Pawan Kalyan - Bandla Ganesh: పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడిని వెతికే పనిలో ఉన్న బండ్ల గణేష్

Bandla Ganesh Searching Director For Pawan Kalyan Movie
x

Pawan Kalyan - Bandla Ganesh: పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడిని వెతికే పనిలో ఉన్న బండ్ల గణేష్

Highlights

Pawan Kalyan - Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం చేయాలనేది ప్రతి ఒక్క నిర్మాత కోరికే..

Pawan Kalyan - Bandla Ganesh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం చేయాలనేది ప్రతి ఒక్క నిర్మాత కోరికే కానీ అలాంటి అవకాశం వచ్చిన బండ్ల గణేష్ మాత్రం ఈ సినిమా కోసం చాలానే కష్టపడుతున్నాడు. బండ్ల గణేష్ పవర్ స్టార్ ను తన దేవుడిగా కొలుస్తాడు అనే విషయం అందరికీ తెలిసిందే. బండ్ల గణేష్ మరియు పవర్ స్టార్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'తీన్ మార్' మరియు 'గబ్బర్ సింగ్' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన బండ్లగణేష్ పవన్ కళ్యాణ్ హీరోగా మరొక చిత్రం నిర్మించనున్నాడు.

అయితే ఈ సినిమా కోసం ఒక మంచి కథ మరియు దర్శకుడి కోసం బండ్ల గణేష్ ఎప్పటినుంచో గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు దర్శకులు కథలు నెరేట్ చేసినప్పటికీ బండ్ల కు నచ్చిన కథ ఇప్పటివరకు తారసపడలేదు. మరోవైపు ఈ మధ్యనే 'వకీల్ సాబ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవన్ 'హరిహర వీరమల్లు' మరియు 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ సినిమాలతో బిజీగా ఉండడంతో బండ్ల గణేష్ తో చేయాల్సిన సినిమా మొదలవడానికి మరొక ఐదు నెలలు పట్టే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories