Bigg Boss 3 Telugu Episode 87: వదలని నామినేషన్ రచ్చ.. బిగ్ బాస్ లోకి హోస్ మేట్స్ కుటుంబసభ్యులు!

Bigg Boss 3 Telugu Episode 87: వదలని నామినేషన్ రచ్చ.. బిగ్ బాస్ లోకి హోస్ మేట్స్ కుటుంబసభ్యులు!
x
Highlights

ఈవారం నామినేషన్స్ సందర్భంగా జరిగిన రచ్చ ఈ ఎపిసోడ్ లోనూ కొనసాగింది. షో చివరికి వచ్చేస్తున్న దశలో.. అందర్నీ నామినేషన్స్ లోకి నెట్టేస్తూ బిగ్ బాస్...

ఈవారం నామినేషన్స్ సందర్భంగా జరిగిన రచ్చ ఈ ఎపిసోడ్ లోనూ కొనసాగింది. షో చివరికి వచ్చేస్తున్న దశలో.. అందర్నీ నామినేషన్స్ లోకి నెట్టేస్తూ బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం హౌస్ మేట్స్ మధ్యలో సెగలు రాజేసింది. ఇదిలా ఉంటే హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు ఒకరొకరు హౌస్ లోకి వచ్చి కొంత సేపు గడిపి వెళుతున్నారు. ఇందుకోసం బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ట్విస్ట్ లు ఇస్తున్నాడు.

కొత్త గ్రూపులు..

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్ ప్రక్రియ దుమారాన్నే రేపింది. ఇప్పటివరకూ ఉన్న గ్రూపులు మళ్లీ విడిపోయి కొత్త గ్రూపులు తయారయ్యాయి. ఉన్న ఏడుగురూ మూడు గ్రూపులుగా తయారయ్యారు. వరుణ్, వితిక ఇప్పటివరకూ రాహుల్, పునర్నవి లను అడ్డుపెట్టుకుని దొంగాట ఆడారు. పునర్నవి వెళ్ళిపోవడం.. రాహుల్ జన్యూన్ గేమ్ ఆడుతుండడంతో ఈ జంట విన్యాసాలు బయటపడుతున్నాయి. అదీ కాకుండా మిగిలిన వారు కూడా ఈ జోడీ అప్పట్లో చేసిన పనులకు ఇప్పుడు రివెంజ్ తీసుకుంటున్నారు. నామినేషన్ లో వరుణ్, శివజ్యోతి మధ్య జరిగినవాదన చివరికి అందర్నీ నామినేషన్ లోకి తీసుకువచ్చింది. దీంతో ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చలో ఎవరిదీ తప్పు అనే అంశం పై హౌస్ లో రచ్చ అవుతోంది. మెజార్టీ సభ్యులు.. రాహుల్ తో సహా అందరూ వరుణ్ ని తప్పు పడుతున్నారు. ఇక ప్రేక్షకులు ఎవరిని తప్పుపదటారో తేలాల్సి ఉంది.

హౌస్ లోకి అతిథులు..

బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హోటల్ ప్రారంభించాడు. దీనికి మేనేజర్ వరుణ్, చెఫ్ లుగా బాబా భాస్కర్, శ్రీముఖి, వితిక వ్యవహరిస్తారు. రాహుల్, శివజ్యోతి, అలీ హౌస్ కీపింగ్ చేస్తారు. అయితే, అతిధులు వస్తారు. వారికి మర్యాదలు చేసి వారి నుంచి స్టార్ పొందాలి. ఇదీ టాస్క్. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. బిగ్ బాస్ ఫ్రీజ్ అవమంటే అయిపోవాలి. ఫార్వార్డ్ అంటే ఫార్వార్డ్ గా పనిచేయాలి. స్లీప్ అంటే అంతా కళ్ళు మూసుకోవాలి. ఇలా తప్పనిసరిగా చేయాలి. బిగ్ బాస్ ఆగమనేవరకూ ఇందులోంచి బయటకు రాకూడదు. ఇది మొదలు పెట్టిన కొద్ది సేపటికి హౌస్ మేట్స్ అందరూ మార్చ్ చేస్తుండగా వితిక చెల్లెలు అతిథిగా వచ్చింది. కానీ, మార్చ్ చేస్తున్న వితిక ఆగలేదు. అయితే, చాల ఎమోషన్ అయింది. అటుతరువాత అలీ భార్య వచ్చింది. ఈ సమయంలో అందరూ స్లీప్ మోడ్ లో ఉన్నారు. దాంతో అలీని పట్టుకుని ఆమె ఏడ్చేసింది. ఇలా ఎమోషనల్ గా ఇంటికి అతిథులు వస్తున్నారు.

మొత్తమ్మీద ఎపిసోడ్ అంతా నామినేషన్ లో జరిగిన రచ్చ చుట్టూ చర్చలతో సాగింది. ఇక హోటల్ టాస్క్ సరదాగానే ఉంది. ముందు రెండు సీజన్ ల లానే.. అతిథులు వచ్చేటప్పుడు ఎమోషన్ పెంచే గేమ్ ఆడిస్తున్నారు. ఇది కూడా ఫరవాలేదనిపించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories