Bigg Boss 4 Telugu: దీపావళి కానుకలు..నవ్వులు నిషేధం!

Bigg Boss 4 Telugu: దీపావళి కానుకలు..నవ్వులు నిషేధం!
x
Highlights

Bigg Boss 4 Telugu: నవ్వులు నిషేధించి.. అందరికీ బహుమతులు ఇచ్చాడు బిగ్ బాస్!

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యుల ప్రయాణం 68 రోజులకు చేరుకుంది. అటు హౌస్‌లో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇటు పండగ వాతావరణం కనిపించేలా ఇళ్లంతా ముస్తాబు చేశారు ఇంటిసభ‌్యులు. ఫైనల్‌గా హౌస్‌మేట్స్‌ అందరూ కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండగ వేళ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కి బహుమతులు ఇచ్చారు. ముఖ్యంగా లాస్యకు ఇచ్చిన గిఫ్ట్‌ అయితే హైలెట్‌గా నిలిచింది. అటు అవినాష్‌ రేషన్‌ మేనేజర్‌ ఏ ముహూర్తాన అయ్యాడో కానీ.. ఆ‍యనకి అన్నీ అపశకునాలే ఎదరవుతున్నాయి. ఎప్పుడూ మోనాల్‌తో పులిహోర కలిపే అవినాష్‌.. ఇప్పుడు అరియానాకు సైట్కొడుతున్నాడు.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ''నవ్వడం నిషేధం'' టాస్క్‌ నవ్వులు పూయించింది. తోటి సభ్యులను నవ్వించడానికి కంటెస్టెంట్లు నానా యేషాలు వేశారు. ఎంతకీ హౌస్‌మేట్స్‌ నవ్వకపోవడంతో చివరికి బిగ్‌బాసే రంగంలోకి దిగి ఇంటి సభ్యులను నవ్వించాడు. దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి ఇంటి సభ‌్యుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. 'నవ్వడం నిషేధం' టాస్క్‌లో ఇంటిసభ్యులు ఓడిపోయినా.. ప్రేక్షకులకు వినోదంపంచడంలో సక్సెస్‌ కావడంతో బహుమతులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. ఇక ఇంటిసభ్యులందరూ హౌస్‌లో దివాళీ సెలబ్రేషన్‌ చేసుకున్నారు.

మొత్తానికి అఖిల్‌ను సీక్రెట్‌ రూమ్‌లోకి పంపించిన బిగ్‌బాస్‌.. అఖిల్‌-అభికి మధ‌్య చిచ్చు పెడుతూనే ఉన్నాడు. అసలే ఎవరి మాటతోనూ ఏకీభవించని అఖిల్‌ అభి వ్యాఖ‌్యలకు సీక్రెట్‌ రూమ్‌నుంచే కౌంటరిస్తున్నాడు. దీపావళి పండగ వేళ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కి బహుమతులు ఇచ్చారు. ముఖ్యంగా లాస్యకు ఇచ్చిన గిఫ్ట్‌ అయితే హైలెట్‌గా నిలిచింది.

వేదాళం మూవీలోని ఓ సాంగ్‌ ప్లే చేసి హౌస్‌మేట్స్‌ను నిద్రలేపారు బిగ్‌బాస్‌. ఈ పాటకు ఇంటిసభ‌్యులందరూ కలిసి గార్డెన్‌ ఏరియాలో హుషారుగా డ్యాన్స్‌ చేశారు. గురువారం మటన్‌ చెడిపోవడంతో అవినాష్‌ని హౌస్‌మేట్స్‌ చితకబాదగా.. శుక్రవారం గుడ్లు పగులకొట్టి ఇంట్లో అడ్డంగా బుక్కయ్యాడు. గుడ్లు పగిలిన విషయం దాచేందుకు అవినాష్‌ ప్రయత్నించగా.. అరియానా ఠక్కున వెళ్లి సోహైల్‌, మెహబూబ్‌కు విషయం చెప్పింది. నువ్వేం రేషన్‌ మేనేజరవయ్యా అంటూ సోహైల్‌, మెహబూబ్‌, అరియానా కలిసి అవినాష్‌ని కుమ్మెశారు. సందు దొరికితే చాలు అమ్మాయిలతో పులిహోరా కలిపే అవినాష్‌.. అరియానాను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. అరియానా చాలా బాగుంటుంది కదా అని మోహబూబ్‌తో అనగా.. ఏమో నాకు తెలియదు అంటూ మెహబూబ్‌ తప్పించుకున్నాడు. ఇక అవినాష్‌ మాటలకు అరియానా ముసిముసి నవ్వులు నవ్వుతూనే అవినాష్‌కు అదిరిపోయే పంచ్‌లు వేసింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ''నవ్వడం నిషేధం'' టాస్క్‌ నవ్వులు పూయించింది. తోటి సభ్యులను నవ్వించడానికి కంటెస్టెంట్లు నానా యేషాలు వేశారు. ఎంతకీ హౌస్‌మేట్స్‌ నవ్వకపోవడంతో చివరికి బిగ్‌బాసే రంగంలోకి దిగి ఇంటి సభ్యులను నవ్వించాడు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి తీసుకువస్తే.. ఎంటర్‌టైన్మెంట్‌ చేయడంలో విఫలమయ్యారంటూ హౌస్‌మేట్స్‌పై బిగ్‌బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి పనిష్మెంట్‌గా ''నవ్వడం నిషేధం'' టాస్క్‌ ఇచ్చాడు. అంటే ఇంటి సభ‌్యులు ఒక్కరినొక్కరు నవ్వించుకోవాలి కానీ ఎవరూ నవ్వకూడదు. ఎవరైతే నవ్వుతారో వాళ్లు ఈ టాస్క్‌ ఓడిపోయినట్లు లెక్క. అలాగే బిగ్‌బాస్‌ కూడా ఇంటి సభ‌్యులను నవ్వించే ప్రయత్నం చేస్తాడు.. కానీ హౌస్‌మేట్స్‌ బోర్‌గా ఫీల్ కావాలి.

మొదటగా లాస్య వచ్చి తన చీమ-ఏనుగు జోక్‌తో నవ్వించే ప్రయత్నం చేసింది. ఓ చీమ అందంగా ముస్తాబై వచ్చి ఏనుగును పడేసేందుకు ప్రయత్నిస్తుందని, కానీ ఏనుగు మాత్రం పడలేదని, చివరకు చీమ కాలు అడ్డం పెట్టి పడేసిందని.. ఇదే జోక్‌ అని తనకు తానే నవ్వుకుంది. బట్‌ ఇంటి సభ్యులెవరూ లాస్య జోక్‌కు నవ్వలేదు. ఇక అరియానా.. మోహబూబ్‌, సోహైల్‌లను నవ్వించే ప్రయత్నం చేసి ఓడిపోయింది. సోహైల్‌ దగ్గరికి వెళ్లి 'మనం ఫస్ట్‌టైం కలిసినప్పుడు నీకు అలా ఇలా హాయ్‌ చెప్పా' అని అరియానా అంటే.. 'అయితే ఏంటి ఇప్పుడు' అని సోహైల్‌ పంచ్‌ విసరడంతో అరియానా ఇక నవ్వించలేను బాబూ.. అన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. తన స్నేహితుడైన అవినాష్‌ దగ్గరకు వెళ్లి ప్రయత్నించగా.. అక్కడ కూడా సక్సెస్‌ కాలేదు.

అవినాష్ మాత్రం అందరిని నవ్వించాడు. ముఖ్యంగా సోహైల్‌ అయితే అవినాష్‌ని చూని నవ్వు ఆపులేకపోయాడు. ఇక అలాగే లాస్యను, మెహబూబ్‌ను తనదైన శైలీలో పంచ్‌లు వేస్తూ నవ్వించాడు. ఇక అవినాష్‌ పంచ్‌లకు సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న అఖిల్‌ కూడా పగలబడి నవ్వాడు. ఒక మెహబూబ్‌ కుందేలు వేషం వేసి నవ్వించే ప్రయత్నం చేశాడు.

దీపావళి సందర్భంగా హౌస్‌మేట్స్‌కి ఇంటి సభ‌్యుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. 'నవ్వడం నిషేధం' టాస్క్‌లో ఇంటిసభ్యులు ఓడిపోయినా.. ప్రేక్షకులకు వినోదం పంచడంలో సక్సెస్‌ కావడంతో బహుమతులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. ఇక ఇంటిసభ్యులందరూ హౌస్‌లో దివాళీ సెలబ్రేషన్‌ చేసుకున్నారు. బిగ్‌బాస్‌ కూడా హౌస్‌మేట్స్‌పై జోకుల దాడి చేశాడు. సోహైల్‌ని పిలిచి.. 'సోహైల్‌ ఏందీ పంచాయితీ.. కథెట్లుందీ' అంటూ అతని స్టైల్లో అన్నాడు. దీంతో సోహైల్‌ నవ్వు ఆపుకోలేకపోయాడు. బిగ్‌బాస్‌ నోట తన మాటలు వచ్చాయి ఇది చాలు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. అవినాష్‌ని కూడా బిగ్‌బాస్‌ ఆటపట్టించాడు.' అవినాష్‌ నీ తెలుగు బాగుంటుంది.. తెలుగులో నవ్వు అవినాష్‌' అంటూ అతన్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. బిగ్‌బాస్‌ పంచ్‌లకు నవ్వట్లేదు.. నవ్వట్లేదు అంటూనే నవ్వేశాడు బిగ్‌బాస్‌.

'నవ్వడం నిషేధం' టాస్క్‌లో హౌస్‌మేట్స్‌ అంతా ఓడిపోయారని బిగ్‌బాస్‌ ప్రకటించారు. అయితే ఓడినా.. వినోదం పంచడంలో గెలిచారంటూ.. బహుమతులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చాడు. దీంతో ఇంటి సభ్యులంతా తమ తమ బహుమతులు తీసుకొని మురిసిపోయారు. అందరికి బహుమతులు అందించిన బిగ్‌బాస్‌.. లాస్యకు మరో సర్‌ప్రైజ్‌ అందించాడు. బిగ్‌బాస్‌ ఇంట్లో ఆమె కుమారుడు 'జున్ను' మాటలను వినిపించాడు. తన కొడుకు మాటలు విన్న లాస్య.. ఒక్కసారిగా ఆనందంతో ఇంట్లోకి పరుగులు తీసింది. కొడుకు ముసి ముసి నవ్వులు.. బుజ్జి బుజ్జి మాటలు విని ఎమోషనల్‌ అయింది.

దీపావళి పండగ సందర్భంగా.. హౌస్‌మేట్స్‌కి గులాబ్‌ జామ్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. లాస్య, మోనాల్‌ కలిసి గులాబ్‌ జామ్‌లను తయారు చేసి ఇంటి సభ‌్యులకు పంచారు. తర్వాత గార్డెన్‌ ఏరియాలో దీపాలు వెలిగించి పండుగను ఘనంగా జరుపుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories