Actress: భద్రాచలం హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఏం చేస్తోందంటే..

Actress: భద్రాచలం హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఏం చేస్తోందంటే..
x
Highlights

Bhadrachalam Actress Sindhu Menon: సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉన్నన్ని రోజులు హీరోయిన్లు లైట్‌ లైట్‌లో ఉండరనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Bhadrachalam Actress Sindhu Menon: సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉన్నన్ని రోజులు హీరోయిన్లు లైట్‌ లైట్‌లో ఉండరనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత టాప్‌ హీరోయిన్‌ అయినా కొంత కాలం తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి. లేదంటే స్వయంగా తమంతట తామే తెరకు దూరవుతుంటారు. కొందరు వివాహం చేసుకుంటే మరికొందరు వ్యాపారాల్లో బిజీ అయిపోతుంటారు. అలా సినిమాలకు దూరమైన ఓ నటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీమణుల్లో హీరోయిన్ సింధు మీనన్ ఒకరు. కర్ణాటకలో జన్మించిన సింధు మీనన్‌ మలయాళీ కుటుంబానికి చెందినవారు. ఆమె 1994లో ‘రష్మీ’ అనే కన్నడ సినిమాతో బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి సుమారు 40కి పైగా చిత్రాల్లో నటించింది.

తెలుగులో ఆమె తొలి చిత్రం 2001లో శ్రీహరి హీరోగా నటించిన 'భద్రాచలం'. ఈ సినిమా రిలీజ్‌ టైమ్‌లో సింధు వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'చందమామ' చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. తన హోమ్లీ లుక్‌, సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2010లో డొమినిక్ ప్రభు అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్న సింధు, 2012లో ‘సుభద్ర’ అనే తెలుగు సినిమాతో తన కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టింది.

ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో కలిసి లండన్‌లో నివసిస్తోంది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాలో యాత్రం యాక్టివ్‌గా ఉంటోంది సింధు. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె స్టైలిష్ లుక్స్‌ను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories