కమ్ బ్యాక్ సినిమాతో అలరించలేకపోయిన ఒకప్పటి హీరోయిన్

కమ్ బ్యాక్ సినిమాతో అలరించలేకపోయిన ఒకప్పటి హీరోయిన్
కమ్ బ్యాక్ సినిమాతో అలరించలేకపోయిన ఒకప్పటి హీరోయిన్
Bhagyashree: గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఒకప్పటి హీరోయిన్ తాజాగా మళ్లీ ప్రేక్షకులను పలకరించారు. "మైనే ప్యార్ కియా" అనే హిందీ సినిమాలో నటించిన భాగ్యశ్రీ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో కూడా "ప్రేమ పావురాలు" అనే పేరుతో విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఆ సినిమా తర్వాత పెళ్లి చేసుకున్న భాగ్యశ్రీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఈ మధ్యనే "స్మార్ట్ జోడి" అనే ఒక రియాలిటీ షోలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన భాగ్యశ్రీ ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యామ్" సినిమాతో వెండితెర అభిమానులను కూడా పలకరించింది.
ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించిన భాగ్యశ్రీ తన నటనతో బాగానే ఆకట్టుకున్నప్పటికీ తన పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. ఆఖరికి హిందీ ప్రేక్షకులు కూడా ఆమె పాత్ర వల్ల నిరాశ చెందారు. మరోవైపు "తలైవి" సినిమాలో కూడా జయలలిత తల్లి పాత్రలో కనిపించిన భాగ్యశ్రీ ఆ సినిమాతో కూడా అలరించలేకపోయింది. మరి ఇప్పటికైనా భాగ్యశ్రీ మంచి కంబ్యాక్ ఇస్తారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపైన అయినా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకోమని అభిమానులు చెబుతున్నారు.
నామినేషన్ దాఖలు చేసిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా
27 Jun 2022 7:42 AM GMTAliabhatt: తల్లికాబోతున్న నటి ఆలియా భట్.. స్కానింగ్ పిక్ వైరల్..
27 Jun 2022 7:38 AM GMTEknath Shinde: మహారాష్ట్ర గవర్నర్‌కు షిండే వర్గం లేఖ
27 Jun 2022 7:26 AM GMTశివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌కు ఈడీ సమన్లు
27 Jun 2022 7:25 AM GMTయాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్‌లో కాంగ్రెస్ రచ్చబండ
27 Jun 2022 7:15 AM GMT