Big Boss 9 : ఆమెను టార్గెట్ చేస్తే ఎలిమినేషన్ పక్కా...బిగ్ బాస్ 9లో తనూజ ఫ్యాక్టర్

Big Boss 9 : ఆమెను టార్గెట్ చేస్తే ఎలిమినేషన్ పక్కా...బిగ్ బాస్ 9లో తనూజ ఫ్యాక్టర్
x

Big Boss 9 : ఆమెను టార్గెట్ చేస్తే ఎలిమినేషన్ పక్కా...బిగ్ బాస్ 9లో తనూజ ఫ్యాక్టర్

Highlights

నిజ జీవితంలోని సంఘటనలను, అనూహ్యమైన మానవ సంబంధాలను ఒక గేమ్ ఫ్రేమ్‌లో చూపించే రియాలిటీ షో బిగ్ బాస్.

Big Boss 9 : నిజ జీవితంలోని సంఘటనలను, అనూహ్యమైన మానవ సంబంధాలను ఒక గేమ్ ఫ్రేమ్‌లో చూపించే రియాలిటీ షో బిగ్ బాస్. ఇది కేవలం ఆట మాత్రమే కాదు, కంటెస్టెంట్‌ల ప్రవర్తనను, వారి మైండ్ గేమ్‌ను గమనించే ఒక మైండ్ సెట్ యాంగిల్ అని చెప్పాలి. అయితే, బిగ్ బాస్ షో నిర్వహకులు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ట్విస్టులు సృష్టిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ 9లో ఏడవ వారం ఎలిమినేషన్ చుట్టూ జరిగిన డబుల్ ఎలిమినేషన్ డ్రామా, అందులో రమ్య మోక్ష ఎలిమినేట్ అవ్వడం మరో పెద్ద ట్విస్ట్. ముఖ్యంగా హౌస్‌లో ఒక కంటెస్టెంట్‌ను టార్గెట్ చేస్తే ఎలిమినేషన్ ఖాయం అనే కొత్త టాక్ కూడా మొదలైంది.

బిగ్ బాస్ సీజన్ 9 లో ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ వారం అనూహ్యంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ముందుగా, ఆరోగ్య సమస్యల కారణంగా ఆయేషా మిడ్-వీక్ ఎలిమినేషన్‌లో హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆయేషా వెళ్లిపోవడంతో ఈ వారం ఇంకెవరూ ఎలిమినేట్ కారని ప్రేక్షకులు భావించినా, షో డోస్ పెంచడానికి బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లీకుల ప్రకారం ఈ ప్రక్రియలో రమ్య మోక్ష ఎలిమినేట్ అయ్యింది.

ఈ వారం దివ్య, సంజన, శ్రీనివాస్ సాయి, రాము రాథోడ్, రమ్య మోక్ష నామినేషన్స్‌లో ఉండగా, మొదట దివ్య సేఫ్ అయ్యారు. చివరికి సంజన, రమ్య మోక్ష మిగలగా, రమ్య ఎలిమినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో పచ్చళ్ల పాప రమ్య మోక్ష ఎలిమినేషన్ వెనుక సీరియల్ నటి తనూజ ఫ్యాక్టర్ ఉందని ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తనుజ తన ఆట తీరుతో, ముఖ్యంగా టాస్కులలో ఆడ శివంగిలా ఆడటం ద్వారా బయట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఎవరైతే తనుజను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారో లేదా నామినేట్ చేస్తున్నారో, వారు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. రమ్య మోక్ష ఈ వారం నామినేషన్లలో తనుజపై పర్సనల్ ఎటాక్ చేసే విధంగా మాట్లాడింది. దీంతో తనుజ ఫ్యాన్స్ రమ్య బయటకు రావాలని కోరుకున్నారు. వారి కోరిక మేరకే రమ్య ఎలిమినేట్ అయ్యిందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఎలిమినేట్ అయిన రమ్య మోక్ష, తాను ఇంత త్వరగా వెళతానని ఊహించలేదని చెబుతూ, మిగిలిన హౌస్‌మేట్స్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. ఎలిమినేట్ అయ్యే ముందు రమ్య మోక్ష వాష్‌రూమ్ డ్యూటీని రీతూ చౌదరికి ఇచ్చింది. హౌస్‌ను రమ్య ఖాళీ చేసిన తర్వాత, లీకుల సమాచారం ప్రకారం.. త్వరలోనే దమ్ము శ్రీజతో రమ్యను రీప్లేస్ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories