Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 షూటింగ్ మొదలైపోయింది.. తెలుసా?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ 4 షూటింగ్ మొదలైపోయింది.. తెలుసా?
x
Highlights

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతోంది అనే విషయం తెలిసిందే.

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతోంది అనే విషయం తెలిసిందే. అభిమానులంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ షో షూటింగ్ ప్రారంభం అయిపోయింది. అదేమిటి? షూటింగ్ ప్రారంభం అయిపోతే వెంటనే టీవీలో కనిపించేయాలి కదా..అనే అనుమానం వస్తోందా. అదీ నిజమే.. కానీ, ఈసారి కాస్త వెరైటీ. ఎందుకంటే కరోనా మహమ్మారి దొరికితే కాటేస్తోంది కదా.. అందుకే నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు నిర్వాహకులు. హౌస్ లో ఉండబోతున్న సెలబ్రిటీలు అందరికీ కోవిడ్ టెస్ట్ లు చేయించారు. తరువాత వారందర్నీ క్వారంటైన్ కు పంపించారు. 14 రోజుల పాటు వారంతా క్వారంటైన్ లో ఉండబోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో అనుమానం రావాలి..వచ్చింది కదా.. అవును నెగిటివ్ వచ్చిన వారికి మళ్ళీ క్వారంటైన్ ఎందుకు?

జాగ్రత్త కోసమే..

నిజానికి నెగెటివ్ వచ్చిన వారికి క్వారంటైన్ అవసరం లేదు. అయితే, అందరూ సుమారు 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్ లో గడపాలి. అక్కడ ఎన్నో టాస్క్ లలో పాల్గొనాలి. ఎంత కాదనుకున్నా.. వద్దనుకున్నా కొన్నైనా ఫిజికల్ టాస్క్ లు తప్పవు. ఈ క్రమంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా మొత్తం షో దెబ్బతినడమే కాకుండా..చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసమే పూర్తిస్థాయిలో 14 రోజుల పాటు కంటెస్టంట్ లు అందరినీ వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్ లో ఉంచారు. ఇంకో విషయం ఏమిటంటే క్వారంటైన్ పూర్తయిన తరువాత కూడా మళ్ళీ అందరికీ పరీక్షలు చేస్తారు. అప్పుడు కూడా నెగెటివ్ వస్తేనే (రాకుండా ఎలా వుంటుంది లెండి) హౌస్ లోకి ఎంట్రీ!

షూటింగ్..

క్వారంటైన్ లో ఉన్న కంటెస్టంట్ లను షూట్ చేస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఈ ఫుటేజిలు కూడా భవిష్యత్ లో కార్యక్రమంలో భాగంగా ప్రసారం చేయాలనేది ప్లాన్. అందుకే షూటింగ్ ప్రారంభించారని చెబుతున్నారు. సో ఇప్పుడు సెలబ్రిటీలు అంతా సిద్ధం అవుతున్నారన్న మాట. ప్రోమోలు వచ్చేశాయి.. ఎవరు హౌస్ లోకి వెళ్ళవచ్చనననే లీకులు షికారు చేస్తున్నాయి.. షూటింగ్ స్టార్ అయిపోయింది.. గెట్ రెడీ.. త్వరలోనే బిగ్ బాస్ అందర్నీ పలకరించేస్తాడు. అన్నట్టు.. జబర్దస్త్ నుంచి రాంప్రసాద్ లేదా అవినాష్ అనుకున్నారు కదా.. అవినాష్ వెళ్ళాడనేది తాజా సమాచారం. ఇక టిక్ టాక్ స్టార్లు మరో ఇద్దరు కూడా బిగ్ బాస్ క్వారంటైన్ లో ఉన్నారట!

Show Full Article
Print Article
Next Story
More Stories