త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్న బండ్ల గణేష్

Bandla Ganesh Making Shocking Comments About Trivikram
x

త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తున్న బండ్ల గణేష్

Highlights

* పవన్ కళ్యాణ్ స్నేహితుడి గురించి కౌంటర్లు వేస్తున్న బండ్ల గణేష్

Bandla Ganesh: కమెడియన్ గా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా కొన్ని సినిమాల్లో నటించారు బండ్ల గణేష్. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అయితే తన సినిమాల కంటే ఎక్కువగా తన స్టేట్మెంట్ల కారణంగానే ఎప్పటికప్పుడు బండ్ల గణేష్ వార్తలు నిలుస్తూ ఉంటారు. ఆడియో ఫంక్షన్ లో లేదా సినిమా ఈవెంట్లలో మాట్లాడుతూ ఇప్పటికే బండ్ల గణేష్ ఎన్నో వివాదాస్పద కామెంట్లు చేశారు.

ఇక పవన్ కళ్యాణ్ సినిమా వేడుక అయితే బండ్ల గణేష్ హడావిడి గురంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ తన దేవుడు అంటూ బండ్ల గణేష్ ఇప్పటికే ఎన్నో కామెంట్లు పవన్ కళ్యాణ్ పై చేశారు. అయితే తాజాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తన ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండ్ల గణేష్ మరొకసారి వివాదంలో ఇరుక్కున్నారు. పవన్ కళ్యాణ్ టాలెంట్ ని తాను ఎప్పుడో గుర్తించానని పవన్ కళ్యాణ్ ఒక మామూలు వ్యక్తి కాదని తనకు ఎప్పటినుంచో తెలుసని కానీ ఇప్పుడు జనాలు వేరొకరిని గురూజీ అని పిలుస్తున్నారని ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ ను అంటున్నారు బండ్ల.

పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎంతో మంచి స్నేహం ఉంది. పవన్ కళ్యాణ్ ను ఎవరైనా సంప్రదించాలి అనుకుంటే ముందుగా త్రివిక్రమ్ నుంచి వెళ్తారు. ఒకప్పుడు త్రివిక్రమ్ మరియు బండ్ల గణేష్ కూడా క్లోజ్ గానే ఉండేవాళ్ళు. త్రివిక్రమ్ తనకు చాలా మంచి స్నేహితుడని బండ్ల గణేష్ స్వయంగా చెప్పారు. కానీ చూస్తూ ఉంటే వీరిద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు వచ్చినట్లు అర్థమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories