Bigg Boss 5 Promo: వాలుకనులతో ఖుషిగా మొదలై వరస్ట్ గా ముగియనుందా..!?

Bigg Boss 5 Telugu Latest Promo Released Today 01 10 2021
x

బిగ్ బాస్ సీజన్ 5(ఫోటో: స్టార్ మా)

Highlights

* శుక్రవారం ప్రోమోని విడుదల చేసిన బిగ్ బాస్ 5 తెలుగు

Bigg Boss 5 Promo: బిగ్ బాస్ సీజన్ 5 శుక్రవారం ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. "వాలుకనుల దాన" అంటూ శ్రీరామచంద్ర.. ప్రియాంక సింగ్ కోసం పాట పాడటంతో పాటు "ఖుషి" సినిమాలోని పవన్ కళ్యాణ్.. భూమిక నడుముని చూసే సన్నివేశాన్ని ప్రియాంక సింగ్ - లోబోలు కామెడీగా చేయడం శుక్రవారం ఎపిసోడ్ లో చూడబోతున్నాం.

ఇక బిగ్ బాస్ ఇచ్చిన ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేసిన యాంకర్ రవిని గేమ్ తరువాత నటరాజ్ మాస్టర్ నత్తతో పోల్చడం.. అంతకుముందు కూడా గుంటనక్క అని రవికి పేరు పెట్టడంతో నటరాజ్ మాస్టర్ పై తన అసహనాన్ని ఇంటి సభ్యుల ముందు తెలియజేయడం చూడనున్నాము.

ఆ తరువాత ఈ వారం బెస్ట్ పెర్ఫర్మార్, వరస్ట్ పెర్ఫర్మార్ ని ఎంపిక చేసుకోవడంలో భాగంగా శ్వేతవర్మ ఆర్జే కాజల్ ని వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేయడం చూడొచ్చు. ఇక మానస్ మాట్లాడేదాన్ని బట్టి తన సొంతంగా నిర్ణయాలు తీసుకోలేక వేరేవాళ్ళ మాటలను వింటున్నావని గత వారం కెప్టెన్ జెస్సీని వరస్ట్ పెర్ఫర్మార్ గా ఎంపిక చేసినట్లుగా అర్ధం అవుతుంది.

గతవారం నుండి ఇంటి సభ్యుల ప్రవర్తనని, తాజాగా విడుదలైన ప్రోమోని బట్టి చూస్తే బెస్ట్ పెర్ఫర్మార్ మానస్, ప్రియాంక సింగ్, సన్నీ.., వరస్ట్ పెర్ఫర్మార్ గా ఆర్జే కాజల్, జెస్సీ, సిరి హనుమంత్ లలో ఎవరో ఒకరు అయ్యే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories