Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ లో గంగవ్వే తోపు! 'సూర్యకిరణ్' అవుట్..'సాయికుమార్' ఇన్?

Bigg Boss 4 Telugu: బిగ్ బాస్ లో గంగవ్వే తోపు! సూర్యకిరణ్ అవుట్..సాయికుమార్ ఇన్?
x

bigg boss 4 telugu sunday episode promo

Highlights

BIgg Boss 4 Telugu: సండే ఫండే అంటూ నాగార్జున మరి కొద్ది సేపట్లో బిగ్ బాస్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు.

అతి పెద్ద రియాల్టీ షో గా చెప్పుకునే బిగ్ బాస్ తెలుగులో నాలుగో సీజన్ మొదటి వారం పూర్తి చేసుకుంది. మొదటి వారాంతంలో నిన్న శనివారం నాగార్జున హౌస్ లో అందర్నీ పలకరించారు. వారం మొత్తం వారు చేసిన పనులు..వారి ధోరణులపై మాట్లాడారు. ఇక బిగ్ బాస్ లో కట్టప్ప ఉన్నాడంటూ ప్రారంభం నుంచీ చెప్పుకుంటూ వస్తున్న బిగ్ బాస్ కట్టప్ప ఎవరో తేల్చేశాడు. నాగార్జున కట్టప్ప ఎవరూ లేరని చెబుతూనె హౌస్ లో అందరూ కట్టప్పగా భావిస్తున్న లాస్యను ఇంటి కెప్టెన్ గా ప్రకటించారు. ఇక అందరితోనూ సరదాగా మాట్లాడిన నాగార్జున సోహైల్..అరియానాలతో సరదా ఆట ఆడించారు. కొన్ని మెడల్స్ ఇచ్చి వాటి మీద ఉన్న కామెంట్స్ ఆధారంగా వాటిని ఎవరికీ సూతవుతుందో వారికీ వేయమని చెప్పారు. ఇందులో ఊసర వెల్లి.. గా సుజాతను - కాకరకాయ్..గా అరియానా.. రొమాంటిక్.. అఖిల్ - చిచ్చుపెట్టడం.. కల్యాణి - డ్రామా కింగ్.. హరిక - బద్ధకం.. సూర్యకిరణ్ - చెత్త డబ్బా.. అభిజిత్ - ఓవర్ యాక్షన్.. అరియానా - లౌడ్ స్పీకర్..నోయల్ - తోపు.. గంగవ్వ - దేవి.. పర్ ఫెక్ట్ - క్రై బేబీ..మోనాల్ - బకరా..లాస్య - మిర్చి..మెహబూబా గుంటూరు మిర్చి - జోకర్.. అమ్మ రాజశేఖర్ ఇలా అందరికీ బిరుదులిచ్చారు. ఈ ఆటలో తోపుగా గంగవ్వను ఎన్నుకున్నారు.

గంగవ్వే తోపు!

అవును ఈ సీజన్ లో గంగావ్వే తోపు. ఇప్పటివరకూ ఉన్న కంటెస్టంట్ లు ఏ కొద్దిమందికో నచ్చారు. కానీ, గంగవ్వ మాత్రం అందరికీ నచ్చింది. తన జీవితం గురించి ఆమె చెప్పిన తీరు. తన కంటె ఎంతో చిన్నవాల్లతో ఆమె వ్యవహరిస్తున్న విధానం.. ఒంటరిగా జీవితాన్ని దాటుతూ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో అందరి మధ్య ఆమె నడవడిక ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ టీం కు కూడా గంగవ్వే దిక్సూచిలా మారిపోయిందంటే అతిశయోక్తి కాబోదు. ఎలిమినేషన్ లో మొదటి వారం గంగవ్వ పేరు నామినేట్ చేసిన మిగిలిన వారు కూడా అప్పుడు అదే చెప్పారు. గంగవ్వను డామినేట్ చేసినా సరే ప్రేక్షకులు ఓట్లు వేసి ఆమెను సేవ్ చేస్తారని అనుకున్నారు. నిజానికి గంగవ్వకు సపోర్టుగా 50 శాతం పైగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అంటే మిగిలిన ఆరుగురికీ ఎన్ని వోట్లు వచ్చాయో అన్ని ఓట్లు ఒక్క గంగవ్వకే వచ్చాయి. అందుకే గంగవ్వ ఈ సీజన్ కి తోపు!

ఎవరు బయటకు..

ఇక ఈవారం నామినేట్ అయిన ఏడుగురిలో అభిజిత్, సుజాత, గంగవ్వ ఇప్పటికే సేఫ్ జోన్ లో ఉన్నారని నాగార్జున నిన్న ప్రకటించారు. ఇక మిగిలినది సూర్యకిరణ్, దివి, అఖిల్, మహబూబ్ నలుగురు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. వీరిలో దివి మొదట్లో కొద్దిగా వీక్ అనుకున్నారు కానీ చివరి రెండురోజుల్లో ఫుల్ మార్కులు కొట్టేసింది. ఆమె సేఫ్ లో ఉన్నట్టే.. అదేవిధంగా అఖిల్ ని కూడా చాలా మంది అభిమానిస్తున్నారు. అతని పధ్ధతి ముఖ్యంగా గంగవ్వ విషయంలో అఖిల్ తీసుకుంటున్న జాగ్రత్తలు.. ఆమెతో అతను మేలుతున్న తీరు అందరికీ నచ్చాయి. అందువల్ల అఖిల్ కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఇక మిగిలిన ఇద్దరూ మెహబూబ్, సూర్యకిరణ్.. వీరిద్దరిలో మెహబూబ్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని చెబుతున్నారు. సూర్యకిరణ్ విషయంలో హౌస్ లోనూ.. బయట కూడా ఒకేరకమైన అభిప్రాయం ఉంది. అయన ఎక్కువ చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఎలా చూసినా సూర్యకిరణ్ బయటకు వెళ్లిపోతారని అనుకుంటున్నారు. ఈరోజు ఎలిమినేట అయ్యేది సూర్యకిరణ్ అని ఎక్కువ శాతం భావిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారనే తెలుస్తోంది.

లోపలి వెళుతున్నది ఎవరు..

ఈరోజు మరో కొత్త వ్యక్తీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని తాజా ప్రోమో నిర్ధారించింది. ఇందులో నాగార్జున ఎవరినో లోపలి పంపిస్తున్నారు. ఆయనేవరనేది రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా రెండు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జబర్దస్త్ ముక్కు అవినాష్.. ఈరోజులలో సినిమాలో కీలక పాత్ర పోషించిన యువనటుడు సాయికుమార్ రెండురోజులుగా ఈ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈరోజు ప్రోమో రిలీజ్ అయిన తరువాత ఈరోజుల్లో సాయికుమార్ హౌస్ లోకి వెళుతున్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం సాయికుమార్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టే!

మొత్తమ్మీద బిగ్ బాస్ లో మొదటి ఎలిమినేషన్ పూర్తి అవుతోంది. సండే ఫన్ డే అంటూ వచ్చే నాగార్జున కొద్ది సేపట్లో ఎటువంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories