'అవియానా' క్రేజ్ మామూలుగా లేదు.. ఆఫర్ల వర్షం!

Aviyaana in Bigg Boss house getting good offers from TV Channels
x

Aviyaana in Bigg Boss House (Image Curtesy: Star Maa Promos screen shots)

Highlights

'అవియానా' ఈ పేరు కొత్తగా అనిపిస్తోందా.. కానీ, బిగ్ బాస్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది బాగా అలవాటైన పేరు. అవును. అవినాష్.. అరియానా ఇద్దరి పేర్లు కలిపి బిగ్ బాస్ ప్రేక్షకులు ముద్దుగా పెట్టుకున్న పేరు ఇది.

'అవియానా' ఈ పేరు కొత్తగా అనిపిస్తోందా.. కానీ, బిగ్ బాస్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది బాగా అలవాటైన పేరు. అవును. అవినాష్.. అరియానా ఇద్దరి పేర్లు కలిపి బిగ్ బాస్ ప్రేక్షకులు ముద్దుగా పెట్టుకున్న పేరు ఇది. బిగ్ బాస్ సీజన్ 4 లో అరియానా, అవినాష్ జోడీ కి వచ్చిన పేరు మరెవరికీ రాలేదు. బిగ్ బాస్ ఆట అంటేనే అన్ని ఎమోషన్స్ తో సాగిపోతుంది. అలా సాగిపోయేలా బిగ్ బాస్ డ్రైవ్ చేస్తాడు. అలా చేద్దామని ప్రయత్నించినా కొన్ని వర్కౌట్ కావు. కొన్ని ఆటో మెటిగ్గా వర్కౌట్ అయిపోతాయి.బిగ్ బాస్ సీజన్ 4 లో అదే జరిగింది.

మోనాల్..అభిజిత్ ల మధ్య ట్రాక్ నడిపించాలని మొదట్లో ప్రయత్నించింది బిగ్ బాస్ టీమ్. కానీ అది కాస్తా మోనాల్..అఖిల్ మధ్య ప్రేమ కథగా మారిపోయింది. ఒకదశలో అది ముక్కోణపు ప్రేమ కథగా మార్చే ప్రయత్నాలు జరిగినా అభిజిత్ పక్కకు జరిగాడు. దాంతో అలా మారిపోయింది. ఇవన్నీ నిజమైనవి కావని ప్రేక్షకులకు తెలుసు. అయినా, బిగ్ బాస్ లో జరిగే ఆ కథల గురించి మాట్లాడుకోవడం. వాటి పై జోకులు.. మీములు.. ఇలా సోషల్ మీడియాలో ప్రచారం జరగడం మామూలు విషయం.

అయితే, ఈ సీజన్ లో సైలెంట్ గా మొదలైన మరో కథ ఉంది. అది అవినాష్.. అరియానా ల మధ్య బంధం. చక్కని స్నేహ బంధంలా కనిపించిన ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ బిగ్ బాస్ 4 లో బాగా వర్కౌట్ అయింది. ప్రేక్షకులు కూడా వీరిద్దరి మధ్య జరిగిన ప్రతి విషయాన్నీ బాగా ఎంజాయ్ చేశారు. వీరిద్దరూ హౌస్ లో ఉన్నంత సేపూ ప్రేక్షకులను ఫుల్ గా ఎంజాయ్ మూడ్ లో నెట్టేశారు. ఇద్దరి మధ్య అల్లరి.. అలక.. ఒకరి ఒకరు తోడుగా అట ఆడటం.. ఒకర్ని ఒకరు తిట్టుకోవడం.. మళ్ళీ కలిసిపోయి అల్లరి చేయడం.. ప్రేమగా భోజనం తినిపించుకోవడం.. ఇలా ఎన్నో కోణాల్లో ఇద్దరూ కల్సి ప్రేక్షకులను అలరించారు. దీంతో అవినాష్.. అరియానా ఇద్దరి పేర్లూ కలిపేసి 'అవియానా' అని ముద్దు పేరు పెట్టేసుకున్నారు బిగ్ బాస్ అభిమానులు.

ఇక బిగ్ బాస్ పూర్తయిన తరువాత సోహైల్ కు ఒక్కడిగా ఎంతో క్రేజ్ వచ్చింది బయట. అదేవిధంగా ఆవియానా జోడీ కి కూడా మంచి పేరు వచ్చింది. సోహెల్ కు ఇప్పటికే సినిమా ఆఫర్ వచ్చింది. అందులో నటించడానికి మేమూ సిద్ధం అంటూ మెగా స్టార్ చిరంజీవి.. కామెడీ స్టార్ బ్రహ్మానందం కూడా మాట ఇచ్చారు. ఇక అవినాష్, అరియానాలకు కూడా బయట ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.

వీరిద్దరికీ టీవీల్లో యాంకర్లుగా భారీ ఆఫర్లు వస్తున్నాయంట. అరియానా ముందే యాంకర్ గా మంచి పేరు ఉంది. ఆర్జీవీ అంతటి దర్శకుడే అరియానా యాంకరింగ్ సూపర్ అని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక అవినాష్ జబర్దస్త్ తో టీవీ మాధ్యమంలో మంచి పేరు ఉంది. ఇవన్నీ షో లలో యాంకర్ గా చేశాడు కూడా. ఇప్పుడు బిగ్ బాస్ క్రేజ్ తో అవియానా జోడీ బుల్లితెర యాంకర్లుగా సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ యాంకర్లుగా ఉండేలా పలు చానెళ్లు షో లు ప్లాం చేస్తున్నాయట. వీరిద్దరూ కూడా ఇప్పటికే ఒక షో కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాకా అరియానా, అవినాష్ ఇద్దరూ పలు చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. ఈ వారం తరువాత కొత్త సంవత్సరంలో ఈ జంట తో సరికొత్త షో లు టీవీ ల్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, అవియానా జోడీ చేసే సందడి కోసం టీవీ ప్రేక్షకులు రెడీ అయిపోవచ్చన్నమాట!

Show Full Article
Print Article
Next Story
More Stories