్సీ పోటీదారులకు బిగ్ బాస్ థర్మాకోల్ బ్యాగ్ లు ఇచ్చి అవి టాస్క్ పూర్తయ్యే వరకు ఆగకుండా నడుస్తూనే మిగితా పోటీదారుల నుండి ఎవరు అయితే చివరి వరకు కాపాడుకుంటారో వారే ఈవారం కెప్టెన్ గా నిలుస్తారని బిగ్ బాస్ నియమాన్ని పెట్టి ఈ టాస్క్ కి సంచాలకుడుగా జెస్సిని నియమించాడు. టాస్క్ మొదట బిగ్ బాస్ పెట్టిన నియమాలు అర్ధంకాని సంచాలకుడు జెస్సిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ మరోసారి ఆ టాస్క్ నియమాలను జెస్సికి అర్ధమయ్యేలా చెప్పి పంపుతాడు. అప్పటికే టాస్క్ నుండి డిస్ క్వాలిఫై అయిన షణ్ముఖ్, శ్రీరామచంద్రలకు మరో అవకాశం ఇస్తూ టాస్క్ ని మరోసారి మొదలుపెట్టారు.

ఈ టాస్క్ లో విజే సన్నీ, శ్రీరామచంద్రలు ఒకరి బ్యాగ్ పై మరొకరు అటాక్ చేసుకోవడం అది కాస్త సీరియస్ ఫైట్ గా మారడం జరిగింది. ఇక ఆ సమయంలో సన్నీ ఆగిపోయాడని పోటీ నుండి తొలగించిన జెస్సి.. శ్రీరామచంద్రని మాత్రం ఆటలో కొనసాగించాడు. సన్నీ టాస్క్ నుండి బయటికి వచ్చిన తరువాత మానస్ కి ఆల్ ది బెస్ట్ చెప్పడం చూసిన శ్రీరామచంద్ర.. కావాలనే సన్నీని అనవసరపు మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. దాంతో ఆ మాటలకు సన్నీ.. శ్రీరామ్ పై సీరియస్ అయి నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించిన తన పద్ధతి మార్చుకోకుండా అలాగే శ్రీరామ్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడటంతో ఇద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. ఆ తరువాత టాస్క్ మళ్ళీ మొదలవగా ఈసారి మానస్, శ్రీరామ్ లను ఇద్దరినీ జెస్సి టాస్క్ నుండి తొలగిస్తాడు.

ఇక మిగిలిన పోటీదారులు ఆని మాస్టర్, షణ్ముఖ్ జస్వంత్, సిరి హనుమంత్ లలో షణ్ముఖ్, సిరి.. ఆని మాస్టర్ పై అటాక్ చేయడంతో అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని సింగిల్ గా ఆడితే ఎప్పటికీ కెప్టెన్ అవలేమని అంటూ తనకు తానుగా టాస్క్ నుండి వైదొలుగుతుంది. దీంతో మిగిలిన ఇద్దరు పోటీదారులు షణ్ముఖ్, సిరిలలో చివరికి షణ్ముఖ్ జస్వంత్ గెలిచి ఈవారం ఇంటి కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు.

టాస్క్ నుండి వైదొలిగిన ఆని మాస్టర్ అటు సన్నీ - మానస్ లు, సిరి - షణ్ముఖ్ లు గ్రూపులుగా ఆడారని తాను సింహామని అందుకే సింగిల్ గా ఆడానంటూ చెప్పిన డైలాగ్స్ నటరాజ్ మాస్టర్ ని గుర్తు చేశాయి. ఆనీ మాస్టర్ బాధలో ఉందని ఆమె దగ్గరికి వచ్చిన సన్నీపై అనవసరంగా అరుస్తూ ఆమె మాటలతో అతన్ని బాధపెట్టడం చూసిన బుల్లితెర ప్రేక్షకులకు ఆనీ ప్రవర్తన కాస్త చిరాకు తెప్పించింది. ఇక షణ్ముఖ్ జస్వంత్ టాస్క్ లో మొగాడిలా ఆడలేదని అంటూ అతడిపై కూడా నోరు పారేసుకుంది ఆనీ మాస్టర్.

ఇక గురువారం కెప్టెన్సీ టాస్క్ ని కాసేపు పక్కనపెడితే.. బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం నామినేషన్ ప్రక్రియ నుండి ఆడవాళ్లు - మగవాళ్ళు అంటూ బిగ్ బాస్ హౌస్ లో భేదాలను చూపిస్తూ మగవాళ్ళు స్ట్రాంగ్ అంటూ అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్న ఆనీ మాస్టర్.. ఎంత వరకు ఎవరి సపోర్ట్ లేకుండా ఎన్ని టాస్క్ లు ఆడిందో తనకే తెలియాలి. మానస్ సన్నీ కలిసి ఆడుతున్నారన్న ఆని మాస్టర్.

ఈ వారం నామినేషన్ ప్రక్రియలో అదే మానస్ తన ఇంటి నుండి వచ్చిన లెటర్ ని ఆని మాస్టర్ కోసం వదులుకొని నామినేషన్ కి వెళ్లిన సంగతి ఆని మాస్టర్ కి బహుశా గుర్తు లేకపోవచ్చు. కెప్టెన్సీ ఈవారం కాకపోతే మరోవారం.. అదే నామినేషన్ లో ఉన్న ఇంటి సభ్యుడు ఎలిమినేట్ అయితే అతడి పరిస్థితి ఏంటి.. ఆనీ మాస్టర్ కోసం అంత రిస్క్ చేసిన మానస్ ని ఆని మాస్టర్ కెప్టెన్సీ టాస్క్ లో ఆమె బ్యాగ్ ని కనీసం టచ్ కూడా చేయని సన్నీ, మానస్ లపై అలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమో ఆమెకే తెలియాలి.

ఇక మోజ్ రూంలో కూర్చున్న సన్నీ.. మానస్ తో ఈవారం కెప్టెన్ బ్యాడ్జిని నీ చేతికి చూడాలని ఉండే అని చెప్పగా మానస్ ఇక నుండి ఎవరిని ఎప్పుడో ఎలా టార్గెట్ చేయాలో అర్థమైందని అటాక్ అంటే ఏంటో రానున్న టాస్క్ లలో చూపిస్తానని చెప్తాడు.

ఆ తరువాత సన్నీ, మానస్ ల దగ్గరికి మాట్లాడటానికి వచ్చిన షణ్ముఖ్ ని సన్నీ నీకంటే ఆ కెప్టెన్ బ్యాడ్జ్ కి ఎక్కువ ఇస్తానని..మాటిమాటికి షణ్ముఖ్ ని కెప్టెన్ కెప్టెన్ అంటూ సన్నీ పిలవడంతో టాస్క్ లోని కోపం ఇంకా పోలేదేమోనని నన్ను శన్ను అని పిలిచినపుడే మాట్లాడుతానంటూ షణ్ముఖ్ జస్వంత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

Web TitleBigg Boss Season 5 Telugu Thursday Episode Highlights 28th October 2021 | Bigg Boss 5 Updates
Next Story