Bheeshma: 'భీష్మ' సినిమా రివ్యూ

Bheeshma: భీష్మ సినిమా రివ్యూ
x
భీష్మ రివ్యూ
Highlights

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ'. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యంగ్ హీరో నితిన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ'. ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు నిరాశపరచడంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఉద్దేశ్యంలో ఆచితూచి అడుగేశాడు. 'ఛలో' సినిమాతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుని విమర్శల ప్రసంశలు దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నితిన్ హిట్ బాట పట్టించిదా? లేదా అని తెలుసుకుందాం.

కథ:

భీష్మ (నితిన్‌) ఐఏఎస్‌ అని చెప్పుకుంటూ.. అమ్మాయిల వెంట పడతాడు. అమ్మయిలు పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే భీష్మకు బై చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే భీష్మ చెప్పిన ఐఏఎస్‌కు అర్థం కలెక్టర్‌ కాదు.. ఐ యామ్‌ సింగిల్‌ అని అర్థం. డిగ్రీ కూడా పాస్ కానీ భీష్మ సామాజీక మాధ్యమాల్లో మీమ్స్‌ క్రియేట్‌ చేసి పోస్ట్‌ చేస్తూ.. కాలం వెల్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా భీష్మ చైత్ర(రష్మిక)ను చూడగానే ప్రేమిస్తాను ఆమె వెంట పడతాడు. భీష్మను అసహ్యించుకునే చైత్ర కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత బాగా సాగుతున్న తరుణంలో ఏసీపీ దేవా(సంపత్‌) భీష్మ తన కూతురు చైత్రను ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్‌ గురిపెడతాడు. అయితే ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్‌ (నరేశ్‌) ఓ సంచలన విషయాన్ని చెబుతాడు.

ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీకి సీఈఓ అని రూ.8వేల కోట్లు టర్నోవర్‌ కలిగిన కంపెనీకి పెద్దాయన భీష్మ (అనంత్‌ నాగ్‌) మనవడని సంచలన విషయం చెబుతాడు. కాగా.. ఆ తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీని నేల కూల్చడానికి ఫీల్డ్‌ సైన్స్‌ కంపెనీ విశ్వపయత్నాలు చేస్తుంటుంది. అఖరికి ఫీల్డ్‌ సైన్స్‌ ప్రయత్నాలు సఫలమయ్యాయా? కొడుకును కాపాడుకోవాడానికి ఆనంద్ అబద్దం చెప్పాడా? భీష్మను చైత్ర ఎందుకు దూరం పెట్టింది? ఈ కథలోకి రాఘవన్‌ (జిషుసేన్‌ గుప్తా), పరిమళ్‌ (వెన్నెల కిశోర్‌), జేపీ (బ్రహ్మాజీ)లు ఎందుకు వస్తారు అనేది అసలు కథ.

విశ్లేషణ

అనంత్ నాగ్ ఆర్గానిక్‌ వ్యవసాయం గొప్పతనం చెప్పే మాటలతో సినిమా ఆరంభం అవుతుంది. హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమా మొత్తం భీష్మ ,అనంత్‌ నాగ్‌, ఆర్గానిక్‌ ఫుడ్‌ కంపెనీ చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ చక్కగా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా పడ్డాడు. చెప్పలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై చూపించాడు. కథ ఎక్కడ పక్కదారి పట్టించకుండా సినిమా సాగుతుంది. ఫస్టాఫ్‌ సాఫీగా మొత్తం హీరోయిన్‌ ఎంట్రీ, వెన్నెల కిశోర్‌, సంపత్‌, నరేశ్‌, బ్రహ్మాజీల కామెడీ సీన్లతో సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో ముగిస్తాడు.

ఇక ద్వితీయార్థం కామెడీతోనే మొదలవుతుంది. కథ లాగ్ అనిపించిన అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల ఉత్కంఠకు గురిచేస్తాయి. ముఖ్యంగా రెండో ఆర్గానిక్ కంపెనీ చూట్టూ అల్లుకున్న కథ ఎక్కడా బోర్‌ కొట్టదు. ఇక ఈ సినిమాలో హీరో చదువుకోలేదు.. డబ్బు ఉన్నవాడు కాదు.. కానీ, అనుకున్నది సాధిస్తాడు. కొన్ని డైలాగ్స్ వావ్ అనిపిస్తాయి.

సాంకేతికంగా..

ఈ చిత్రంలో భీష్మగా నితిన్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో అల్లరించాడు. ప్రదమార్థంలో అల్లరిచిల్లరగా.. తిరిగే కుర్రాడిగా కనిపించిన నితిన్‌, ద్వితీయార్థంలో కంపెనీ సీఈఓగా హుందాగా కనిపించాడు. నితిన్‌ తన నటనలో డిఫరెంట్‌ షేడ్స్‌ను చూపించి మరో మెట్టు ఎక్కాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి రష్మిక చైత్రగా కనిపించి పోటీ పడి మరీ నటించిందనే చెప్పాలి. అందం, అభినయంతో రష్మీక ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్‌, రఘుబాబు, కామెడీ టైమింగ్‌ బాగుంది. జిషుసేన్‌ గుప్త క్లాస్‌ విలన్‌గా కనిపించి మెప్పించారు. హీరోయిన్ హెబ్బా పటేల్‌ కనిపించేది తక్కువ సీన్లలోనైనా ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్‌ పాటలు ఎంతటి హిట్ గా నిలిచాయి. ఇక బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. స్క్రీన్‌ప్లే ఎక్కడ తడపడకుండా క్లీన్‌గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తన కెమెరా పనితనంతో సాయి శ్రీరామ్‌ సినిమాను చాలా ఉన్నతంగా చూపించారు. ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు రాజీపడకుండా నాగవంశీ సినిమా కోసం ఖర్చు చేసినట్టు చిత్రం చూస్తే అర్థమవుతుంది.

మొత్తంగా చెప్పాలంటే.. భీష్మ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ నితిన్ కెరీర్ మంచి బూస్ట్ ఇచ్చే చిత్రంగా నిలిచిపోతుంది.. ప్రేక్షకులకు నవ్వుల నజరానా అని చెప్పాలి.


సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే...పూర్తి సినిమాను థీయేటర్ కు వెళ్లి చూడాల్సిందిగా కోరుతున్నాం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories