Bigg Boss 4 Telugu: కెప్టెన్ టాస్క్..అఖిల్..మహబూబ్ రచ్చ రచ్చ!

Bigg Boss 4 Telugu: కెప్టెన్ టాస్క్..అఖిల్..మహబూబ్ రచ్చ రచ్చ!
x
Highlights

Bigg Boss 4 Telugu: కెప్టెన్సీ టాస్క్ లో అఖిల్..మెహబూబ్ రాజీ పడలేదు. దీంతో బిగ్ బాస్ టాస్క్ క్యాన్సిల్ చేశాడు. హారిక హాగ్ ఇవ్వలేదని అభిజిత్ గోల..మోనాల్ తో పులిహోర కలపాలని అవినాష్ తిప్పలు..

బిగ్ బాస్ సీజన్ 4... 66వ ఎపిసోడ్‌‌లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్‌లో ‎కెప్టెన్ ఎంపిక కోసం ఇంటి సభ్యుల మధ్య పోటీ జరిగింది. ఫిజికల్‌గానే కాకుండా స్మార్ట్‌గా ఆడాల్సిన టాస్క్‌ ఇచ్చాడు. అయితే గేమ్‌ మొదలవ్వడానికి ముందే ఇంటి సభ్యులు వ్యూహాలు పన్నుతూ కనిపించారు. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య ఆగ్రహ జ్వాలలు కనిపించాయి. అసలు బిగ్‌ బాస్‌ ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్‌ ఎంటో ఇప్పుడు చూద్దాం.

లక్స్ పాపా సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు ఇంటి సభ్యులు. అయితే నామినేషన్స్‌లో ఉప్పు-నిప్పుగా మారిన అరియానా-సొహైల్‌లు ఈ సాంగ్‌కి కలిసి స్టెప్పులు వేసి కనువిందు చేశారు. ఇక లాస్య పక్కనే కూర్చుని లాస్య ఆంటీ అంటూ సోహెల్‌ ఆటపట్టించాడు. లాస్య అక్కా నువ్ ఆంటీ అని అనుకుంటే నేను ఒప్పుకోను.. నువ్ ఆంటీవి కాదు అని ఆంటీ అని కాసేపు ఆడుకున్నాడు. చివర్లో అరియానా వచ్చి సొహైల్‌ని అంకుల్ అని అనడంతో ఛీ పో అనేశాడు.

ఆఖరు బంతి-కెప్టెన్ గోల్!

బిగ్‌బాస్ ఇంటిలో 10వ వారానికి కెప్టెన్ ఎంపిక కోసం అఖరి బంతి అనే కాన్సెప్ట్‌తో గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో తమ బొమ్మ ఉన్న బంతి కాకుండా వేరే బంతిని తీసుకొని దానిని బాస్కెట్ బాల్ పోల్‌లోని గోల్‌లో వేయాలి. చివరిగా వేసిన వారు రేసు నుంచి బయటకు వెళ్లిపోతారు అని రూల్ చెప్పారు. అలా అందరూ పరుగెత్తి ముందుగా గోల్ వేసేందుకు ప్రయత్నించారు. ఈ గేమ్ సందర్భంగా ఇంటి సభ్యులు వ్యూహాలు పన్నుతూ కనిపించారు.

ఈ గేమ్ గురించి మొదటి నుంచి అభిజిత్ ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువ ఆలోచించి తాను కన్ఫ్యూజ్ అవుతూ హారికను కూడా కన్ఫ్యూజన్‌లో పడేశాడు. అతని గేమ్ ప్లాన్ ఏంటో ఎందుకు ఆలోచిస్తున్నాడో.. ఎందుకు బాల్ వేయొద్దని అన్నాడో ఎవరికీ అర్థం కాలేదు. మొదట లాస్య, ఆ తరువాత అరియానా, మోనాల్, అభిజిల్ ఇలా ఒక్కొక్కరుగా గేమ్ నుంచి ఔట్ కాగా.. చివరికి ముగ్గురు మిత్రులు మెహబూబ్, అఖిల్, సొహైల్‌లు మాత్రమే మిగిలారు. అయితే సొహైల్ ఆల్రెడీ కెప్టెన్ కావడంతో మెహబూబ్, అఖిల్‌ల కోసం త్యాగం చేసి గేమ్ నుంచి తప్పుకున్నాడు.

బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో సోహెల్, అఖిల్, మెహబూబ్‌లది ఓ వింత క్యారెక్టర్. టాస్కుల కోసం దగ్గరయ్యారా? టాస్కుల వల్ల దగ్గరయ్యారా? టాస్కుల కోసం గొడవలు పడుతుంటారా? అన్నది ఎవ్వరికీ సరిగ్గా అర్థం కావడం లేదు. ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. కానీ అది ఎక్కువగా ప్రొజెక్ట్ కాదు. ప్రతీసారి గొడవలు అవుతూనే ఉంటాయి. మళ్లీ వెంటనే కలుస్తారు.. మళ్లీ టాస్కులు పెడితే మళ్లీ గొడవలు పడుతుంటారు. ఇప్పుడు వీరి మధ్య మళ్లీ గోడవ జరిగింది.

ఇక చివరకు రేసులో అఖిల్, మెహబూబ్ కెప్టెన్సీ టాస్క్‌లోనే మిగిలారు. అయితే ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితుల్లో వారు కాంప్రమైజ్ కాకుండా ఉన్నారు. నేను కెప్టెన్ అవుతా అంటే నేను కెప్టెన్ అవుతా అంటూ ఆటను పెంట పెంట చేశారు.

ఇక అఖిల్, మెహబూబ్ అలానే ఉండి గేమ్‌ను ఆపివేయడంతో బిగ్‌బాస్ వార్నింగ్ ఇచ్చారు. కెప్టెన్సీ టాస్క్‌ను రద్దు చేస్తున్నామని చెప్పాడు. దీంతో అఖిల్, మెహబూబ్‌ తీరుపై సోహెల్‌ కోపంతో ఊగిపోయాడు.

ఇక ప్రతి సారి నేనే తగ్గలా అంటూ సొహైల్ ముందు అఖిల్‌ ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్‌లో బాండింగ్.. రిలేషన్.. ఫ్రెండ్ షిప్ ఏదీ ఉండదు.. అన్నీ అబద్ధలే.. నటిస్తారు అంతా.. తన గురించి తాను చెప్పుకున్నాడో ఏమో తెలియదు కానీ.. బక్వాజ్ గేమ్ అంటూ అఖిల్‌ చిందులు తొక్కాడు. ఇక గేమ్‌ని పోగొట్టారు అంటూ సొహైల్ తెగ బాధపడ్డాడు.

ఇక మధ్యలో హారిక తనకు హగ్ ఇవ్వడం లేదని అభిజిత్ తెగ ఫీల్ అయిపోయాడు. దీంతో నేను హగ్ ఇస్తే కుర్చీలో నుంచి కిందపడేలా హగ్ ఇస్తా.. నువ్ నన్ను సరిగా చూసుకోవడం లేదు అని హారిక బుంగమూతి పెట్టింది. ఇక అప్పటి వరకు ఆగ్రహంతో ఊగిపోయిన అఖిల్‌, మెహబుబ్‌, సోహెల్‌కు మళ్లీ వాళ్ల ఫ్రెండ్ షిప్ గుర్తుకు ఒకరిని మరోకరు ఓదార్చుకున్నారు. ఇక మోనాల్ గజ్జర్‌కు అవినాష్ బిస్కెట్లు విసురుతూ కనిపించాడు. లడ్కీ లడ్కీ గుజరాత్ లడ్కీ.. మా కోసమే వచ్చావే బిగ్‌బాస్‌లోకి అంటూ పాట అందుకొన్నాడు. ఇక మోనాల్‌ను అవినాష్ టీజ్ చేస్తుంటే... మరోవైపు అఖిల్‌కు హారిక మసాజ్ చేస్తూ కనిపించింది.

ఇక 65వ రోజు బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు షాకిచ్చారు. అర్ధరాత్రి సైరన్ మోగించి ఇంటి సభ్యులను నిద్ర లేపారు. వారిని సూట్ కేసులు సర్దుకొని లాన్ లోకి రమ్మని ఆదేశించాడు. దీంతో ఇంటి సభ్యుల్లో టెన్షన్ పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories