Bhairavam :'డుం డుమారే' అంటూ 'భైరవం' నుండి మూడో పాట వచ్చేసింది

Bhairavam
x

Bhairavam :'డుం డుమారే' అంటూ 'భైరవం' నుండి మూడో పాట వచ్చేసింది

Highlights

Bhairavam's Dum Dumaare Song: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సందడి మళ్లీ మొదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం' విడుదలకు సిద్ధమవుతోంది.

Bhairavam's Dum Dumaare Song: టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సందడి మళ్లీ మొదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'భైరవం' విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి స్నేహానికి ప్రాణం పోసే 'డుం డుమారే' అనే పాట విడుదలైంది. రంగుల కార్నివాల్ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట, ముగ్గురు హీరోల మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. శ్రీ చరణ్ పాకాల అందించిన అదిరిపోయే సంగీతం, భాస్కరభట్ల సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భైరవం' చిత్రాన్ని కేకే రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ అధినేత డాక్టర్ జయంతిలాల్ గడా ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మే 30న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాలోని మొదటి రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు విడుదలైన 'డుం డుమారే' పాట కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ పాటలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి సందడి చేస్తున్నారు. వారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. భాస్కరభట్ల అందించిన సాహిత్యం స్నేహం గొప్పతనాన్ని హృద్యంగా వర్ణిస్తోంది. రేవంత్, సాహితి చాగంటి తమ గాత్రంతో పాటకు మరింత ఉత్సాహాన్నిచ్చారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ కన్నుల పండుగలా ఉంది.

'డుం డుమారే' కేవలం ఒక పాట కాదు. ఇది స్నేహానికి ఒక గొప్ప వేడుక. ఈ పాటను పెద్ద తెరపై చూస్తే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కాడలి ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. సత్యాంశి, టూమ్ వెంకట్ మాటలు రాశారు.




Show Full Article
Print Article
Next Story
More Stories