రవితేజతో మూడోసారి.. ఈ సారి బాలయ్య నెగ్గుతాడా?

రవితేజతో మూడోసారి.. ఈ సారి బాలయ్య నెగ్గుతాడా?
x
Highlights

సంక్రాతి వార్ ఇప్పటికే ఫిక్స్ అయింది. మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ గా సినిమాలు రాబోతున్నాయి. ఇక అదే టైంలో తన సినిమాని కుడా నిలపాలని ముందుగా...

సంక్రాతి వార్ ఇప్పటికే ఫిక్స్ అయింది. మహేష్ వర్సెస్ అల్లు అర్జున్ గా సినిమాలు రాబోతున్నాయి. ఇక అదే టైంలో తన సినిమాని కుడా నిలపాలని ముందుగా అనుకున్నాడు బాలయ్య... కానీ ఇప్పుడు వారికంటే ముందే రావాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ తన 105వ సినిమాని కే యస్ రవికుమార్ దర్శకత్వంలో చేయనున్నారు..దీనికి రూలర్ అనే టైటిల్ ని కూడా కన్ఫర్మ్ చేసారు. సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. సోనాలి చౌహాన్,వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మొదటినుండి బాలయ్యకి సంక్రాంతి హీరో అని పేరు కూడా ఉంది. ఈ సినిమాని కూడా సంక్రాంతి బరిలో ఉంచాలని అనుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో కాకుండా డిసెంబర్ లోనే నిలపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 20న విడుదల చేయలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అదే రోజే మాస్ రాజా రవితేజ డిస్కో రాజా సినిమా కూడా విడుదల కానుంది. క్రిస్మస్ సేలువులని టార్గెట్ చేస్తూ ఈ సినిమాలని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

గతంలో రవితేజ, బాలకృష్ణ సంక్రాంతి బరిలో రెండు సార్లు పోటి పడ్డారు. ఇందులో రెండు సార్లు బాలకృష్ణపై రవితేజ పైచేయి సాధించాడు. మొదటిసారిగా రవితేజ కృష్ణ సినిమాతో వస్తే బాలకృష్ణ ఒక్క మొగాడు సినిమాని రిలీజ్ చేసాడు. ఇక రెండవ సారి రవితేజ మిరపకాయ్ సినిమాతో వస్తే బాలకృష్ణ పరమవీరచక్ర సినిమాని రిలీజ్ చేసాడు. కానీ రెండు సార్లు రవితేజ సినిమాలే హిట్టు అయ్యాయి. మరీ ఈ సారి అయిన రవితేజపై హిట్టు కొడుతడా లేదా అన్నది చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories