బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ అభిజీత్‌..రన్నరప్‌గా అఖిల్!

బిగ్ బాస్ సీజన్-4 విన్నర్ అభిజీత్‌..రన్నరప్‌గా అఖిల్!
x
Highlights

* మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టైటిల్ అందుకున్న అభిజీత్ * మూడో స్థానంలో నిలిచి రూ.25లక్షలు గెలుచుకున్న సోహైల్ * నాలుగో స్థానంలో నిలిచిన అరియానా, ఐదో స్థానంలో హారిక

బిగ్ బాస్ తెలుగు సీజన్-4 టైటిల్ ను అభిజీత్ గెలుచుకున్నాడు. రన్నరప్ గా అఖిల్ నిలిచాడు. అభిజీత్, అఖిల్ చేతులను పట్టుకుని పైకెత్తిన నాగార్జున..... అఖిల్ చేతిని కిందకి దించి.... అభిజీత్‌ను విన్నర్‌గా ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కలిసి అభిజీత్‌కు ట్రోఫీని, ప్రైజ్ మనీని అందజేశారు. అలాగే, స్టైలిష్ బైక్‌ను కూడా అభిజీత్‌కు అంద‌జేశారు. ట్రోఫీ అందుకున్నాక అభిజిత్ సంతోషంలో మునిగితేలాడు. త‌న‌కు ఓట్లేసిన ప్రేక్షకులకు పాదాభివంద‌నాలు చేశాడు.

తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ టైటిల్‌ను అభిజీత్ గెలుచుకున్నాడు. గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్‌గా జరిగింది. టాప్‌-5 నుంచి మొదట హారిక హౌస్ నుంచి బయటికి రాగా... ఆ తర్వాత నాల్గో స్థానంలో అరియానా నిలిచింది. టాప్‌-3లో అభిజీత్, అఖిల్, సోహైల్ నిలవగా.... 25లక్షల ప్రైజ్ మనీతో సోహైల్ తెలివిగా బయటికి వచ్చాడు. చివరిగా, టాప్‌-2లో నిలిచిన అభిజీత్, అఖిల్‌ను స్వయంగా నాగార్జునే బిగ్ బాస్ హౌస్‌ నుంచి వేదికపైకి తీసుకొచ్చారు. అనంతరం, బిగ్ బాస్‌ సీజన్-4 గ్రాండ్ ఫినాలే ముఖ్య అతిథిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి... కంటెస్టెంట్స్ అందరి గురించి తనదైన శైలిలో స్పీచ్ ఇస్తూ పంచ్ డైలాగ్స్ పేల్చారు.

బిగ్ బాస్ సీజన్-4 కంటెస్టెంట్స్‌‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం, వరాలు కురిపించారు. విన్నర్ అభిజీత్‌పై పంచ్‌లు వేస్తూనే అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. ఇక, ప్రతి దాంట్లో గెలవాలనే తాపత్రయం అఖిల్‌లో కనిపించేదని అన్నారు. సోహైల్‌ను అయితే ఆకాశానికెత్తేశారు మెగాస్టార్. మన కథ వేరే ఉంటుందన్న డైలాగ్‌ను తన తర్వాతి సినిమాలో పెడతానంటూ చిరంజీవి ఆనడంతో సోహైల్ ఉబ్బితబ్బిబయ్యాడు. అరియానాను ఫైటర్‌గా మెగాస్టార్ అభివర్ణించారు. అలాగే, స్వయంకృషితో టాప్‌-5లో నిలిచిన హారికను అభినందించారు. ఇక, మెహబూబ్‌ను చూస్తుంటే... ఆ వయసులో తనను తాను చూసుకున్నట్లు ఉందన్నారు చిరంజీవి. అంతేకాదు, అప్పటికప్పుడు పది లక్షల రూపాయల చెక్‌ను రాసివ్వడంతో.... మెగాస్టార్‌కు మెహబూబ్‌ పాదాభివందనం చేశాడు.

ఇక, టాప్‌-3లో నిలిచిన సోహైల్‌ స్వచ్ఛందంగా ఎలిమినేట్‌ అయ్యాడు. నాగార్జున ఇచ్చిన 25లక్షల ఆఫర్‌కు సోహైల్‌ టెంప్ట్‌ అయ్యాడు. ఇంట్లో ఉన్న అభిజిత్‌, అఖిల్‌, సోహైల్‌లో ఎవరైనా 25లక్షల రూపాయలు తీసుకొని బయటకు రావొచ్చని నాగ్‌ సూచించగా... అఖిల్‌, అభిజిత్‌ తిరస్కరించారు. సోహైల్‌ మాత్రం తాను ఈ డబ్బును తీసుకొని వెళ్తానని చెప్పాడు. సోహైల్‌ నిర్ణయాన్ని అతని కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. 25లక్షల్లో పది లక్షలను అనాథ ఆశ్రమానికి ఇస్తాననగా.... ఆ పది లక్షలు నేనిస్తా.... ఈ 25లక్షలు ఇంటికి తీసుకెళ్లమంటూ నాగార్జున చెప్పడంతో సోహైల్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

10 లక్షలు తిరస్కరించిన ఫైనల్ ఫైవ్..

రెండో వ్యక్తిని ఎలిమినేట్‌ బాధ్యతను హీరోయిన్లు లక్ష్మీరాయ్‌, ప్రణీతలకు అప్పగించారు. దీంతో ఆ ఇద్దరు బ్యూటీలు బ్యాండ్‌ బాజాలతో ఇంట్లోకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. మొదటగా ప్రణిత 10 లక్షలు రూపాయలు ఉన్న సూట్‌ కేస్‌తో వెళ్లి కంటెస్టెంట్స్‌ను టెంప్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. రూ.10లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్లొచ్చు అని ఆఫర్‌ ఇవ్వగా అందరూ తిరస్కరించారు. ప్రేక్షకులు మాకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చారని, డబ్బుతో వాళ్ల ప్రేమను పొగొట్టుకోలేమని తేల్చి చెప్పారు. దీంతో ప్రణీత 10 లక్షలు తీసుకొని బయటకు వచ్చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories