కంటెస్టెంట్లు అందరికీ షాకిచ్చిన బిగ్ బాస్!

కంటెస్టెంట్లు అందరికీ షాకిచ్చిన బిగ్ బాస్!
x
Highlights

బిగ్ బాస్ సీజన్ 4.. 83వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. ఇక హౌస్ విషయానికి వస్తే.. జలజ దెయ్యం ఇంటి సభ్యులతో బాగానే ఆట ఆడుకుంది. అయితే సభ్యుల ప్రదర్శన నిరాశాజనకంగా ఉందంటూ బిగ్ బాస్ ఆగ్రహించాడు.

బిగ్ బాస్ సీజన్ 4.. 83వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. ఇక హౌస్ విషయానికి వస్తే.. జలజ దెయ్యం ఇంటి సభ్యులతో బాగానే ఆట ఆడుకుంది. అయితే సభ్యుల ప్రదర్శన నిరాశాజనకంగా ఉందంటూ బిగ్ బాస్ ఆగ్రహించాడు. టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో చెప్పాలని గట్టిగానే వాగ్నింగ్‌ ఇచ్చాడు. అఖిల్‌ను బిగ్‌బాస్ చివాట్లు పెట్టారు. ఆ ముచ్చట్లు ఇప్పుడు చూద్దాం.

ఎప్పటిలాగే ఇంటి సభ్యులు ఓ సాంగ్‌కి స్టెప్పులు వేశారు. ఆ తర్వాత ఇంటిలో ఉదయాన్ని మోనాల్ గజ్జర్ యోగాసనాలు వేస్తూ కనిపించింది. అక్కడే ఉన్న అవినాష్ నేను యోగా చేస్తా అంటూ ప్రయత్నించేందుకు ముందుకెళ్లాడు. అయితే సోహెల్ వంగపెట్టి కొట్టాడు. యోగాసనాలు వేయడానికి తంటాలు పడ్డారు. అవినాష్ చేష్టలకు అరియాన నవ్వుకుంది.

గత రెండు రోజులుగా బిగ్ బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ 'జలజ దెయ్యం'లో ఇంటి సభ్యుల ప్రదర్శన నిరాశాజనకంగా ఉందంటూ బిగ్ బాస్ ఆగ్రహించాడు. ఈ టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఇంటి సభ్యులు చర్చించుకుని అభిప్రాయాన్ని బిగ్ బాస్‌కి తెలియజేయాలని చెప్పారు. దీంతో ఇంటి సభ్యుల మధ్య చర్చ జరిగింది.

ఇక నుంచి షాకుల మీద షాకులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఫైనల్ రేసు మొదలైందని బిగ్ బాస్ తెలిపాడు. ఇక ఈ ఆటలన్నీ ముగిసిపోయినట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్ బాస్ మరో పథకం వేశాడు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఆదేశంలో ఇంటి సభ్యుల మధ్య రచ్చ జరిగింది. చివరికి చెత్త కెప్టెన్, బెస్ట్ కెప్టెన్ ఎవరో నిర్ణయించారు.

బిగ్ బాస్ హౌస్‌లో రేస్ టు ఫినాలు మొదలైందని.. తిరిగి ఫినాలే వరకూ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ ఉండరని చెప్పారు బిగ్ బాస్. దీనిలో భాగంగా కెప్టెన్ అయిన వాళ్లు ధరించి కెప్టెన్ బ్యాండ్‌కి వీడుకోలు చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇక బిగ్ బాస్ లో ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్లలో కెప్టెన్ గా చేసినవారిలో ఎవరు బాగా చేసారు, ఎవరు చెత్తగా చేసారో తేల్చి చెప్పండి అంటూ బిగ్‌బాస్ ఆదేశించారు.

బిగ్‌ బాస్‌ ఆదేశంతో ఇంటి సభ్యులు కసరత్తు మొదలు పెట్టారు. చెత్త కెప్టెన్, బెస్ట్ కెప్టెన్ ఎవరనే నిర్ణయించే సమయంలో ఇంటి సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో అరియానా, సోహెల్; అఖిల్, అభిజిత్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత బెస్ట్ కెప్టెన్‌గా హారిక, చెత్త కెప్టెన్‌గా అరియానా ఎంపికైంది.

ఇంటిలో రకరకాల ఎమోషన్స్ కనిపించాయి. అరియానా హర్ట్‌ అయింది...! సొహైల్‌ని మోనాల్ ఛీ కొట్టింది....! ఇక వింత వింతగా ప్రవర్తిస్తూ కోపంగా ఊగిపోతున్న సొహైల్‌ని శాంతింపజేసేందుకు హగ్ ట్రీట్ మెంట్ ఇచ్చి శాంతింపజేసింది. ఇటు అరియానకు అభి ధైర్యం చెబుతూ మిస్‌ కాకుండా హగ్‌ సంప్రదాయాన్ని పాటించాడు.

వరస్ట్ కెప్టెన్‌‌గా అరియానాను ఎంపిక చేయడంతో ఫీల్‌ అయింది. దీంతో అభి ధైర్యం చెప్పాడు. నువ్ నాకంటే బెటర్ కదా.. నేను కెప్టెన్‌ని కూడా కాలేకపోయనని అభి చెప్పాడు. నువ్ నా కంటే అన్ని టాస్క్‌లలోనూ బాగా పెర్ఫామ్ చేశావన్నారు. అయితే నేను నీకంటే బెటర్ కాలేనని అరియానా చెప్పింది.

ఇక బెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై మోనాల్ గజ్జర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు ఎలా ఒప్పుకొంటారని సోహెల్‌, అఖిల్‌ను ప్రశ్నించింది. ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ కెప్టెన్ అన్న డిష్కషన్స్‌లో సొహైల్‌ని ఛీ అంటూ ఛీ కొట్టింది మోనాల్. దీంతో సొహైల్ కోపంగా ఊగిపోవడంతో అతన్ని శాంతింపజేసేందుకు మోనాల్‌ హగ్ ట్రీట్ మెంట్ ఇచ్చింది.

ఇక చివర్లో అరియానా-అవినాష్ మధ్య డిస్కషన్ జరిగింది. ఈ ఎపిసోడ్‌కి వీరి డిస్కషన్‌తోనే ఎండ్ కార్డ్ పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories