వాడు నా చేతిలో అయిపోయాడు.. ఖతం అంటూ బాలయ్య వార్నింగ్..

Balakrishna Sweet Warning to his Fan in Unstoppable With NBK
x

వాడు నా చేతిలో అయిపోయాడు.. ఖతం అంటూ బాలయ్య వార్నింగ్..

Highlights

Unstoppable With NBK: ఆహా లోని "అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే" షో తో హోస్ట్ గా మారిన నందమూరి బాలకృష్ణ తన ఎనర్జీ, చమత్కారం మరియు పంచులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Unstoppable With NBK: ఆహా లోని "అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే" షో తో హోస్ట్ గా మారిన నందమూరి బాలకృష్ణ తన ఎనర్జీ, చమత్కారం మరియు పంచులతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సెలబ్రిటీలతో సాగే ఈ టాక్ షో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. తాజాగా ఈ షోకి గెస్ట్ లుగా "లైగర్" సినిమా బృందం విచ్చేసింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ ఈ ఎపిసోడ్ లో కనిపించారు. తాజాగా ఈ ఎపిసోడ్ నుంచి విడుదలైన ఒక క్లిప్పింగ్ లో మాట్లాడుతూ బాలకృష్ణ ఈ షో ఒప్పుకునే ముందు తాను అందరిలాగా షో అనగానే 4 క్వశ్చన్ లు అడిగి పంపలేనని వచ్చిన వారితో ఆడుకుంటాను అని ముందుగానే కండిషన్ పెట్టినట్లు చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ ని అక్కడే ఉన్న సౌండ్ బ్యాగ్ కి ఒక పంచ్ ఇవ్వమని అడిగారు బాలయ్య. సినిమాలో ఒక బాక్సర్ పాత్రలో కనిపించనున్న విజయ్ దేవరకొండ బాలయ్య చెప్పినట్లే వెళ్లి గట్టిగానే పంచ్ ఇచ్చాడు. ఇక బాలకృష్ణ తను నటించిన మొదటి సినిమా ఏది అని అడగగా విజయ్ దేవరకొండ తడబడ్డాడు. దీంతో అభిమానుల నుంచి ఒకరు ఠక్కున లేచి "తాతమ్మకల" అంటూ ఆన్సర్ చెప్పేసాడు. దీంతో బాలకృష్ణ "వాడు నా చేతిలో అయిపోయాడు.. ఖతం" అంటూ సరదాగా వార్నింగ్ ఇవ్వడంతో అక్కడున్న వారందరూ నవ్వేశారు. ఇలా అభిమానికి బాలకృష్ణ ఇచ్చిన వార్నింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories