logo
సినిమా

బిగ్‌బాస్‌ హౌస్‌లో అఖిల్‌ పుట్టినరోజు వేడుకలు.. అఖిల్‌కు మోనాల్‌ రొమాంటిక్‌ గిఫ్ట్

బిగ్‌బాస్‌ హౌస్‌లో అఖిల్‌ పుట్టినరోజు వేడుకలు.. అఖిల్‌కు మోనాల్‌ రొమాంటిక్‌ గిఫ్ట్
X
Highlights

బిగ్‌బాస్‌ హౌస్‌ కమాండ్‌ కంట్రోల్‌గా మారింది. ఇంకేముంది అనుకున్నట్లుగానే కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ కఠినమైన ట్రైనింగ్‌ ఇస్తున్నాడు. అటు ఆ‍యన చెప్పెవన్నీ చేయలేక ఇంటిసభ్యులు తెగ ఆయాసపడుతున్నారు. ఇక ఇంటిసభ్యులందరూ బుల్లెట్లను తప్పించుకుంటూ బిగ్‌బాస్‌ చెప్పిన టాస్కులను పూర్తి చేయడం ప్రారంభించారు.

బిగ్‌బాస్‌ హౌస్‌ కమాండ్‌ కంట్రోల్‌గా మారింది. ఇంకేముంది అనుకున్నట్లుగానే కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ కఠినమైన ట్రైనింగ్‌ ఇస్తున్నాడు. అటు ఆ‍యన చెప్పెవన్నీ చేయలేక ఇంటిసభ్యులు తెగ ఆయాసపడుతున్నారు. ఇక ఇంటిసభ్యులందరూ బుల్లెట్లను తప్పించుకుంటూ బిగ్‌బాస్‌ చెప్పిన టాస్కులను పూర్తి చేయడం ప్రారంభించారు.

72వ రోజు హౌస్‌లో బిగ్‌బాస్‌ సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమాలోని ఓ సాంగ్‌ ప్లే చేశారు. ఈ పాటకు హారిక, లాస్య, హరియానాతోపాటు సోహైల్‌ గార్డెన్‌ ఏరియాలో తమదైన శైలిలో కాలు కదిపారు. ఇక బిగ్‌బాస్‌ ఇల్లు కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా మారింది. ఈ టాస్క్‌లో యూనిఫామ్‌ ధరించిన ఇంటిసభ్యులు కొన్ని డ్రిల్స్‌ చేయాలి. ఇక అఖిల్‌ కేడట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. బజర్‌ మోగినప్పుడు దాన్ని ముందుగా కొట్టే వ్యక్తి ఒక ఛాలెంజ్‌ చేసే అవకాశం పొందుతారు. ఒకసారి ఛాలెంజ్‌ పూర్తి చేసిన వ్యక్తికి మరోసారి బజర్‌ కొట్టే అవకాశం లేదు.

టాస్క్ ప్రారంభంకాగానే బిగ్‌బాస్‌ చెప్పినట్టుగా హౌస్‌మేట్స్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేశారు. కానీ.. పదేపదే స్టంట్లు చేసేందుకు ఆయాసపడ్డారు. మొదటి బజర్‌ మోగగానే సోహైల్‌ అన్నింటికన్నా కఠినమైన ఛాలెంజ్‌ స్వీకరించాడు. ఇందులో సోహైల్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో ఒకవైపున ఉన్న బరువైన వస్తువులను మరోవైపుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెహబూబ్‌ కోసం ఈ ఆటాడుతున్నానని చెప్పిన సోహైల్‌ చివరికి ఓడిపోవడంతో ఎమోషనల్‌ అయ్యాడు.

ఇప్పటివరకు నిద్రపోయిన అభిజిత్‌ మొదటి సారి టాస్కులో తన ప్రతాపం చూపించాడు. అంతేకాదు అందరితోపాటు అభి కూడా తొలిసారి గేమ్‌ను ఎంజాయ్‌ కోసం కాకుండా గెలవాలన్నట్టుగా ఆడాడు. అసలీ గేమ్‌లో విజయం సాధిస్తామా..? అని హారికకు డౌట్‌ వస్తే లాస్య మాత్రం తన బద్ధకాన్ని పూర్తిగా చూపించింది. రెండోసారి బజర్‌ మోగగానే పరుగుపరుగున వెళ్లిన అఖిల్‌ అందరికన్నా ముందు బ‌జ‌ర్ కొట్టాడు. పోల్‌ను వాటేసుకుని కిందకు దిగ‌కూడ‌ద‌న్న స‌వాలు స్వీక‌రించి విజ‌యం సాధించాడు.

మూడో బజర్‌ నువ్వే కొట్టాలని హారిక అభిజిత్‌కు చెప్పింది. అనుకున్నట్లుగానే అభి బజర్‌ కొట్టి మంకీ బార్‌ ఛాలెంజ్‌ స్వీకరించి గెలుపొందాడు. 100 శాతం ఇస్తున్నా కదా.. ఈసారి నన్ను నామినేట్‌ చేయకండి అని హౌస్‌మేట్స్‌ని అభి అభ్యర్థించాడు. అటు అవినాష్‌ సరిగా దాక్కోలేదని అభిజిత్‌ ఫిర్యాదు చేయగా అవునని అరియానా సమర్థించింది. దీంతో అవినాష్‌, అరియానా కొట్టుకు చచ్చారు. నాకెవ్వరితో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అరియానా స్పష్టం చేసింది.

అటు నామినేషన్‌ ప్రక్రియ రోజు నిప్పులు తొక్కిన కంటెస్టెంట్ల ఆవేశం చల్లారినట్లు కనిపించింది. గొడవలు పక్కనపెట్టి తిరిగి ఎప్పటిలాగే మాట్లాడుకున్నారు. ఇక నైట్‌ టైమ్‌ హౌస్‌లో అఖిల్‌ పుట్టినరోజు వేడుకలు జరిపారు తోటిసభ్యులు. అఖిలే నెంబర్‌-1 అని కేక్‌ మీద రాసి బర్త్‌డే బాయ్‌తో కేక్‌ కట్‌ చేయించారు. మొదట ఎవరికి తినిపిస్తాడు అన్న సస్పెన్స్‌కు తూట్లు పొడుస్తూ కేకు తనే తిన్నాడు. ఫైనల్‌గా మోనాల్‌.. అఖిల్‌ను హగ్‌ చేసుకుని ముద్దులు కురిపించింది. దీంతో గాల్లో తేలిపోయిన అఖిల్‌ రోజు తన బర్త్‌డే ఉంటే బాగుండని మనసులోని మాట బయటపెట్టాడు. ఇక ఈ సెలబ్రేషన్స్‌లో సోహైల్‌ ఎక్కడా కనిపించలేదు.

ఇక టాస్క్‌లో ఫైనల్‌ బజర్‌ కొట్టిన హారిక.. టైర్‌ను గార్డెన్‌ ఏరియాలో పది రౌండ్లు ప్లిప్‌ చేసే సవాలును స్వీకరించి పూర్తి చేసింది.

Web TitleBigg Boss 4 Telugu 72 Episode Highlights akhil birthday celebrations in House
Next Story