Top
logo

Bigg Boss 4 Updates: షో మొదలవకుండానే ఎలిమినేషన్! 'బిగ్ బాస్' ఆట మొదలెట్టేశాడు!

Bigg Boss 4 Updates: షో మొదలవకుండానే ఎలిమినేషన్! బిగ్ బాస్ ఆట మొదలెట్టేశాడు!
X

Bigg Boss telugu season 4 logo (curtesy Star Maa)

Highlights

Bigg Boss4 Updates: బిగ్ బాస్ 4 సిజన్ మొదలవకుండానే లీకులు మొదలైపోయాయి.

బిగ్ బాస్.. ఈ రియాల్టీ షో మొదలవుతుంది అంటేనే నెట్టిల్లు కళ్ళూ..చెవులూ అక్కడే పాడేసి..ఎక్కడ లేని వార్తలు మోసుకోచ్చేస్తుంది. షో చూస్తె వచ్చే మజా కంటె..సోషల్ మీడియాలో హడావుడికి వచ్చే వినోదమే ఆదరగోట్టేస్తుంది. అదిగో ఇప్పుడు మళ్ళీ ఆ హడావుడి మొదలవబోతోంది. బిగ్ బాస్ సీజన్ 4 మరి కొద్దిరోజుల్లో బుల్లితెరపై సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ షో కు సంబంధించి ప్రోమోలు విడుదల చేశారు నిర్వాహకులు. ఇక ఈ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయనతో వచ్చిన ప్రోమోలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఇక బిగ్ బాస్ 4 లో ఎవరెవరో ఉండబోతున్నారు అనే విషయం ఎప్పటిలానే సీక్రెట్ గానే ఉంచారు నిర్వాహకులు. అయితే, ఇప్పటికే లీకులు బయటకు వచ్చాయి. ఇంచుమించుగా షో లో ఉండేవారెవరో ఒక అంచనా వచ్చేసింది. అయితే, ఇప్పుడు ఆ లిస్టులో ఒకరు షో ప్రారంభం కాకుండానే ఎలిమినేట అయిపోయేలా ఉన్నారనే విషయం సంచలనంగా మారింది.

బిగ్ బాస్ రూల్స్ ప్రకారం షో లో పాల్గోనె వాళ్ళు తమ పేర్లను రివీల్ చేయకూడదు. కానీ, ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళుతున్న కాంటెస్టంట్ ల లీక్ద్ లిస్టులో ఓ సెలబ్రిటీ ఇప్పడు షో లోకి వెళ్ళకుండానే అవుట్ అని చెబుతున్నారు ఎందుకో తెలుసా.. ఈ పోస్ట్ చూడండి..

ఇది యాక్టర్.. గీతామాధురి భర్త నందూ బిగ్ బాస్ లో ఓ కంటెస్టంట్ అని అనుకున్నారు. అది లీకని అంతా భావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిన్న చేసిన పోస్ట్ తో అది నిజమే అని తేలిపోయింది అంటే లీకైన లిస్టు చాలా వరకూ నిజమనే అనుకోవాలి. ఇంకా ఇందులో చెప్పుకోవాల్సింది ఏముంది అనుకుంటున్నారా? బోలెడు ఉంది. ఈ పోస్ట్ చూస్తుంటే ఇది కావాలని చేసిన పోస్ట్ లా కనిపిస్తోంది. ఎందుకంటే, బిగ్ బాస్ రూల్స్ ప్రకారం షో లో పాల్గొనబోతున్న విషయం కాంటెస్టంట్ లు ఎవరికీ చెప్పకూడదు. కేవలం స్టార్ మా మాత్రమె ఆ వివరాలు వెల్లడించాలి. అయితే, ఇప్పుడ ఈ పోస్ట్ ద్వారా నందు ఆ నిబంధనలు ఉల్లంఘించినట్టు అయింది.

అది పక్కన పెడితే.. అన్నీ తెలిసిన నందూ ఇలాంటి పని ఎందుకు చేస్తాడు అనేది పెద్ద ప్రశ్న. బిగ్ బాస్ అంటేనే పెద్ద మాయ కదా. పబ్లిసిటీ కోసం ఎన్నో చేస్తారు. ఇదీ అందులో ఓ భాగం అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే, అసలు బిగ్ బాస్ రూల్స్ ప్రకారం నందూ బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టంట్ ల కుటుంబం నుంచి మరొకరికి వెంటనే చాన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఆ కంటెస్టంట్ కి బిగ్ బాస్ లో ఎలా ఉంటుందో.. ఏం జరుగుతుందో తెలిసిపోయే అవకాశం ఉంటుంది కదా. కానీ, నందు పేరు ఎందుకు లీకైంది? ఇవన్నీ చూస్తుంటే బిగ్ బాస్ అసలు కు ముందే కొసరు చూపిస్తున్నట్టు కనిపిస్తోంది.

నందూ పోస్ట్ తో పాటు ఇప్పుడు లీకైన పేర్లన్నీ తప్పు అనే సంకేతం పంపిస్తున్నారా.. లేకపోతె.. మరో పబ్లిసిటీ ప్లాన్ కావచ్చా అనేది తేలాలి. అయితే.. పోస్ట్ లో నందు ఈరోజు సాయంత్రం ౬ గంటలకు మళ్ళీ ఇంకో పోస్ట్ పెడతా అని అన్నారు. మరి అందులో ఎం చెబుతారో వేచి చూడాలి.

ఇదిలా ఉంటె..బిగ్ బాస్ 4 ఆగస్టు ౩౦ వ తేదీన ప్రారంభం అయ్యే అవకాశాలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమేరకు ఏర్పాట్లు జరిగిపోయినట్టు తెలుస్తోంది..

ఇప్పటికే 15 మంది కంటె స్టంట్ లు బిగ్ బాస్ క్వారంటైన్ లో ఉన్నారు. వీరంతా ౧౪ రోజుల క్వారంటైన్ ముగించుకుని బిగ్ బాస్ షో లో అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. కరోనా వైరస్ ఇబ్బందుల నేపధ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు నిర్వాహకులు తీసుకుంటున్నారు.

అభిమానులు ఈ షో కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.Web TitleBigg Boss 4 Updates Bigg boss creating curiosity about contestants and actor Nandu is not entering into the house as he did a mistake the Bigg boss mark leaks started
Next Story