Bigg Boss 4 Telugu: అఖిల్ తో ఆడేసుకున్న నాగార్జున..హౌస్ మేట్స్ గాలితీసేసిన అఖిల్!

Bigg Boss 4 Telugu: అఖిల్ తో ఆడేసుకున్న నాగార్జున..హౌస్ మేట్స్ గాలితీసేసిన అఖిల్!
x
Highlights

* బిగ్‌ బాస్‌ ఇంట్లో దీపావళి వేడుకలు * నాగ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఇంటి సభ్యులు * నాగార్జున పాటలకు ఇంటి సభ్యులు డ్యాన్స్ * అఖిల్ కి చుక్క‌లు చూపించిన నాగ్‌! * రీ ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌ * ప‌దకొండోవారంకెప్టెన్‌గా అఖిల్‌ * ఎలిమినేష‌న్ నుంచి అభిజిత్ సేఫ్‌

బిగ్ బాస్ షోలో పదో వారం కూడా ముగిసేందుకు వచ్చింది. వీకెండ్ ఎపిసోడ్ మొత్తం దీపావళి సెలెబ్రేషన్స్‌తో గడిపేశారు. నాగార్జున అందరినీ పండుగ మూడ్‌లోనే ఎంటర్టైన్ చేయించారు. దీపావ‌ళి కావ‌డంతో నాగార్జున‌కు కంటెస్టెంట్స్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక రూల్స్‌ను సరిగా పాటించడం లేదని... అర్ధం చేసుకోలేదని నాగ్‌ సీరియస్‌ అయ్యారు.

వేదికపైకి హోస్ట్‌గా నాగార్జున రాగానే ఇంటి సభ్యులందరూ సర్‌ప్రైజ్ ఇచ్చారు. నాగార్జున పాటలకు డ్యాన్సులు చేసి అదరగొట్టారు. అభిజిత్, లాస్య ఓ జంటగా, అరియానా, అవినాష్ మరో జంటగా, సోహైల్, మోనాల్ మరో జంటగా, అలాగే హరిక, మెహబూబ్ పాటలకు డ్యాన్సులు చేశారు. నాగార్జున ఇంటి సభ్యులకు గిఫ్టులు తెచ్చారు. అమల వాటిని కొనుగోలు చేసి మీకు పంపించిందని చెప్పడంతో ఇంటి సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు.

బిగ్‌బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులు తమకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే ట్యాగ్‌తో అఖిల్‌ను ఇంటి నుంచి బయటకు పంపించడం తప్పు అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశాలను, రూల్స్‌ను సరిగా పాటించడం లేదు, అర్ధం చేసుకోలేదని సీరియస్‌ అయ్యారు. ఇక మీరు పంపించిన అఖిల్‌కు ప్రాపర్‌గా వీడ్కోలు చెబుదాం అని నాగార్జున అనడంతో మోనాల్ ఏడుపు ముఖం పెట్టింది.

హౌస్‌లో ఎవ‌రు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవ‌రో ఇంటి స‌భ్యులు చెప్పి నామినేట్ చేయండి అని బిగ్‌బాస్ గత వారం అర్థ్ర రాత్రి టాస్క్ ఇవ్వ‌డంతో ఇంటి స‌భ్యులు అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అఖిల్‌ని నామినేట్ చేశారు. దీంతో అఖిల్‌ని బిగ్‌బాస్ సీక్రెట్ రూమ్‌లోకి పంపించేశారు. సీక్రెట్ రూమ్‌లో వుంటూ ఇంటి సభ్యుల్ని అబ్జ‌ర్వ్ చేశాడు అఖిల్. ఇక అఖిల్‌కు ప్రాపర్‌గా వీడ్కోలు చెబుదామని నాగార్జున అనడంతో మోనాల్ ఏడుపు ముఖం పెట్టింది. ఇంట్లో ఒక్కసారిగా గంభీరమైన వాతావరణం నెలకొంది.

దీపావళి వేడుక..

ఇంటి సభ్యులతో దీపావళీ సెలబ్రేషన్స్ ప్రారంభించారు. చిచ్చు బుడ్డీ, ఆటం బాబు బొమ్మలు ఇచ్చి ఎవరికి సరిపోతాయో చెప్పమన్నారు. ఎక్కువ మంది చిచ్చు బుడ్డిని సోహైల్‌కు, ఆటం బాంబును మెహబూబ్‌కు ఇచ్చారు. ఇక గేమ్ సందర్భంగా ఇంటి సభ్యులు ఫన్‌లో మునిగి తేలారు.

ఇక సీక్రెట్ రూమ్‌లో ఉన్న అఖిల్‌తో నాగార్జున మాట్లాడారు. ఇంటి సభ్యులు బయటకు పంపించేటప్పుడు డిఫెండ్‌ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. సూట్‌కేసు సర్దుకొని ఇంటిలోకి వెళ్లి సభ్యులతో సెల్పీ తీసుకొని వేదికపైకి రమ్మని చెప్పాడు. ఇంటి సభ్యులను కలిసి సెల్ఫీ తీసుకున్నారు.

తర్వాత అఖిల్‌తో ఓ గేమ్ ఆడించారు. అఖిల్‌తో గేమ్ ఆడిస్తూ.. ఇష్టమైన వ్యక్తికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్స్ తొడిగి రీజన్స్ చెప్పాలని చెప్పాడు. అలాగే నలుగురు శత్రువుల పేర్లు చెప్పాలన్నాడు. మిగితా వారు న్యూట్రల్‌గా ఉంటారు అని బిగ్ బాస్ ఆదేశలిచ్చారు.

మోనాల్, సోహైల్‌ను ఫ్రెండ్స్‌గా ట్రీట్ చేశారు. ఇక అభిజిత్, హారిక, లాస్య, మెహబూబ్‌ను అఖిల్‌ శత్రువులుగా ఎంపిక చేసుకున్నాడు.

ఇక అప్పటి వరకు అఖిల్‌కి చెమటలు పట్టిన నాగార్జున... ట్విస్ట్ ఇచ్చారు. హౌస్‌లో ఇంత డ్రామా నడిపిన నాగార్జున.. చివరిలో అఖిల్ ఎలిమినేట్ కావడం లేదని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. దీంతో ఇంటి సభ్యులందరూ హ్యాపీగా ఫీలయ్యారు. అంతే కాదు... చిన్న గేమ్ ఆడించి అఖిల్‌ను ఇంటి కెప్టెన్ చేశారు. ఇక ఈ వారం ఒకరిని సేవ్‌ చేసిన నాగార్జున అవినాష్ విన్న‌పాన్ని ఆల‌కించిన నాగ్ మ‌ట‌న్ పంపుతాన‌ని హామీ ఇచ్చారు.

కెప్టెన్ గా అఖిల్..

అఖిల్‌ను సేవ్ చేసిన నాగ్.. అతడికి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. అతని ముందు రెండు కుండలు పెట్టి.. ఒక దానిలో డైరెక్ట్ నామినేషన్, మరో దానిలో కెప్టెన్ కావడంతో పాటు ఇమ్యునిటీ పెంచుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆ కుండ ఏదో అఖిల్ ఊహించి పట్టుకోవాలని సూచించారు. అఖిల్ కెప్టెన్ కుండే పట్టుకున్నాడు. దీంతో వచ్చే వారానికి అఖిల్ ఇంటి కెప్టెన్ అయిపోయాడు.

ఈవారం నామినేషన్లలో అభిజీత్, హారిక, మెహబూబ్, సోహెల్, అరియానా, మోనాల్ ఉన్నారు. వీరిలో శనివారం నాటి ఎపిసోడ్‌లో అభిజిత్ ని సేవ్ చేశారు బిగ్ బాస్. నామినేషన్లలో ఉన్న ఆరుగురికి ఆరు సీసాలు ఇచ్చారు. వాటిని తలకు కొట్టి పగలగొట్టాలి. ఆ సీసాలో ఉన్న చిట్టీని తీయాలి. ఈ చిట్టీలో కేవలం అభిజీత్‌కు మాత్రమే సేఫ్ అని వచ్చింది. దీంతో అతనొక్కడే శనివారం ఎలిమినేషన్‌ నుంచి సేవ్ అయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories