Bigg Boss 4 Telugu: ఏడుపులూ.. అరుపులూ.. కేకలూ.. తిట్లూ.. ఇంత గందరగోళం ఎందుకు బిగ్ బాస్!

Bigg Boss 4 Telugu: ఏడుపులూ.. అరుపులూ.. కేకలూ.. తిట్లూ.. ఇంత గందరగోళం ఎందుకు బిగ్ బాస్!
x

BIgg Boss 4 Telugu Highlights (Image courtesy star maa)

Highlights

Bigg Boss 4 : కాయిన్ల వేట అంటూ పెట్టిన బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ హౌస్ లో గందరగోళం రేపింది. ఏడుపులూ.. తిట్లూ.. రుసరుసలతో అంతా గజిబిజిగా తయారైంది.

బిగ్ బాస్ అసలు ఏం జరుగుతోంది.. ఇది వినోదమా..విషాదమా? ఎంత హోస్ మేట్స్ లో ఉన్న గ్రూపులు విడగొట్టాలని స్క్రిప్ట్ చేస్తే మాత్రం ఇటువంటి ఫిజికల్ టాస్కా? ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్తెన్సీ టాస్క్ అదుపు తప్పుతోంది.. కాదు తప్పింది. గేమ్ లా ఆడాల్సిన ఇంటి సభ్యులు సీరియస్ గా తీసుకోవడంతో ఫిజికల్ టాస్క్ కాస్తా ఫిజికల్ దాడుల వరకూ వెళ్ళిపోయింది. మోనాల్ ఏడుపు.. కాలు విరగ్గొట్టుకున్న అవినాష్.. ఒకరిని ఒకరు తిట్టుకున్న హౌస్ మేట్స్.. అంతా గందరగోళమే! అన్నట్టు దీనికి ఇంకా కొనసాగింపు ఉంది.. రెండు రోజులు జరిగింది మొదటి భాగం మాత్రమె.. ఇదే ఇలా ఉంటె రెండో భాగం ఎలా ఉంటుందో?

అభిజిత్ ఏమిటి కథా.. నిలదీసిన హారిక!

ఇంత గందరగోళ గేమ్ లో కూడా పులిహోర ట్రాక్ మాత్రం మిస్ కాలేదు. అభిజిత్ కాయిన్స్ గేమ్ లో స్వాతీ దీక్షిత్ తో కలిసి ఆడుతుంటే హారిక జీర్ణించుకు పోలేకపోయింది. అభితో కాస్త దూరంగా ఉంటున్న హారిక ఈ రోజు అస‌లు విషయాన్ని అడిగేసింది. నువ్వు స్వాతికెందుకు స‌పోర్ట్ చేస్తున్నావు అని నిల‌దీసింది. ఆమె వ‌చ్చి రెండు, మూడు రోజులే అవుతుంది, త‌న‌కిచ్చిన ప‌ని కూడా చేయ‌లేక‌పోతోంది, డేంజ‌ర్ జోన్‌లోనూ ఏమీ లేదు. అలాంటిది ఆమె కోసం కింద‌ప‌డీ, కొట్లాడీ నాణాలు సేక‌రించాల్సిన ప‌నేంట‌ని ప్ర‌శ్నించింది. ఇది నేను జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని చెప్పుకొచ్చింది. నా స్నేహితుడు అయి ఉండి నాకిస్తావ‌నుకున్నా అని చెప్ప‌డంతో అభిజిత్ చేయి ప‌ట్టుకుని సారీ చెప్పాడు. దాంతో కూల్ అయింది హారిక. మరింత పులిహోర తరువాత ఎపిసోడ్ లో ఎలానూ ఉంటుంది.

దమ్ముంటే ఏరుకో..లేకుంటే దోచుకో!

ఇదే ఈ కాయిన్స్ గేమ్. అందులో రెండో పధ్ధతి అమ్మ రాజశేఖర్.. సోహైల్..మహబూబ్ బాగా వంట పట్టించుకున్నారు. దొంగను దొంగ అంటే కోపం రాదా మరి. అదే జరిగింది బిగ్ బాస్ హౌస్ లో. ఎవరికీ వారు దోచుకోవడం మీద దృష్టి పెట్టారు. పోనీ వారి పని వారు చేసుకోవచ్చుగా.. అవతలి వాళ్ళని దొంగ అంటూ మాట్లాడటం అది కాస్త రచ్చ కావడం జరిగింది. టాస్క్‌లో భాగంగా కొంద‌రు క‌ష్ట‌ప‌డి కాయిన్లు సేక‌రిస్తుంటే మ‌రికొంద‌రు వాటిని నొక్కేయ‌డంపైనే దృష్టి సారించారు. అలా హారిక కాయిన్ల‌ను సోహైల్‌ లేపేయగా, అక్క‌డ దాచాన‌ని ఎవ‌రు చెప్పార‌ని అడిగింది. త‌ర్వాత చెప్తానులే అని మెహ‌బూబ్ బ‌దులిచ్చాడు. దీంతో ఎవ‌రెవ‌రు కాయిన్లను ఎక్క‌డెక్క‌డ‌ పెట్టుకున్నార‌నేది అంద‌రికీ జార‌వేస్తున్న‌ మాస్ట‌ర్ త‌న గుట్టు ఎక్క‌డ‌ బ‌య‌ట‌ప‌డిపోతుందోన‌ని భ‌య‌ప‌డ్డాడు. నాతో మాట్లాడ‌కు అంటూ మెహ‌బూబ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇక రాత్రంతా అంద‌రూ గుర్రు పెట్టి నిద్ర‌పోతున్నా రాత్రంతా జాగారం చేసి మరీ క‌ష్ట‌ప‌డి దోచుకుని సోహైల్‌, మెహ‌బూబ్ సూపర్ దొంగలుగా మారిపోయారు..

మహబూబ్ బుక్కు.. సుజాత లక్కు..

కాయిన్స్ లో ఓ అద్భుతమైన కాయిన్ ఉందని బిగ్ బాస్ చెప్పాడు. అయితే, ఆ విషయం తెలీని మహబూబ్ తనకు దొరికిన ఆ అదృష్టాన్ని చేజేతులా ఇదేమిటో అని విసిరి పారేశాడు. సుజాత దానిని అదేమిటో తెలీకపోయినా తీసి జాగ్రత్త చేసింది. దీంతో మహబూబ్ బుక్కయ్యాడు.. సుజాతకు లక్కీ కాయిన్ దొరికింది.

వెక్కి వెక్కి ఏడ్చిన మోనాల్.. పదే పదే ఆ సీన్లను చూపించిన బిగ్ బాస్..

మరోవైపు మోనాల్ వెక్కి వెక్కి ఏడ్చింది. కారణమూ పెద్దది కాదు.. రాజశేఖర్ కాయిన్లు దొంగతనం చేశావు అని అడిగాడు అంతే. అందరూ దొంగిలించినా త‌నను తనను మాత్రమె ప్రశ్నించారని మోనాల్ వెక్కివెక్కి ఏడ్చింది. మమ్మీ..మమ్మీ అంటూ ఏడుస్తూ బిగ్ బాస్ కు ఎదో చెప్పాలని ప్రయత్నించింది.అయితే, ఆమె ఇంగ్లీషులో చెబుతుంటే బిగ్ బాస్ ఆమెను నిలువరించి తెలుగులో చెప్పమన్నాడు. దాంతో ఆమె బాధ మరీ ఎక్కువ అయిపొయింది. తెలుగులో చెప్పలేదు.. ఇంగ్లీషులో ఏడిస్తే బిగ్ బాస్ ఒప్పుకోడు.. ఇంకేం చేస్తుంది పాపం వాష్ రూమ్ లోకి పోయి మమ్మీ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది.

అవినాష్ కాలు విరిగిందా..బెణికిందా..?

ఈ హడావుడిలో అవినాష్ సొమ్మసిల్లి కింద పడిపోయాడు. అందరూ కంగారు పడి అతని దగ్గరకు వెళ్ళారు. కాలు బెణికిందని అవినాష్ చెప్పాడు. లేచి నిలబడలేని పరిస్థితిలో అవినాష్ ను అందరూ కలిసి డాక్టర్ రూమ్ కి తీసుకువెళ్ళారు. మరి అవినాష్ కాలికి ఏమైందో తెలియలేదు.

టాప్ మహబూబ్..

కాయిన్స్ సేకరణలో మహబూబ్ టాప్ గా నిలిచాడు. అందరికంటే చాలా ఎక్కువగా మొత్తం 4360 కాయిన్స్ మహబూబ్ సంపాదించాడు. ఇక మిగిలిన వారు అవినాష్ 3160, రాజశేఖర్ 320, స్వాతి 1930, లాస్య 1560, అభిజిత్ 1770, నోయ‌ల్ 900, హారిక 1450, సోహైల్ 3620, మోనాల్ 610, అఖిల్ 2570, అరియానా 1850, దివి 110, కుమార్ 1570, సుజాత 340 + స్విచ్ కాయిన్ సంపాదించుకున్నారు. ఇక ఈ ఆట పూర్తి కాలేదు.

ఇవీ ఈ ఎపిసోడ్ సంగతులు.. ఇందులో హైలైట్ అంటూ ఏమీ లేదు. ఏడుపులు.. కొట్టుకోవడాలు.. వీటిలో హైలైట్ అని చెప్పుకోవడం అంత సరికాదు కూడా.. మరి బిగ్ బాస్ హౌస్ అంటేనే అన్నీ ఉంటాయి. నవరసాల్లో బీభత్సం కూడా ఒకటి కదా.. అది ఇప్పుడు చూపిస్తున్నట్టున్నాడు బిగ్ బాస్. అంతేకదా బాస్!

Show Full Article
Print Article
Next Story
More Stories