రానా నాయుడు విషయంలో భారీ ప్రమోషన్లు

Big Plans for Release of Rana Naidu Web Series | Tollywood
x

రానా నాయుడు విషయంలో భారీ ప్రమోషన్లు

Highlights

రానా నాయుడు విషయంలో భారీ ప్రమోషన్లు

Rana Naidu: గత కొంతకాలంగా దగ్గుబాటి హీరోలు వెంకటేష్ మరియు రానాలతో ఒక ప్రాజెక్ట్ చేయాలని దగ్గుబాటి సురేష్ బాబు అనుకుంటూ ఉన్నారు. కానీ సురేష్ బాబుకి మంచి కథ దొరకపోవడంతో ఎప్పటికప్పుడు ఈ దగ్గుబాటి మల్టీ స్టారర్ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా హాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అమెరికన్ క్రైమ్ డ్రామా "రే డెనోవన్" తెలుగు రీమేక్ గా ఒక వెబ్ సిరీస్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది.

ఈ వెబ్ సిరీస్ ను ఈ ఏడాది దీపావళి సందర్భంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ విడుదల విషయంలో భారీగా ప్రమోషన్లు చేయాలని నెట్ ఫ్లిక్స్ కూడా ఆలోచిస్తుంది అని సమాచారం. ఇతర డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లలో కూడా బలమైన కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ మరియు సినిమాలు ఎప్పటికప్పుడు విడుదల అవుతూ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అలాంటి వాటికి గట్టి పోటీ ఇస్తూ రానా నాయుడు వెబ్ సిరీస్ అందరికి దృష్టిని ఆకర్షించాలి అంటే ప్రమోషన్లు ఒకటే మార్గం. అందుకే నెట్ ఫ్లిక్స్ వారు కూడా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ల విషయంలో జాగ్రత్తలు వహించాలని సినిమా స్థాయిలో ప్రమోషన్లు చేయాలని అనుకుంటున్నారట. కరణ్ అంశుమాన్ మరియు సూపర్న్ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించిన రానా నాయుడులో ప్రముఖ నటీనటులు కూడా ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories