Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు నమోదు


Pushpa 2: సంథ్య థియేటర్ తొక్కిసలాటపై స్పందించిన అల్లు అర్జున్ టీమ్
Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు నమోదు సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ...
Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు నమోదు
సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేసు నమోదు అయ్యింది. సెక్షన్ 105, 118 ఎన్బీఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప మూవీ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వస్తున్న సందర్భంగా భద్రతా విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్న విషయాన్ని పోలీసులకు సరైన సమయంలో చేరవేయకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ టీమ్ పై కూడా కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించారు. బుధవారం రాత్రి 9.40 గంటలకు పుష్ప 2 ప్రీమియర్ షోన్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు వచ్చారు. అభిమానులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు థియేటర్ కు వస్తారన్న సమాచారం మాకు లేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి సమాచారం మాకు అందివ్వలేదు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



