Bigg Boss 4 Telugu: లాస్య ఎలిమినేషన్..కింగ్ ఆఫ్ ద కిచెన్ అభిజీత్!

Bigg Boss 4 Telugu: లాస్య ఎలిమినేషన్..కింగ్ ఆఫ్ ద కిచెన్ అభిజీత్!
x
Highlights

* సండే ఫండేగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ * కంటెస్టెంట్లతో రెండు గేమ్‌లు ఆడించిన నాగ్‌ * సాంగ్‌ను ఫాస్ట్‌ ఫార్వర్డ్, స్లో మోషన్‌లో పాడిన అఖిల్‌ * అవినాష్‌కు నెయిల్ పాలిష్ రుద్దిన సోహైల్‌ * చీర కట్టుకుని చిందులు వేసిన అవినాష్‌ * హారిక, మోనాల్‌, అభిజిత్‌, అరియానా సేఫ్‌ * అభిజిత్‌పై బిగ్‌బాంబ్‌ వేసిన వంటలక్క * అభిజిత్‌కు కింగ్‌ ఆఫ్‌ ద కిచెన్‌ బిరుదు

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద‌కొండో వారంలో లాస్య.. జున్నును క‌లిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అస‌లే లాస్య ఇల్లు విడిచి 70రోజులు దాటిపోవ‌డంతో జున్ను ఆమెను పూర్తిగా మార్చిపోయాడు. దీంతో ఆమె జున్ను చెంత‌కు చేరి త‌ల్లి ప్రేమ‌ కురిపించి మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌కు తీసుకోనుంది. ఇక వెళ్తూ వెళ్తూ కిచెన్ బాధ్య‌త‌ల‌నే బిగ్‌బాంబ్‌ను ఆమెకు ఎంతో ఇష్ట‌మైన వ్య‌క్తి మీద వేసింది. ఆదివారం రోజటి ఎపీసోడ్‌ అటు ఆనందం ఇటు బాధతో ముగిసింది. సండేను ఫండేగా మార్చేందుకు నాగార్జున ఇంటిసభ‌్యులతో రెండు గేమ్‌లు ఆడించారు. ఇక నామినేషన్‌లో ఉన్న సభ్యుల్లో హారిక, మోనాల్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించారు. ఇంటిసభ్యులతో వెరైటీగా నాగార్జున లూడో గేమ్‌ ఆడించారు. ఇందులో అరియానా టీమ్‌ విజయం సాధించింది. నామినేషనలో అభిజిత్‌, అరియానా సేఫ్‌ అయినట్లు ప్రకటించిన నాగ్‌.. లాస్య ఎలిమినేట్‌ అయినట్లు వెల్లడించారు. తోటిసభ్యులతో వీడ్కోలు తీసుకుని స్టేజీపైకి వచ్చిన లాస్య.. తాను కన్నింగ్‌ కాదని చెప్పుకొచ్చింది. సోహైల్‌, అభిజిత్‌ టాప్‌-2లో ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు అభిజిత్‌ చాలా ఇష్టమని అంటూనే బిగ్‌బాంబ్‌ అభి మీద వేసింది లాస్య.

సండేను ఫండేగా మార్చేందుకు నాగార్జున ఇంటిసభ‌్యులతో రెండు గేమ్‌లు ఆడించారు. ఇక నామినేషన్‌లో ఉన్న సభ్యుల్లో హారిక, మోనాల్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించారు. సండేను ఫండేగా మార్చేందుకు సిద్ధమైన నాగార్జున ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా విడగొట్టారు. వీరికి కొన్ని ఫొటోలను చూపించి దాని ఆధారంగా పాటల పేర్లను చెప్పమని గేమ్‌ ఆడించారు. పోటాపోటీగా సాగిన ఈ గేమ్‌ ముగిసేసరికి హారిక టీమ్‌ గెలిచింది. పదకొండోవారం నామినేషన్‌లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో శనివారం సోహైల్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించిన నాగార్జున.. ఆదివారం కెప్టెన్‌ హారిక సేఫ్‌ అయినట్లు ప్రకటించారు. దీంతో దేత్తడి తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది.

అనంత‌రం ఓ ప్రేక్ష‌కురాలు సంధించిన ప్ర‌శ్న‌ను ఇంటిసభ్యులకు వినిపించారు నాగార్జున. సేఫ్‌గా ఆడ‌టం మీ గేమ్ స్ట్రాట‌జీనా అని ఓ అభిమాని లాస్య‌ను అడ‌గ్గా.. తాను సేఫ్ గేమ్ ఆడ‌టం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. త‌ర్వాత మోనాల్ సేఫ్ అయిన‌ట్లు నాగ్‌ ప్ర‌క‌టించారు.

ఇంటిసభ్యులతో వెరైటీగా నాగార్జున లూడో గేమ్‌ ఆడించారు. ఇందులో అరియానా టీమ్‌ విజయం సాధించింది. ఇక నామినేషన్లలో అభిజిత్‌, అరియానా సేఫ్‌ అయినట్లు ప్రకటించిన నాగ్‌.. లాస్య ఎలిమినేట్‌ అయినట్లు వెల్లడించారు.

కంటెస్టెంట్లతో నాగార్జున లూడో గేమ్‌ ఆడించారు. సోహైల్‌, అఖిల్‌ డైస్‌ రోల్‌ చేసిన నంబర్ల ఆధారంగా ఒక్కో గడిని దాటుకుంటూ ముందుకు వెళ్లారు. ఇందులో సోహైల్‌ నోటితో నెయిల్‌ పాలిష్‌ను అవినాష్‌ వేళ్లకు అందంగా రుద్దాడు. అటు అఖిల్‌ రొమాంటిక్‌ సాంగ్‌ను ఏడుస్తూ.., ఫాస్ట్ ఫార్వ‌ర్డ్‌లో, స్లో మోష‌న్‌లో పాటను పాడి మెప్పించాడు.

తర్వాత లాస్య నాలుక బయటపెట్టి డైలాగులు చెప్పడం అందరికీ నవ్వు తెప్పించింది. ఇక అవినాష్ ఒక్క నిమిషంలో చీర క‌ట్టుకుని చిందులు వేయగా..‌ రాత్రి తొమ్మిది త‌ర్వాత నువ్వు చేసేది ఇదే అన్న‌మాట అని నాగ్ కౌంట‌ర్ వేశారు. మొత్తానికి లూడో గేమ్‌లో అరియానా టీమ్ గెల‌వ‌గా హారిక టీమ్ ఓడిపోయింది.

నామినేషన్లలో లాస్య, అభిజిత్‌, అరియానా ఉండగా.. అభిజిత్‌, అరియానా సేఫ్‌ కాగా, లాస్య ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున వెల్లడించారు. తోటిసభ్యులతో వీడ్కోలు తీసుకుని స్టేజీపైకి వచ్చిన లాస్య.. తాను కన్నింగ్‌ కాదని చెప్పుకొచ్చింది. సోహైల్‌, అభిజిత్‌ టాప్‌-2లో ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు అభి చాలా ఇష్టమని అంటూనే బిగ్‌బాంబ్‌ అభి మీద వేసింది లాస్య.

స్టేజీ మీద‌కు వ‌చ్చిన లాస్య ముందుగా త‌న‌ న‌వ్వు నిజ‌మైన‌దేన‌ని, క‌న్నింగ్ కాద‌ని చెప్పుకొచ్చింది. ఆ విష‌యం ప్రేక్ష‌కుల‌కు కూడా తెలుస‌ని నాగ్ భ‌రోసా క‌ల్పించారు. అనంతరం లాస్యకు పదకొండువారాల జర్నీని చూయించాడు నాగార్జున. ఇక సోహైల్‌, అభిజిత్ టాప్-2లో ఉంటార‌ని లాస్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అవినాష్‌.. ఎంట‌ర్‌టైన‌ర్ కానీ నామినేష‌న్‌ను తీసుకోలేడ‌‌ని చెప్పింది లాస్య. మోనాల్ బాగా ఆడుతుంది కానీ.. క‌న్ఫ్యూజ‌న్‌లో ఉంటుంద‌ని పేర్కొంది. ఇక అరియానా బోల్డ్‌గా మాట్లాడుతుందన్న లాస్య.., కొన్నిసార్లు త‌ప్పును కూడా ఒప్పుకోవాల‌ని అరియానుకు స‌ల‌హా ఇచ్చింది లాస్య.

సోహైల్‌కు ఎంత కోపం వ‌స్తుందో అంత త్వ‌ర‌గా క‌రిగిపోతాడన్న లాస్య.. అఖిల్ బాగా ఆడ‌తాడని అతడికి కూడా కోపం ఎక్కువేనని చెప్పుకొచ్చింది. ఇక తనకు అభి చాలా ఇష్టమంది. అటు హారిక‌తో స‌మ‌యం గ‌డ‌ప‌డం మ‌రీమ‌రీ ఇష్టమని చెప్పింది లాస్య. అనంత‌రం కింగ్ ఆఫ్ ద కిచెన్ బిరుదును అభిజిత్‌కు ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు వంట చేయాల‌న్న బిగ్‌బాంబ్ అభి మీద ప‌డింది.




Show Full Article
Print Article
Next Story
More Stories