Bigg Boss 4 Telugu: సీక్రెట్ లు చెప్పిన హౌస్ మేట్స్..లేఖలు పంపిన అఖిల్!

Bigg Boss 4 Telugu: సీక్రెట్ లు చెప్పిన హౌస్ మేట్స్..లేఖలు పంపిన అఖిల్!
x
Highlights

* ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ బిగ్‌ ఆఫర్ * కంటెస్టెంట్‌ల ఆప్తుల నుంచి లేఖలు తెప్పించిన బిగ్‌బాస్ * అరియాణా, అవినాష్‌కు ఆప్తుల లేఖ దక్కలేదు * జీవితంలో మిగిలి ఉన్న రహస్యాలను చెప్పాలన్న బిగ్‌బాస్ * తనకంటే ఏడాది చిన్న వ్యక్తితో పెళ్లి చేసుకున్న లాస్య * ప్రేమ, బ్రేకప్ గురించి చెప్పిన హారిక * డ్రంక్ అండ్ డ్రైవ్ రహస్యాన్ని రివీల్ చేసిన సోహైల్

67వ రోజు బిగ్‌బాస్ హౌస్ ఆసక్తికరమైన అంశాలు జరిగాయి. ఇంటి సభ్యుల గురించి సీక్రెట్ రూంలో కూర్చొని చూశాడు. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు వారి రహస్యాల గుట్టును బయటపెట్టేందుకు బిగ్‌బాస్ ప్రయత్నించాడు. ఈ టాస్క్‌లో కొంతమంది ఎమోషనల్‌కి గురైయ్యారు. అయితే.. ఇద్దరికీ మాత్రం అఖిల్ లేఖలు పంపలేదు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో 67వరోజు జరిగిన హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

67వ రోజు బిగ్‌బాస్ హౌస్‌లో అఖిల్‌ వెళ్లిపోయిన దాని గురించే ఎక్కువ చర్చ జరిగింది. ఉదయం.. ఎవరూ ఎలాంటి వారో ఇప్పుడిప్పుడే తెలుస్తోందని అఖిల్ సీక్రెట్‌ రూంలో ఉండి అనుకున్నాడు. బయటి మనుషుల మైండ్ సెట్‌ అర్ధం చేసుకోవడం కష్టమేమో కానీ, ఒకే ఇంట్లో ఉండి అర్ధం చేసుకోవడం చాలా ఈజీ అంటూ.. తనలో తానే నుకున్నాడు. ఆ తర్వాత అఖిల్‌ బయటకు వెళ్లిన దాని గురించి.. అభిజీత్, సోహైల్, మొహబూబ్ కలిసి చర్చించుకున్నాడు.

హౌస్‌లో మటన్ పాడైందని ఇంటి సభ్యులు కొద్దిసేపు గందరగోళం సృష్టించారు. మొహబూబ్‌ మటన్ కావాలంటూ ఏడ్చాడు. రేషన్ మేనేజర్‌గా ఉన్న.. అవినాష్‌ను నామినేట్ చేయాలని ఇంటి సభ్యులు అనుకున్నారు. రేషన్ మేనేజర్‌గా ఉన్న అవినాష్.. మటన్‌ను పాడు చేయడం సీక్రెట్ టాస్క్ అని అరియాణా చెప్పింది. దాంతో అవినాష్ ను సోహైల్, అభిజీత్ కొద్దిసేపు ఆడుకున్నారు. అవినాష్ సీక్రెట్ టాస్క్ కాదని ఎంత మొత్తుకున్న ఇంటి సభ్యులు వినలేదు. అరియాణా, మొహబూబ్ కలిసి అవినాష్ ను కొట్టారు.

సీక్రెట్ రూంలో ఉన్న అఖిల్‌కు బిగ్‌బాస్ పెద్ద పని అప్పజెప్పారు. ఇంటి సభ్యుల కోసం వచ్చిన లేఖలను వారికి ఇవ్వాలా వద్ద అనేది తమ ఇష్టమని తెలిపారు. అందుకోసం ఇంటి సభ్యులు ఒక్కొక్కరుగా కన్‌ఫెన్షన్ రూంకి వచ్చి తమ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద సీక్రెట్‌ను చెప్పాల్సి ఉంటుంది. అది జెన్యున్ అనిపిస్తేనే లేఖ అందించాలని బిగ్‌బాస్ కోరాడు..

బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు తమ ఆప్తుల నుంచి సందేశాలను పొందే అవకాశం కల్పించాడు. అయితే.. అందులో ఒక ట్విస్ట్‌ పెట్టాడు. తమ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద సీక్రెట్‌ చెప్పాలంటూ షరతు పెట్టాడు. బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఒక్కొక్కరిని పిలిచి తమ జీవితంలో మిగిలి ఉన్న అతిపెద్ద రహస్యాన్ని చెప్పలంటూ కోరారు. అందులో కొంతమంది ఎమోషనల్‌ అయితే.. మరికొంత మంది నవ్వుతూ చెప్పారు. దాంతో ఇంప్రెస్ అయిన వారికి అఖిల్ లేఖలు పంపించాడు. కొంతమందికి లేఖలను కట్ చేసి మరీ పంపించి ఏడిపించాడు.

బిగ్‌బాస్ ముందుగా మొహబూబ్‌ను పిలిచాడు. తన జీవితంలో ఎవరితోనూ పంచుకోని.. సీక్రెట్‌ చెప్పాలంటూ కోరాడు.. అలాగే మొహబూబ్‌ తన గురించి చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే అఖిల్ మొహబూబ్‌కు లేఖ పంపించాడు. ఆ తర్వాత హరికను పిలిచాడు. తన ఫ్యామిలీ గురించి చెప్పింది. తన తల్లి దగ్గర దాచింది ఏదీ లేదంటూనే చెప్పింది.. ఆరేళ్ల నుంచి చెప్తాదామనుకున్న విషయాన్ని చెప్పింది. తన ప్రేమ గురించి చెప్పింది..

ఆ తర్వాత అవినాష్‌ను పిలిచాడు. తన జీవితంలో జరిగిన విషయాన్ని చెప్పాడు. సినిమాలో రాణించేందుకు డబ్బులు తీసుకుని.. మోసం చేసిన విషయాన్ని రివీల్ చేశాడు. లాస్య తన కంటే ఏడాది చిన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయాన్ని తన తల్లికి చెప్పాలనుకుంది. అదే విషయాన్ని చెప్పి ఎమోషనల్‌కి లోనైంది.. దానికి ఇంప్రెస్ అయిన అఖిల్ లాస్యకు లేఖను పంపించాడు.

ఆ తర్వాత అభిజీత్ కన్ఫెన్షన్ రూంకి వచ్చాడు. తనకు న్యూయార్క్ నగరంలో ఎదురైన అనుభవాన్ని చెప్పుకున్నాడు. అరియాణా తనకు జరిగిన కారు ప్రమాదం గురించి చెప్పింది. దానిని ఫేక్ గా భావించిన అఖిల్ కార్డును పంపించలేదు.. మోనాల్ తన 12 వ తరగతిలో ఉన్న సమయంలో జరిగిన సీక్రెట్‌ను రివీల్ చేసింది. బ్యాంకు ఉద్యోగం గురించి చెప్పింది. చివరకు సోహైల్ తన డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన విషయాన్ని చెప్పాడు. తనకు లేఖ రాగానే మోనల్, సోహైల్ కలిసి డ్యాన్స్ చేశారు.

చివరకు.. ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చారు.. రెండు టీంలుగా ఏర్పాడి ఫిల్ ఇన్ ద బ్లాక్ పూర్తి చేయాలని కోరాడు...చివరకు టాస్క్ పూర్తి చేసిన అఖిల్‌ లేఖ కావాలంటూ బిగ్‌బాస్‌ను కోరాడు. అయితే.. చివర వరకు వేచి చూసిన ఫలితం లేకుండా పోయింది. ఇది ఇవాల్టి బిగ్‌బాస్ హైలైట్స్..

మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం..

Show Full Article
Print Article
Next Story
More Stories