Bigg Boss 3 Episode 75: హీరో బాబా భాస్కర్ ని జీరో చేసిన పులిహోర పున్నూ గ్రూప్

Bigg Boss 3 Episode 75: హీరో బాబా భాస్కర్ ని జీరో చేసిన పులిహోర  పున్నూ గ్రూప్
x
Highlights

గ్రూప్ గా ఉండడం లో లాభం ఏమిటో.. నష్టం కూడా ఏంటో బాబా భాస్కర్ కి తెలిసి వచ్చింది. శ్రీముఖి పెళ్ళైతే కాబోయే భర్త పరిస్థితి పై గుసగుసలు.. డెట్టాల్ కోసం...

గ్రూప్ గా ఉండడం లో లాభం ఏమిటో.. నష్టం కూడా ఏంటో బాబా భాస్కర్ కి తెలిసి వచ్చింది. శ్రీముఖి పెళ్ళైతే కాబోయే భర్త పరిస్థితి పై గుసగుసలు.. డెట్టాల్ కోసం చీప్ డిస్కషన్.. ఇవీ ఈ బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ విశేషాలు.

శ్రీముఖి పెళ్ళయితే?

రాహుల్, వరుణ్ తీరుబాటుగా కూచుని శ్రీముఖి పై డిస్కషన్ మొదలు పెట్టారు. శ్రీముఖి వాయిస్ పై గుసగుసలాడారు. శ్రీముఖి పెళ్ళైతే ఆమె భర్త ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కాపరం చేయాలంటూ కామెంట్స్ చేసుకున్నారు. తన పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు అంటూ పునర్నవికి పులిహోర కలుపుతున్న రాహుల్ పునర్నవి నన్ను ఉదయ్యాన్నే ఎదవ అని తిట్టిడంతోనే స్టార్ట్ చేసింది ఎందుకో తెలియడం లేదని రాహుల్ వరుణ్ దగ్గర వాపోయాడు. ఇష్టంతో తిడుతుందంటూ తన ప్రేమ సినిమాల అనుభవాన్ని చెప్పాడు వరుణ్. నీకు ఇష్టంలా అనిపిస్తుంటే.. మరి నాకెందుకు కష్టంగా అనిపిస్తుందని ప్రశ్నించిన రాహుల్ కు కష్టాన్ని ఇష్టపడితే కష్టం అనిపించదు బ్రో అంటూ సినిమా డైలాగులతో హితోపదేశం చేశాడు వరుణ్.

దటీజ్ బాబా!

కబుర్లు చెప్పే శ్రీముఖి వల్ల కాలేదు.. కండలు పెంచి కస్సు బస్సు మనే యంగ్ అగ్రెసివ్ చేతులెత్తేశాడు. ఏడుస్తూ నేట్టుకోచ్చేస్తున్న శివజ్యోతి కాస్తో కూస్తో లాగించాగాలిగింది. కానీ, బాబా భాస్కర్ సాధించాడు. గేమ్ ఆఫ్ మేడాలియన్స్ రెండో అంకం ఇంట్రస్టింగ్ గా సాగింది. పూర్తి స్థాయి ఫిజికల్ ఫిట్ నేస్ పరీక్షలా ఇది సాగింది. గేమ్ లో రెండో రోజు బ్యాలెన్స్ ఫ్రేమ్ టాస్క్‌‌ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్ లో ఉన్న నలుగురికీ అవకాశం లేదు. వితిక ఇప్పటికే ఫైనల్స్ చేరిపోయింది. దీంతో శ్రీముఖి, శివజ్యోతి, అలీ, బాబా భాస్కర్ గేమ్ ఆడారు. ఫ్రేం లో నిలబడి తలపై క్యూబ్ పెట్టుకుని ఉండాలి. క్యూబ్ కింద పడకూడదు.. ఫ్రేం తాకకూడదు. అయితే రెండుసార్లు చాన్స్ ఉంటుంది. మూడోసారి కూడా క్యూబ్ పడిపోతే వారు అవుట్ అయినట్టు. క్లిష్టమైన ఈ టాస్క్ లో శ్రీముఖి ముందు అవుట్ అయిపొయింది. తరువాత కొద్ది సేపటికి అలీ దిగిపోయాడు. శివజ్యోతి బాబా భాస్కర్ ల మధ్య పోరు చాలా సేపు సాగింది. కానీ, కొద్దిసేపటికి శివజ్యోతి అవుట్ అయిపొయింది. బాబా భాస్కర్ మొత్తం గేమ్ లో ఒక్కసారి కూడా లైఫ్ తీసుకోకుండా చివరి వరకూ నిలబడి గెలిచారు. తన డ్యాన్సింగ్ అనుభవాన్ని ఈ గేమ్ లో ఉపయోగించి ఫిజికల్ గా తన ఫిట్ నెస్ ఎంతో రుజువు చేసి హీరో అయ్యారు.

గ్రూపు కట్టి టాలెంట్ ని ఎగతాళి చేశారు..

హీరోగా నిలిచినా బాబాను జీరో చేశారు పునర్నవి అండ్ గ్రూప్. మొదటి రోజు విజేత వితిక, రెండో రోజు విజేత బాబా భాస్కర్ లో ఒకరిని సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి చెప్పారు. దీంతో పునర్నవి అండ్ కో బాబా భాస్కర్ కి గుడ్లు కొట్టారు. వాళ్ళ గ్రూపు సభ్యలు ఎక్కువగా ఉండడంతో బాబా ఓడిపోయారు. కానీ, వితిక టాస్క్ గెలిచింది కూడా ఇదే గ్రూపు సహకారంతో. గ్రూపుగా ఆడిన ఆటలో ఆమె విజేత అయింది. అయితే, బాబా వన్ మెన్ షో తో విజేతగా నిలిచారు. బాబాని జీరో చేసిన గ్రూపు అంతటితో ఆగలేదు. గ్రూపు పోటీలో గెలిచిన వితిక గొప్ప అంటూ.. బాబాని హేళనగా మాట్లాడుకున్నారు. పునర్నవి అయితే బాబా పెద్ద హీరోలా ఫీల్ అయిపోతున్నాడని.. అతని నేచర్ అంతే అంటూ రాహుల్ తో ప్రేమాయాణ నాటకంతో గట్టేక్కుతూ హౌస్ లో కొనసాగుతున్నపునర్నవి రెచ్చిపోయింది.

మొత్తమ్మీద ఎపిసోడ్ అంతా గుసగుసల గోలగా గడిచింది. బాబా విజేత గా నిలిచిన గేమ్ బాగా నడిచింది. హౌస్ మేట్స్ నిజమైన టాలెంట్ బయటకు తీసే విధంగా ఈ గేమ్ సాగింది. పులిహోర కథలతో గేమ్ లు ఆడకుండానే.. సేవ్ అయిపోతున్న పునర్నవి అహంకారంతో ప్రవర్తిస్తోంది. బాబా భాస్కర్ గెలుపును హేళన చేస్తూ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఇది కొంచెం అతిగా అనిపించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories