Bigg Boss 4 Telugu: కట్టప్ప ఎవరో తేలింది.. సుజాత..అభిజిత్..గంగవ్వ సేఫ్ జోన్ లో!

Bigg Boss 4 Telugu: కట్టప్ప ఎవరో తేలింది.. సుజాత..అభిజిత్..గంగవ్వ  సేఫ్ జోన్ లో!
x

Bigg Boss 4 Telugu First weekend Highlights

Highlights

Bigg Boss 4 Telugu.. వీకెండ్ వినోదం అదిరింది.

బిగ్ బాస్ లో నాగార్జున సందడి మొదలైంది. కట్టప్ప..ఇదే ఈవారం బిగ్ బాస్ థీం.. వారాంతం ఎపిసోడ్ లోనూ ఇదే ప్రారంభం. సాహోరే బాహుబలి పాటతో కట్టి తిప్పుతూ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున. వస్తూనే బిగ్ బాస్ కు 5 కోట్ల ఓట్లు వచ్చాయి. ఇది బిగ్ బాస్ అన్ని సీజన్లలో రికార్డ్ అని చెప్పారు. తరువాత హౌస్ లో ఏం జరుగుతోందో చూపించారు.

తరువాత మామూలుగానే నాగార్జున హౌస్ మేట్స్ ఒక్కోరితో మాట్లాడటం ప్రారంభించారు. వాళ్ళతో సరదాగా మాట్లాడుతూనే చురకలు వేశారు. మొదట నోయల్ తో ప్రారంభించి నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు అన్నారు. దానికి అబ్బే లేదు సర్ అని జవాబిచ్చాడు నోయల్ హౌస్ లో అందరినీ అదే ప్రశ్న నాగ్ అడిగారు. అందరూ అవునంటూ చేతులెత్తారు. ఓవర్ థింకింగ్ తగ్గించుకోమని సలహా ఇచ్చారు నాగార్జున.

అరియానా కి అర్వనా అంటూ గట్టి పంచ్ ఇచ్చారు నాగార్జున. అందరి మీద అరుస్తున్నావు కదా అందుకే అర్వానా అన్నాను అని చెప్పారు. తరువాత సోహైల్ తో పుషప్ లు చేయించారు. అరియానాను పైన కూచో పెట్టుకుని సోహైల్ పుషప్ లు చేశాడు.

అఖిల్ గంగవ్వను చూసుకుంటున్నావు అందుకే నువ్వు బాగా నచ్చావు అన్నారు. కొంచెం ఓపెన్ అప్ అవమని చెప్పారు. నర్మదా.. అంటూ మోనాల్.. ఏడుపు కి ఇచ్చిన బిరుదు. కిచెన్ శుభ్రంగా ఉంచాలి. తినేటప్పుడు కోపం వద్దు. రాజశేఖర్ క్లీన్ గా వుండేట్టు చూసుకోండి.. సుజాత బాగా ఆడుతున్నావు..

లాస్య తో చాలా వెలితిగా ఉంది. నేను బాగా ఆడుతున్నాను అని లాస్య చెబితే.. అది నువ్వు కాదు మేము చెప్పాలి. మెహబూబ్ తో కనెక్షన్ అవ్వలేదు చెప్పారు. మెహబూబ్ ఎవరు అని హౌస్ లోకి వచ్చినప్పుడు నువ్వెవరో తెలియకపోయినా బయటకు వెళ్ళేటప్పుడు మెహబూబ్ అని చెప్పుకోవాలి. అభిజిత్..మోనాల్ మధ్య ఎదో ఉండాలని కోరుకుంటున్నట్టు నాగార్జున మాట్లాడారు.

దివి పీస్ ఫుల్ ప్లేస్ దొరికిందా హౌస్ లో.. అడిగిన నాగార్జున నీకు వంట వచ్చిన అబ్బాయి లంటే ఇష్టమా.. వంట చేసే అంకుల్స్ అంటే ఇష్టమా అని అడిగారు. నేను వంట వచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అంది దివి. దానికి నాగార్జున రాజశేఖర్ వింటున్నావా.. ఏమిటి.. దివి ఎదో అంటే ఆ రొమాంటిక్ లుక్ ఏమిటి.. బయట అందరూ గోల చేస్తున్నారు. అన్నారు నాగార్జున. మీ భార్యకు చెప్పనా అంటూ జోక్ చేశారు.

తరువాత బ్రేక్ సమయంలో అందరూ కలిసి కట్టప్ప ఎవరు అనే ర్యాప్ పాడారు. చివర్లో గంగవ్వ ఆపండిరా గోల చెవులు గిల గిల లాడుతుంది. నాగార్జున బాబుని మాట్లాడనీయండి అని అందర్నీ కసిరింది. ఇక దేవికి గట్టి పంచ్ పడింది నాగార్జున నుంచి. హౌస్ లో పరిస్థితులు.. కంటెస్టంట్ ల గురించి చెప్పమంటే ఆమె ఎదో చెప్పింది. దీంతో నాగార్జున.. ప్రేక్షకులకు శుభవార్త దేవి బ్రేకింగ్ న్యూస్ మర్చిపోయింది. ఎదుటి వారి మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అంటూ పంచ్ వేశారు.

సూర్యకిరణ్ కి గట్టి పంచ్. దేవుడు ఇచ్చిన అవయవాలు ఎక్కువ వాడేస్తే దానిని తీసేస్తాడు. ఎందుకో నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు అరచి అరచి నీ గొంతు కూడా పోయింది అంటూ గట్టిగా చెప్పారు. ఇక కరాటే కల్యాణి.. ఒరిజినల్ ట్రాన్స్ లేట్ చేయాలి గానీ, నువ్వు ఊహించి అదీ ఇదీ కల్పించి చెప్పకు. నువ్వు ఎక్కువ ఊహిస్తున్నావు అంటూ కల్యాణికి చెప్పారు.

ఎలిమినేషన్స్ నుంచి ఎవరు సేవ్ అయ్యారో చెప్పడానికి గేమ్ ఆడించారు నాగార్జున. దానిలో భాగంగా కొన్ని బ్యాడ్జిలు ఇచ్చారు. వాటిమీద రాసున్న దానికి ఎవరు సూట్ అవుతారో చెప్పాలని సోహైల్ దివి కి చెప్పారు. దానిలో భాగంగా..

ఊసర వెల్లి.. గా సుజాతను - కాకరకాయ్..గా అరియానా.. రొమాంటిక్.. అఖిల్ - చిచ్చుపెట్టడం.. కల్యాణి - డ్రామా కింగ్.. హరిక - బద్ధకం.. సూర్యకిరణ్ - చెత్త డబ్బా.. అభిజిత్ - ఓవర్ యాక్షన్.. అరియానా - లౌడ్ స్పీకర్..నోయల్ - తోపు.. గంగవ్వ - దేవి.. పర్ ఫెక్ట్ - క్రై బేబీ..మోనాల్ - బకరా..లాస్య

మిర్చి..మెహబూబా గుంటూరు మిర్చి - జోకర్.. అమ్మ రాజశేఖర్

కట్టప్ప కాదు టీం లీడర్..

లాస్య.. నోయల్. సూర్య కిరణ్..రాజశేఖర్..అఖిల్ అందరినీ వరుసగా నిలబెట్టి ఎవరు కట్టప్ప చెప్పండి అని మిగిలిన వాళ్ళను అడిగితె అందరూ ఏకగ్రీవంగా లాస్య కట్టప్ప అని చెప్పారు. ఆమెకు కట్టప్ప డ్రస్ ఇచ్చిన నాగార్జున ఆమెను బిగ్ బాస్ హౌస్ మొదటి లీడర్ గా ప్రకటించారు.

ఇక మొదటి వారం ఎలిమినేషన్ నుంచి గంగవ్వ, జోర్దార్ సుజాత, అభిజిత్ సేవ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. ఇప్పుడు హౌస్లో సూర్యకిరణ్, మెహబూబ్, దివి, అఖిల్ ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారు. వారిలో ఎవరు సేఫ్ అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories