భూమికలో కొత్త కోణం... లేడీ విలన్ గా !

భూమికలో కొత్త కోణం... లేడీ విలన్ గా !
x
Bhumika Chawla (File Photo)
Highlights

అక్కినేని సుమంత్ హీరోగా నటించిన యువకుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది భూమిక చావ్లా.

అక్కినేని సుమంత్ హీరోగా నటించిన యువకుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది భూమిక చావ్లా... ఆ తర్వాత ఖుషి, సింహాద్రి, ఒక్కడు మొదలగు సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ గా పేరు గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి లేడీ ఓరియంటెడ్ సినిమాల పైన ఫోకస్ చేసింది అందులో భాగంగానే అనసూయ, ఎంఎస్ ధోని, ఎంసీఏ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం భూమిక తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

అయితే తెలుగులో నటించబోయే ఓ సినిమాలో పూర్తిగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించ నున్నాని తాజాగా ఓ ఇంట్వ్యూలో పాల్గొన్న భూమిక చెప్పుకొచ్చింది. . మిస్సమ్మలో నెగిటివ్ షేడ్ పాత్ర చేసినప్పటికీ చివరికి కథ అంతా మారిపోతుంది. అయితే అలా కాకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి నెగటివ్ షేడ్ పాత్ర ఉంటుందని, ఇంకా చెప్పాలంటే లేడి విలన్ పాత్ర అని, అలాంటి పాత్ర దొరకడం తన అదృష్టమని భూమిక వెల్లడించింది అయితే అది ఒక స్టార్ హీరో సినిమా ప్రస్తుతానికి సస్పెన్స్ అని భూమిక వెల్లడించింది. మరి భూమికకి ఆ సినిమా ఏలాంటి పేరు తీసుకు వస్తుందో చూడాలి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories