Top
logo

BB5 Telugu Promo: బిగ్ బాస్ హౌస్ లో ఊసరవెల్లి ఎవరో తెలుసుకున్న రవి..!!

Bigg Boss 5 Telugu Latest Promo Released 28 09 2021
X

బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో(ఫోటో: స్టార్ మా)

Highlights

* బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు తాజా ప్రోమో విడుదల

BB5 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 5 సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియ ముగిసిన ఆ హీట్ మాత్రం హౌస్ లో ఇంకా అలానే కొనసాగుతున్నట్లు తాజాగా విడుదలైన ప్రోమోతో అర్ధం అవుతుంది. మంగళవారం ఎపిసోడ్ లో యాంకర్ రవి తనకున్న సందేహాన్ని నటరాజ్ మాస్టర్ తో క్లారిఫై చేసుకోడానికి గుంట నక్క ఎవరని, హౌస్ లో ఆ పేరు వచ్చిన ప్రతిసారి ఇంటి సభ్యులు అంతా తననే చూస్తున్నారని అడుగుతాడు రవి.

అందుకు నటరాజ్ మాస్టర్ నేను గుంటనక్క అని నిన్ను అన్న మాట నిజమేనని, హౌస్ లో ఉన్న ఒక ఊసరవెల్లి నీకు సరైన పేరు పెట్టానని సంతోషపడ్డాడని నటరాజ్ మాస్టర్ అనగానే.. వెంటనే యాంకర్ రవి.. విశ్వ పేరును తెలుసుకొని అతని వద్దకు వెళ్లి అలా ఎందుకు అన్నాడో కారణం అడగడంతో పాటు, ఆర్జే కాజల్ తో నామినేషన్ లో తాను చేసిన పనికి ఫిజికల్ అనే పదాన్ని ఎలా వాడుతావు అంటూ యాంకర్ రవిపై సీరియస్ అవుతూ తన సహచరులతో బాధతో కంటతడి పెట్టుకుంటుంది.

ఇక మంగళవారం జరిగే ఎపిసోడ్ లో యాంకర్ రవి తనపై మాట్లాడుకునే మాటలకు సమాధానం వెతకాలో.. తాను ఎదుటివారిపై మాట్లాడిన మాటలకు బాధపడిన వారికి ఎలా సమాధానం చెప్పాలో అర్ధంకాని స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క నటరాజ్ మాస్టర్ తన మాటలతో హౌస్ లో మంటలు పుట్టిస్తున్నాడో..లేదా తానే సింహం అనే భ్రమలో ఉండి ఇంటిసభ్యులకు పిల్లి, నెమలి, గుంటనక్క అంటూ పేర్లు పెడుతున్న నటరాజ్ మాస్టర్ కే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకు కూడా బిగ్ బాస్ హౌస్ లో సింహం ఎవరో.. పిల్లి ఎవరో తెలిసేరోజు త్వరలోనే వస్తుందని అర్ధం అవుతుంది.


Web TitleBigg Boss 5 Telugu Latest Promo Released 28 09 2021
Next Story